పిఎం-కిసాన్ సమ్మాన్ నిధి కింద తదుపరి విడత ఆర్థిక సహాయం విడుదల చేసిన సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

August 09th, 12:31 pm

గత అనేక రోజులుగా, నేను ప్రభుత్వ వివిధ పథకాల లబ్ధిదారులతో చర్చిస్తున్నాను. ప్రభుత్వం రూపొందించిన పథకాల ప్రయోజనాలు ప్రజలకు ఎలా చేరుతున్నాయనే విషయం మనం మరింత మెరుగైన పద్ధతిలో తెలుసుకుంటున్నాం.ఇది జనతా జనార్దన్‌ తో ప్రత్యక్ష సంబంధం వల్ల కలిగే ప్రయోజనం. దేశ వ్యాప్తంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రివర్గం లోని నా సహచరులు, గౌరవనీయమైన ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు మరియు అనేక రాష్ట్రాల నుండి హాజరైన ఉప ముఖ్యమంత్రులు, రాష్ట్ర ప్రభుత్వాల మంత్రులు, ఇతర ప్రముఖులు, రైతులు మరియు సోదర సోదరీమణులారా,

పిఎమ్ కిసాన్ తాలూకు తొమ్మిదో కిస్తీ ని విడుదల చేసిన ప్రధాన మంత్రి

August 09th, 12:30 pm

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ (పిఎమ్ -కిసాన్) లో భాగం గా ఇచ్చే ఆర్థిక ప్రయోజనం తాలూకు తరువాతి కిస్తీ ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సోమవారం నాడు అంటే ఆగస్టు 9న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా విడుదల చేశారు. దీనితో 9.75 కోట్లకు పై చిలుకు లబ్ధిదారు రైతు కుటుంబాల కు 19,500 కోట్ల రూపాయల ఎంతో విలువైన సొమ్ము ను బదలాయించడానికి వీలు చిక్కింది. ఇది ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పిఎమ్-కిసాన్) లో భాగం గా ఇచ్చినటువంటి ఆర్థిక ప్రయోజనం తాలూకు తొమ్మిదో కిస్తీ. ఈ కార్యక్రమం లో లబ్ధిదారు రైతుల తో ప్రధాన మంత్రి మాట్లాడారు.

డిజిటల్ ఇండియా అభియాన్ 6వ వార్షికోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

July 01st, 11:01 am

కేంద్ర మంత్రివర్గంలోని నా సహచరులు శ్రీ రవిశంకర్ ప్రసాద్ గారు, శ్రీ సంజయ్ ధోత్రే గారు, డిజిటల్ ఇండియాతో, విభిన్న కార్యక్రమాలతో సంబంధం ఉన్న నా సహచరులు, సోదర సోదరీమణులందరూ! డిజిటల్ ఇండియా ప్రచారం ఆరు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మీ అందరికీ అనేక అభినందనలు!

‘డిజిట‌ల్ ఇండియా’ ల‌బ్దిదారుల తో మాట్లాడిన ప్ర‌ధాన మంత్రి

July 01st, 11:00 am

డిజిట‌ల్ ఇండియా’ కార్య‌క్ర‌మం ఆరంభమై ఆరు సంవ‌త్స‌రాలు పూర్తి అవుతున్న సంద‌ర్భం లో ‘డిజిట‌ల్ ఇండియా’ ల‌బ్దిదారుల తో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా మాట్లాడారు. ఈ సందర్బం లో కేంద్ర ఎల‌క్ట్రానిక్స్‌, స‌మాచార సాంకేతిక విజ్ఞాన శాఖ‌ కేంద్ర మంత్రి శ్రీ రవి శంకర్ ప్రసాద్, విద్య శాఖ స‌హాయ మంత్రి శ్రీ సంజయ్ శ్యామ్‌ రావు ధోత్రే లు కూడా పాలుపంచుకొన్నారు.

2021వ సంవత్సరం మార్చి 28 వ తేదీ న జరిగిన ‘మన్ కీ బాత్ ’ (‘మనసు లో మాట’ కార్యక్రమం) 75 భాగం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

March 28th, 11:30 am

2021వ సంవత్సరం మార్చి 28 వ తేదీ న జరిగిన ‘మన్ కీ బాత్ ’ (‘మనసు లో మాట’ కార్యక్రమం) 75 భాగం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం