Joint Statement: 2nd India-Australia Annual Summit

November 19th, 11:22 pm

PM Modi and Anthony Albanese held the second India-Australia Annual Summit during the G20 Summit in Rio de Janeiro. They reviewed progress in areas like trade, climate, defence, education, and cultural ties, reaffirming their commitment to deepen cooperation. Both leaders highlighted the benefits of closer bilateral engagement and emphasized advancing the Comprehensive Economic Cooperation Agreement (CECA) to strengthen trade and investment ties.

ధన్వంతరి జయంతి, 9వ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా వివిధ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్న ప్రధానమంత్రి

October 28th, 12:47 pm

ధన్వంతరి జయంతి, 9వ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వివిధ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. ఆరోగ్య రంగానికి చెందిన సుమారు రూ.12,850 కోట్ల ప్రాజెక్టులకు అక్టోబర్ 29వ తేదీన మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో న్యూఢిల్లీలోని అఖిల భారత ఆయుర్వేద సంస్థ (ఏఐఐఏ)లో ప్రధానమంత్రి ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు.

బెంగళూరులో కూలిన భవంతి: మృతుల కుటుంబాలకు ప్రధాని సంతాపం పీఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి నష్టపరిహారం

October 24th, 07:47 am

బెంగళూరులో ఒక భవంతి కూలిన సంఘటనలో దుర్మరణం చెందిన వారి కుటుంబాలకు ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున నష్టపరిహారాన్ని ‘ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి’ (పీఎమ్ఎన్ఆర్ఎఫ్) నుంచి ఇవ్వనున్నట్లు శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారు.

భారత్, మాల్దీవులు: సమగ్ర ఆర్థిక, నౌకా వాణిజ్య భద్రతా భాగస్వామ్యమే లక్ష్యం

October 07th, 02:39 pm

1. ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ, మాల్దీవుల అధ్యక్షుడు డా. మహ్మద్ ముయిజ్జు ఈరోజు (అక్టోబర్ 7, 2024) సమావేశమయ్యారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను, రెండు దేశాల ప్రజల మధ్య చారిత్రక సన్నిహిత సంబంధాలు మెరుగుపరుచుకోవడంలో సాధించిన ప్రగతిని సమగ్రంగా సమీక్షించారు.

శ్రీ నాదప్రభు కెంపెగౌడ కు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి

June 27th, 04:06 pm

శ్రీ నాదప్రభు కెంపెగౌడ కు ఆయన జయంతి సందర్భం గా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ని ఘటించారు. ఆర్థిక అభ్యున్నతి వ్యవసాయం, సేద్యపు నీటిపారుదల మరియు అనేక ఇతర రంగాల లో వృద్ధి కి దోహదం చేసే విధానాల లో శ్రీ నాదప్రభు కెంపెగౌడ ఒక మార్గదర్శి గా నడుచుకొన్నారు అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

Bengaluru Viksit Bharat Ambassadors Gather for an ‘Evening of Music and Meditation’ on Ram Navami

April 18th, 05:13 pm

On Wednesday, April 17th, over 10,000 people from different s gathered at The Art of Living International Centre in Bengaluru for an event called An Evening of Music and Meditation with Viksit Bharat Ambassadors. The attendees included people from all walks of life, including Art of Living disciples, instructors, professionals, and educated inpiduals of various ages.

బోయింగ్ ఇండియా ఇంజనీరింగ్, టెక్నాలజీ సెంటర్ ప్రారంభోత్సవం మరియు బోయింగ్ సుకన్య ప్రోగ్రామ్ ప్రారంభోత్సవంలో ప్రధాన మంత్రి ప్రసంగం

January 19th, 03:15 pm

కర్ణాటక గవర్నర్ శ్రీ థావర్ చంద్ గెహ్లాట్ గారు, ముఖ్యమంత్రి శ్రీ సిద్దరామయ్య గారు, కర్ణాటక అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, ఆర్ అశోక్ గారు, భారతదేశంలో బోయింగ్ కంపెనీ సిఒఒ స్టెఫానీ పోప్, ఇతర పరిశ్రమ భాగస్వాములు, మహిళలు మరియు పెద్దమనుషులు!

అత్యధునాతనమైన బోయింగ్ ఇండియా ఇంజినీరింగ్ & టెక్నాలజీ సెంటర్ కేంపస్ ను కర్నాటక లోని బెంగళూరు లోప్రారంభించిన ప్రధాన మంత్రి

January 19th, 02:52 pm

అత్యధునాతనమైనటువంటి బోయింగ్ ఇండియా ఇంజినీరింగ్ & టెక్నాలజీ సెంటర్ (బిఐఇటిసి) కేంపసు ను కర్నాటక లోని బెంగళూరు లో ఈ రోజు న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. 1,600 కోట్ల రూపాయల పెట్టుబడి తో నిర్మాణం పూర్తి అయిన ఈ 43 ఎకరాల విస్తీర్ణం లో ఏర్పాటైన కేంపస్ యుఎస్ఎ కు వెలుపల బోయింగ్ పెట్టిన అతి పెద్ద పెట్టుబడి అని చెప్పాలి. శరవేగం గా వృద్ధి చెందుతున్నటువంటి దేశ విమానయాన రంగం లో భారతదేశం లో వివిధ ప్రాంతాల యువతులు అధిక సంఖ్య లో ప్రవేశించడాని కి వీలుగా వారిని ప్రోత్సహించాలన్న లక్ష్యం తో రూపుదిద్దిన బోయింగ్ సుకన్య కార్యక్రమాన్ని కూడా ప్రధాన మంత్రి ప్రారంభించారు.

జనవరి 19న మహారాష్ట్ర.. కర్ణాటక.. తమిళనాడులలో ప్రధాని పర్యటన

January 17th, 09:32 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జనవరి 19వ తేదీన మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ఆ రోజున ఉదయం 10:45 గంటల ప్రాంతంలో ఆయన మహారాష్ట్రలోని షోలాపూర్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడంతోపాటు శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 2:45 గంటలకు కర్ణాటకలోని బెంగళూరు నగరంలో ‘బోయింగ్ ఇండియా ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ సెంటర్‌’ను, ‘బోయింగ్ సుకన్య ప్రోగ్రామ్‌’ను ప్రధాని ప్రారంభిస్తారు. ఆ తర్వాత సాయంత్రం 6:00 గంటలకు తమిళనాడులోని చెన్నై నగరంలో ‘ఖేలో ఇండియా-2023’ యువజన క్రీడల ప్రారంభ కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటారు.

అంతర్గత అలంకరణలో కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం రెండో టెర్మినల్ ప్రపంచ ప్రత్యేక బహుమతి గెలవడంపై బెంగళూరు ప్రజలకు ప్రధాని అభినందన

December 23rd, 05:53 pm

కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం రెండో టెర్మినల్ విమానాశ్రయాల విభాగంలో అంతర్గత అలంకరణలో ప్రపంచ ప్రత్యేక బహుమతి-2023 గెలుచుకోవడంపై బెంగళూరు ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నిరుడు ఈ భవన ప్రారంభోత్సవం చిత్రాలను కూడా ఆయన ప్రజలతో పంచుకున్నారు.

Aatmanirbharta in Defence: India First Soars as PM Modi Takes Flight in LCA Tejas

November 28th, 03:40 pm

Prime Minister Narendra Modi visited Hindustan Aeronautics Limited (HAL) in Bengaluru today, as the state-run plane maker experiences exponential growth in manufacturing prowess and export capacities. PM Modi completed a sortie on the Indian Air Force's multirole fighter jet Tejas.

బెంగళూరు మెట్రోలో పర్పల్ లైను కు చెందిన రెండు కీలకమైన భాగాల లో సేవ లు ఆరంభం కావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

October 09th, 06:28 pm

బెంగళూరు మెట్రో లో పర్పల్ లైను కు చెందిన రెండు ప్రముఖ భాగాల లో సేవ లు ఆరంభం అయినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

దక్షిణాఫ్రికా, గ్రీస్ ల పర్యటన ఫలవంతం చేసుకుని తిరిగి వచ్చిన ప్రధానమంత్రికి బెంగళూరులో అద్భుత స్వాగతం

August 26th, 10:08 am

దక్షిణాఫ్రికా, గ్రీస్ దేశల్లో నాలుగు రోజుల పాటు పర్యటించిన అనంతరం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేరుగా బెంగళూరు వచ్చారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దక్షిణాఫ్రికాలో బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొని అనంతరం గ్రీస్ సందర్శించారు. పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి వివిధ ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొనడంతో పాటు స్థానిక నాయకులతో కూడా సమావేశమయ్యారు. ఉభయ దేశాల్లోను భారతీయ సమాజానికి సంబంధించిన ప్రజలనున కూడా ఆయన కలుసుకున్నారు. చంద్రయాన్-3 మూన్ లాండర్ చంద్ర మండలంపై దిగడాన్ని వీడియో కాన్ఫరెన్సింగ్ విధానంలో ప్రత్యక్షంగా వీక్షించిన ప్రధానమంత్రి ఇస్రో టీమ్ తో సంభాషించడానికి బెంగళూరు వచ్చారు.

దక్షిణాఫ్రికా, గ్రీస్ నుంచి తిరిగి రాగానే ఆగస్టు 26వ తేదీన బెంగళూరులోని ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్ వర్క్ ను సందర్శించనున్న ప్రధానమంత్రి

August 25th, 08:10 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దక్షిణాఫ్రికా, గ్రీస్ పర్యటనల నుంచి తిరిగి రాగానే నేరుగా బెంగళూరు వెళ్లి ఇస్రో టెలీమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్ వర్క్ ను (ఇస్ర్టాక్) ఆగస్టు 26వ తేదీ ఉదయం 7.15 గంటలకు సందర్శించనున్నారు. దక్షిణాఫ్రికా, గ్రీస్ నుంచి నేరుగా ఆయన బెంగళూరు చేరతారు.

జి.20 డిజిటల్‌ ఎకానమీ మంత్రుల సమావేశం సందర్భంగా, ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ వీడియో సందేశం.

August 19th, 11:05 am

నమ్మ బెంగళూరు కు నేను మీకు స్వాగతం పలుకుతున్నాను. ఈ నగరం, శాస్త్ర సాంకేతిక రంగానికి, ఎంటర్‌ప్రెన్యుయర్‌షిప్‌ ప్రేరణకు నిలయం. డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ గురించి చర్చించడానికి బెంగళూరు ను మించిన ప్రదేశం మరోకటి లేదు.

జి-20 డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ మంత్రుల సమావేశంలో ప్రధాని ప్రసంగం

August 19th, 09:00 am

ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఇవాళ కర్ణాటకలోని బెంగళూరులో నిర్వహించిన జి-20 కూటమి డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ మంత్రుల సమావేశాన్ని ఉద్దేశించి వీడియో సందేశం ద్వారా ప్రసంగించారు. ముందుగా సమావేశానికి హాజరైన ప్రముఖులు, ప్రతినిధులకు స్వాగతం పలుకుతూ- విజ్ఞానం, సాంకేతికత, వ్యవస్థాపన స్ఫూర్తికి పుట్టినిల్లు వంటి బెంగళూరు నగరం ప్రాశస్త్యాన్ని కొనియాడారు. డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై చర్చించడానికి ఇంతకంటే మంచి ప్రదేశం మరొకటి ఉండదని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

బెంగళూరు లోని కేంబ్రిడ్జ్ లేఅవుట్ లో భారతదేశం లోని ఒకటో 3-డి ముద్రిత తపాలా కార్యాలయాన్ని ప్రశంసించిన ప్రధాన మంత్రి

August 18th, 01:15 pm

బెంగళూరు లోని కేంబ్రిడ్జ్ లేఅవుట్ లో భారతదేశం లోని ఒకటో 3-డి ముద్రిత తపాలా కార్యాలయం రూపుదాల్చడం మన దేశం యొక్క నూతన ఆవిష్కరణ లు మరియు ప్రగతి కి నిదర్శన గా ఉందంటూ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

Be it poor or middle-class, to fulfill every dream is Modi’s guarantee: PM Modi

August 01st, 02:00 pm

PM Modi flagged off metro trains marking the inauguration of completed sections of Pune Metro. Highlighting the contributions of Pune city in the freedom struggle, PM Modi said that the city has given numerous freedom fighters to the country including Bal Gangadhar Tilak. Pune is a vibrant city that gives momentum to the economy of the country and fulfills the dreams of the youth of the entire country. Today’s projects with about 15 thousand crore will further strengthen this identity”, the PM Modi said.

మహారాష్ట్రలోని పుణేలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని చేతుల మీదుగా ప్రారంభోత్సవం... శంకుస్థాపన

August 01st, 01:41 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ పుణే నగరంలో మెట్రో మార్గాల పరిధిలో పూర్తయిన సెక్షన్ల ప్రారంభోత్సవంలో భాగంగా పచ్చ జెండా ఊపి మెట్రో రైళ్లను కూడా ప్రారంభించారు. అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పిఎంఎవై) కింద పింప్రి-చించ్‌వాడ్ పురపాలక సంస్థ (పిసిఎంసి) నిర్మించిన 1,280 ఇళ్లతోపాటు పుణే నగరపాలక సంస్థ నిర్మించిన 2650 ఇళ్లను కూడా ఆయన లబ్ధిదారులకు అప్పగించారు. అంతేకాకుండా ‘పిఎంఎవై’ కింద ‘పిసిఎంసి’ నిర్మించే మరో 1,190 ఇళ్లతోపాటు పుణే నగరపాలిక ప్రాంతీయాభివృద్ధి ప్రాధికార సంస్థ నిర్మించబోయే 6,400 ఇళ్లకు ప్రధాని శంకుస్థాపన చేశారు. మరోవైపు ‘పిసిఎంసి’ ఆధ్వర్యంలో దాదాపు రూ.300 కోట్లతో నిర్మించిన ‘వ్యర్థం నుంచి విద్యుత్తు’ ప్లాంటును కూడా ఆయన ప్రారంభించారు.

స్వామిహ్‌ నిధి తొలి ప్రాజెక్టు కింద గృహాలు పొందినవారికి ప్రధానమంత్రి అభినందనలు

July 03rd, 10:08 pm

స్వామిహ్‌ నిధి కింద బెంగళూరులో తొలి ప్రాజెక్టులో భాగంగా గృహాలు పొందినవారికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. కాగా, ఈ ప్రాజెక్టు కింద దాదాపు 3,000 కుటుంబాలు తమ సొంత ఇంటి కలను సాకారం చేసుకున్నాయి.