బెల్జియం ప్రధానిగా శ్రీ బార్ట్ డీ వేవర్ పదవీబాధ్యతలు.. ప్రధానమంత్రి అభినందనలు

బెల్జియం ప్రధానిగా శ్రీ బార్ట్ డీ వేవర్ పదవీబాధ్యతలు.. ప్రధానమంత్రి అభినందనలు

February 04th, 09:00 am

బెల్జియం ప్రధాని గా శ్రీ బార్ట్ డీ వేవర్ పదవీబాధ్యతలను స్వీకరించిన సందర్భంగా ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆయనకు ఈ రోజు అభినందనలు తెలిపారు. భారత్-బెల్జియం సంబంధాల్ని మరింత బలపర్చుకోవడానికి, ప్రపంచ అంశాలపై సహకారాన్ని పెంపొందింపచేసుకోవడానికి ఇద్దరం కలిసి పనిచేస్తామన్న విశ్వాసం తనకు ఉందని శ్రీ మోదీ అన్నారు.