భారతదేశంపై క్విజ్: పాల్గొనాలంటూ ప్రవాస భారతీయులకు విజ్ఞప్తి చేసిన ప్రధానమంత్రి

November 23rd, 09:15 am

భారతదేశం గురించి తెలుసుకోండి (భారత్ కో జానియే) అంటూ నిర్వహిస్తున్న క్విజ్ కార్యక్రమంలో ప్రవాస భారతీయులందరూ పాల్గొనాలంటూ ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయులు భారతదేశంతో అనుసంధానమయ్యేందుకు ఈ క్విజ్ ఉపకరిస్తుందని ఆయన అన్నారు. మన వారసత్వం, జాజ్వల్యమానమైన సంస్కృతి గురించి తెలుసుకునేందుకు లభించిన గొప్ప అవకాశంగా దీనిని అభివర్ణించారు.