కొత్తగా తెచ్చిన మూడు నేర విచారణ చట్టాల అమలు విజయవంతం
December 02nd, 07:05 pm
పెనుమార్పులతో తీసుకువచ్చిన మూడు కొత్త నేర విచారణ చట్టాలు.. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్‌లను విజయవంతం కావడాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, 2024 డిసెంబర్ 3న మధ్యాహ్నం 12 గంటలకు చండీగఢ్‌లో ఏర్పాటైన ఓ కార్యక్రమంలో జాతికి అంకితం చేయనున్నారు.సభాపతి ఎన్నిక అనంతరం 18వ లోక్ సభలో ప్రధాని ప్రసంగం పాఠం
June 26th, 11:30 am
మీరు రెండోసారి సభాధ్యక్షులుగా ఎన్నికవడం సభ అదృష్టం. మీతో పాటు సభ మొత్తానికి నా తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను.స్పీకర్ ఎన్నికైన తరువాత లోక్ సభ ను ఉద్దేశించిప్రసంగించిన ప్రధాన మంత్రి
June 26th, 11:26 am
వరుసగా రెండో సారి స్పీకర్ గా పదవీ బాధ్యతల ను స్వీకరించిన శ్రీ ఓం బిర్ లా కు ప్రధాన మంత్రి స్వాగతం పలికారు. సభ పక్షాన స్పీకరు కు శుభాకాంక్షల ను ప్రధాన మంత్రి వ్యక్తం చేశారు. అమృత కాలం లో రెండో సారి శ్రీ ఓం బిర్ లా పదవీ బాధ్యతల ను చేపట్టడానికి ఉన్నటువంటి ప్రాముఖ్యాన్ని ప్రధాన మంత్రి తెలియపరుస్తూ, అయిదు సంవత్సరాలు గా ఆయన కు ఉన్న అనుభవం మరియు ఆయన తో సభ్యుల కు ఉన్న అనుభవం.. ఇవి రెండు కూడాను తిరిగి ఎన్నికైన స్పీకరు ఈ ముఖ్యమైన కాలాల్లో సభ కు మార్గదర్శకత్వం వహించేందుకు వీలు ను కల్పించగలవన్న ఆశ ను ప్రధాన మంత్రి వెలిబుచ్చారు. స్పీకరు కు ఉన్నటువంటి నమ్రత నిండిన వ్యక్తిత్వం మరియు ఆయన మోము లోని విజయం తొణికిసలాడే చిరునవ్వు .. ఈ రెండు అంశాలు సభ ను నిర్వహించడం లో స్పీకరు కు అండదండలను అందిస్తాయని ప్రధాన మంత్రి అన్నారు.భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, 2023; భారతీయ న్యాయ సంహిత, 2023; భారతీయ సాక్ష్య అధినియమ్, 2023 మన దేశ చరిత్రలో కలకాలం నిలిచిపోయే ఘట్టాలు : పిఎం
December 21st, 09:10 pm
భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, 2023; భారతీయ న్యాయ సంహిత, 2023; భారతీయ సాక్ష్య అధినియమ్, 2023 బిల్లులను పార్లమెంటు ఆమోదించడాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కొనియాడుతూ భారతదేశ చరిత్రలో ఇది ఒక చారిత్రక ఘట్టమన్నారు. ఈ బిల్లులు సమాజంలో పేదలు, నిరాదరణకు గురవుతున్న వర్గాలకు రక్షణను పెంచడంతో పాటు వ్యవస్థీకృత నేరాలు, ఉగ్రవాదం, అదే తరహాలోని ఇతర నేరాలను అణచివేస్తాయని ఆయన నొక్కి చెప్పారు. ఈ న్యాయ సంస్కరణలు భారతదేశ న్యాయవ్యవస్థ స్వరూపాన్ని పునర్నిర్వచించడంలో పాటు ప్రస్తుత అమృత కాలానికి సరిపోయేవిగా ఉంటాయని ప్రధానమంత్రి అన్నారు. రాజ్యసభలో ఈ బిల్లులపై హోంమంత్రి శ్రీ అమిత్ షా ప్రసంగం వీడియోను కూడా ఆయన షేర్ చేశారు.