జూలై 12న దియోఘర్, పాట్నాలను సందర్శించనున్న ప్రధానమంత్రి
July 09th, 09:35 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ 2022 జూలై 12న దియోఘర్, పాట్నాలను సందర్శించనున్నారు. మధ్యాహ్నం 1.15 గంటలకు ప్రధానమంత్రి 16,000 కోట్ల రూపాయలకు పైగా విలువగల పలు అభివృద్ధి పనులకు దియోఘర్ లో శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం 12.40 గంటలకు ప్రధానమంత్రి బాబావైద్యనాథ్ ఆలయాన్ని దర్శించి పూజలు చేయనున్నారు. బాబా వైద్యనాథ ఆలయం 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. సాయంత్రం 6 గంటలకు ప్రధానమంత్రి పాట్నాలో బీహార్ శాసనసభ శతవార్షికోత్సవాలలో ప్రసంగిస్తారు.ఈ నెల 14న తమిళ నాడు ను, కేరళ ను సందర్శించనున్న ప్రధాన మంత్రి
February 12th, 06:10 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 14న తమిళ నాడు, కేరళ రాష్ట్రాల ను సందర్శించనున్నారు. పగటి పూట 11 గంటల 15 నిముషాల కు చెన్నై లో ప్రధాన మంత్రి అనేక కీలకమైన ప్రాజెక్టుల కు ప్రారంభోత్సవం/శంకు స్థాపన చేస్తారు. అర్జున్ ప్రధాన యుద్ధ ట్యాంకు (ఎమ్‌కె-1ఎ)ని సైన్యాని కి అప్పగిస్తారు. సాయంత్రం 3 గంటల 30 నిముషాల కు కొచ్చి లో వివిధ ప్రాజెక్టుల ను దేశానికి అంకితం చేయడంతో పాటు, కొన్ని పథకాల కు శంకు స్థాపన కూడా చేస్తారు. ఈ ప్రాజెక్టులు ఆయా రాష్ట్రాల వృద్ధి గతికి కీలకమైన వేగాన్ని జత పరచడమే కాకుండా, పూర్తి స్థాయి అభివృద్ధి సామర్ధ్యాన్ని సంతరించుకోవడానికి తోడ్పడుతాయి.