బార్బడోస్ ప్రధానితో ప్రధానమంత్రి భేటీ
November 21st, 09:13 am
బార్బడోస్ ప్రధాని మియా అమోర్ మోట్‌లీతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. భారత్-కేరికోమ్ శిఖరాగ్ర సమావేశాన్ని గయానాలోని జార్జ్‌టౌన్‌లో నవంబరు 20న నిర్వహించిన సందర్భంగా వారిరువురు సమావేశమయ్యారు. భారత- బార్బడోస్‌ద్వైపాక్షిక సంబంధాలను పునరుద్ఘాటించడంతోపాటు ఆ సంబంధాలను బల పరచడానికి ఇద్దరు నేతలకు ఒక అవకాశాన్ని ఈ ఉన్నతస్థాయి సమావేశం అందించింది.