భక్తి కాలం నాటి సామాజిక విప్లవం లేకుండా భారతదేశ స్థితి మరియు రూపాన్ని ఊహించుకోవడం కష్టం: ప్రధాని మోదీ

September 01st, 04:31 pm

శ్రీల భక్తివేదాంత స్వామి ప్రభుపాద జీ 125 వ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ప్రత్యేక స్మారక నాణేన్ని విడుదల చేశారు. బానిసత్వ కాలంలో, భక్తి భారతదేశ స్ఫూర్తిని సజీవంగా ఉంచుతుందని ప్రధాని అన్నారు. భక్తి కాలం నాటి సామాజిక విప్లవం లేనట్లయితే, భారతదేశ స్థితి మరియు రూపాన్ని ఊహించుకోవడం కష్టంగా ఉండేదని నేడు పండితులు అంచనా వేస్తున్నారని ఆయన అన్నారు.

శ్రీల భ‌క్తివేదాంత‌ స్వామి ప్ర‌భుపాద గారి 125 వ జ‌యంతి సంద‌ర్భం లో ఒక ప్ర‌త్యేకమైన స్మార‌క నాణేన్ని విడుద‌ల చేసిన ప్ర‌ధాన మంత్రి

September 01st, 04:30 pm

శ్రీ‌ల భ‌క్తివేదాంత స్వామి ప్ర‌భుపాద గారి 125వ జ‌యంతి సంద‌ర్భం లో ఒక ప్ర‌త్యేక‌మైన స్మార‌క నాణేన్ని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా ఆవిష్కరించారు. ఈ సంద‌ర్భం లో సంస్కృతి, ప‌ర్య‌ట‌న‌, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ (డిఒఎన్ఇఆర్) కేంద్ర మంత్రి శ్రీ జి. కిష‌న్ రెడ్డి త‌దిత‌రులు పాలుపంచుకొన్నారు.

శ్రీల భ‌క్తివేదాంత స్వామి ప్ర‌భుపాద గారి 125వ జ‌యంతి సంద‌ర్భం లో సెప్టెంబ‌ర్ 1న ఒక ప్ర‌త్యేక స్మార‌క నాణేన్ని విడుద‌ల చేయ‌నున్న ప్ర‌ధాన మంత్రి

August 31st, 03:04 pm

శ్రీల భ‌క్తివేదాంత స్వామి ప్ర‌భుపాద గారి 125వ జ‌యంతి సంద‌ర్భం లో 125 రూపాయ‌ల విలువైన ఒక ప్ర‌త్యేక స్మార‌క నాణేన్ని 2021 సెప్టెంబ‌ర్ 1 న సాయంత్రం 4గంటల 30 నిమిషాలకు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా విడుదల చేయ‌డ‌మే కాకుండా స‌మూహాన్ని ఉద్దేశించి ప్ర‌సంగించ‌నున్నారు.