‘బారిసుకన్నడ డిం డిమవ’ అనే సాంస్కృతిక ఉత్సవాన్ని ఫిబ్రవరి 25న ప్రారంభించనున్న ప్రధానమంత్రి
February 23rd, 05:44 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 ఫిబ్రవరి 25 వ తేదీ న సాయంత్రం 5 గంటల కు దిల్లీ లోని తాల్ కటోరా స్టేడియమ్ లో సాంస్కృతిక ఉత్సవం ‘బారిసు కన్నడ డిం డిమవ’ ను ప్రారంభించనున్నారు. ఈ సందర్భం లో ప్రధాన మంత్రి ఈ కార్యక్రమం లో పాలుపంచుకొనే జనసమూహాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు కూడాను.