పవిత్ర బసవ జయంతి సందర్భంగా బసవేశ్వరునికి ప్రధానమంత్రి నివాళి

April 23rd, 09:47 am

బసవ జయంతి పవిత్ర పర్వదినం సందర్భంగా జగద్గురు బసవేశ్వరునికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళి అర్పించారు. అలాగే ఒక విడియో క్లిప్‌ ద్వారా జగద్గురు బసవేశ్వరుని గురించి తన మనోభావాలను శ్రీ మోదీ ప్రజలతో పంచుకున్నారు.

బసవ జయంతి సందర్భంగా జగద్గురు బసవేశ్వరకు ప్రధానమంత్రి నివాళి

May 03rd, 11:30 am

నేడు బసవ జయంతి పర్వదినం నేపథ్యంలో జగద్గురు బసవేశ్వరకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళి అర్పించారు. ఈ సంద‌ర్భంగా 2020లో జ‌గ‌ద్గురు బ‌స‌వేశ్వ‌ర గురించి తాను చేసిన ప్రసంగాన్ని కూడా ఆయ‌న ప్ర‌జ‌ల‌తో పంచుకున్నారు.

‘బసవ జయంతి’ నేపథ్యంలో జగద్గురు బసవేశ్వరునికి ప్రధాని ప్రణామం

May 14th, 10:10 am

‘బసవ జయంతి’ సందర్భంగా జగద్గురు బసవేశ్వరునికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రణమిల్లారు.

ప్రతీ పౌరుడూ ముఖ్యుడే: మన్ కి బాత్ సందర్భంగా ప్రధాని మోదీ

April 30th, 11:32 am

తన మన్ కి బాత్ సందర్భంగా, ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ ఎర్ర బుగ్గల కారణంగానే దేశంలో విఐపి సంస్కృతి వృద్ధి చెందింది. “ మనం నవభారతదేశం కోసం మాట్లాడుకున్నప్పుడు, విఐపి కంటే ఈఐపి ముఖ్యం”అని అన్నారు. ఈఐపి అంటే-“ఎవ్రీ పర్సన్ ఇస్ ఇంపార్టెంట్ (ప్రతీ పౌరుడూ ముఖ్యుడే)”. సెలవులను భాగ ఉపయోగించుకోవాలని, కొత్త అనుభవాలను, కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాలని, కొత్త ప్రదేశాలను సందర్శించాలని ప్రధాని మోదీ కోరారు. ఆయన వేసవి గురించి, బిహెచ్ఐఎం యాప్ గురించి మరియు భారతదేశం వైవిధ్యం గురించి సుదీర్ఘంగా మాట్లాడారు.

సోషల్ మీడియా కార్నర్ - 1 ఏప్రిల్29

April 29th, 07:37 pm

సామాజిక మీడియా నుండి మీ రోజువారీ పాలన నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!

సుపరిపాలన, అహింసా మరియు సత్యాగ్రహ సందేశం ఇచ్చిన భారతదేశం: ప్రధాని

April 29th, 01:13 pm

బసవ జయంతిని పురష్కరించుకుని ఒక కార్యక్రమం గురించి మాట్లాడుతూ, భారతదేశ చరిత్ర ఓటమి, పేదరికం లేదా వలసవాదం గురించి మాత్రమే కాదు. భారతదేశం సుపరిపాలన, అహింస మరియు సత్యాగ్రహ సందేశానిచ్చిందని ప్రధాని మోదీ అన్నారు. ట్రిపుల్ తలాక్ అనుసరణ వల్ల ముస్లిం మహిళలు పడుతున్న బాధలను ఆపడానికి ముస్లిం సమాజంలోనే సంస్కర్తలు ఉద్భవిస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సమస్యను రాజకీయ కోణంలో చూసుకోవద్దని ఆయన ముస్లిం సమాజాన్ని కోరారు.

అంతర్జాతీయ బసవ కన్వెన్షన్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ

April 29th, 01:08 pm

న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో బసవ జయంతి 2017 ను పురష్కరించుకుని జరిగిన బసవ సమితి స్వర్ణోత్సవ వేడుకలలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ భారతదేశం యొక్క సాధువుల గొప్ప చరిత్ర గురించి మరియు సామాజిక సంస్కరణల కోసం అన్వేషణ చేపట్టిన సన్యాసుల గురించి మరియు వివిధ సమయాలలో జరిగిన పరివర్తన గురించి మాట్లాడారు.