జనవరి 12 వ తేదీ న మహారాష్ట్ర ను సందర్శించనున్నప్రధాన మంత్రి
January 11th, 11:12 am
భారతదేశం లో వివిధ ప్రాంతాల కు చెందిన యువజనులు ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ భావన తో వారి అనుభవాల ను వ్యక్తం చేయడం కోసం మరియు కలిసికట్టు గా దేశం యొక్క పునాది ని బలపరచడం కోసం తగిన వేదిక ను అందించడం ఎన్వైఎఫ్ యొక్క సంకల్పం. దేశం అంతటి నుండి దాదాపు గా 7,500 మంది యువ ప్రతినిధులు నాసిక్ లో నిర్వహించే ఈ ఉత్సవం లో పాలుపంచుకోనున్నారు. ఈ ఉత్సవం లో భాగం గా సాంస్కృతిక ప్రదర్శనల ను, దేశవాళీ ఆటల ను, ప్రసంగం మరియు విషయగత ఆధారిత సమర్పణ, యువ కళాకారుల శిబిరం, పోస్టర్ లను తయారు చేయడం, కథా రచన, యువజన సమ్మేళనం, ఆహార పదార్థాల మహోత్సవం నిర్వహణ తదితర కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది.