భారత ప్రభుత్వ రంగ బ్యాంకులు మునుపెన్నడూ లేని విధంగా ఎందుకు అభివృద్ధి చెందుతున్నాయి - మోదీ యుగం బ్యాంకింగ్ విజయ గాథ

December 18th, 07:36 pm

మోదీ యుగాన్ని దాని ముందువారి నుండి వేరుగా ఉంచే పోటీ ప్రయోజనం విజయవంతమైన విధానాలను కొనసాగించడమే కాకుండా సరైన సమయంలో జాతీయ ప్రయోజనాల కోసం వాటిని విస్తరించడం మరియు విస్తరించడం.

హర్యానాలోని పానిపట్‌లో అభివృద్ధిపనుల ప్రారంభ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగానికి అనువాదం

December 09th, 05:54 pm

హర్యానా గవర్నరు బండారు దత్తాత్రేయ గారు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న, ప్రజాదరణ పొందిన హుషారైన నేత శ్రీ నాయబ్ సింగ్ గారు, కేంద్ర మంత్రిమండలిలో నా తోటి సభ్యులైన గౌరవనీయురాలు నిర్మలా సీతారామన్ గారు, ఈ భూమి పుత్రుడు, పార్లమెంటు సభ్యుడు, మాజీ ముఖ్యమంత్రి, అంతేకాకుండా ప్రభుత్వంలో నా సహచరుడైన శ్రీ మనోహర్ లాల్ గారు, శ్రీ కృష్ణ పాల్ గారు, హర్యానా ప్రభుత్వంలో మంత్రులు శృతి గారు, ఆర్తి గారు, ఎంపీలు, ఎమ్ఎల్ఏలు, దేశవ్యాప్తంగా ఉన్న ఎల్ఐసీ కేంద్రాలతో అనుబంధం ఉన్న సహచరులందరూ.. నా ప్రియ సోదరులు, సోదరీమణులారా.

ఎల్ఐసీ బీమా సఖి యోజన ప్రారంభించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ

December 09th, 04:30 pm

మహిళా సాధికారతను, ఆర్థిక రంగంలో వారి భాగస్వామ్యాన్ని పెంపొందించే దిశగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ తీసుకొచ్చిన ‘బీమా సఖి యోజన’ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు లాంఛనంగా ప్రారంభించారు. హర్యానాలోని పానిపట్‌లో ఈ కార్యక్రమం జరిగింది. అలాగే కర్నాల్ లోని మహారాణా ప్రతాప్ హార్టీకల్చర్ విశ్వవిద్యాలయ ప్రధాన క్యాంపస్‌ నిర్మాణానికి ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా శ్రీ మోదీ ప్రసంగిస్తూ.. మహిళా సాధికారత దిశగా ఈ రోజు మరో ముందడుగు వేశామని అన్నారు. మన గ్రంథాల్లో 9ని పవిత్రమైన అంకెగా భావిస్తారు. నవరాత్రి సమయంలో నవ దుర్గలుగా తొమ్మిది రూపాల్లో అమ్మవారిని ఆరాధిస్తారు. ఈ రోజు 9వ తేదీనే కావడం విశేషం. ఈ రోజు నారీశక్తిని ఆరాధిస్తున్న రోజు కూడా అని ఆయన వివరించారు.

Our Constitution is the guide to our present and our future: PM Modi on Samvidhan Divas

November 26th, 08:15 pm

PM Modi participated in the Constitution Day programme at the Supreme Court. “Our Constitution is a guide to our present and our future”, exclaimed Shri Modi and added that the Constitution had shown the right path to tackle the various challenges that have cropped up in the last 75 years of its existence. He further noted that the Constitution even encountered the dangerous times of Emergency faced by Indian Democracy.

సుప్రీం కోర్టులో రాజ్యంగ దినోత్సవ కార్యక్రమం; పాల్గొన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

November 26th, 08:10 pm

న్యూఢిల్లీలోని సర్వోన్నత న్యాయస్థానంలో ఈ రోజు ఏర్పాటు చేసిన రాజ్యాంగ దినోత్సవానికి సంబంధిత కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి శ్రీ సంజీవ్ ఖన్నా, సర్వోన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తులు జస్టిస్ శ్రీ బీ.ఆర్. గవయి, జస్టిస్ శ్రీ సూర్యకాంత్, చట్ట, న్యాయ శాఖ మంత్రి శ్రీ అర్జున్ రాం మేఘ్‌వాల్, అటార్నీ జనరల్ లు సహా ఇతర ఉన్నతాధికారులు పాలుపంచుకొన్నారు.

అంతర్జాతీయ సహకార సదస్సు ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం

November 25th, 03:30 pm

మీ అందరికీ ఈరోజు నేను స్వాగతం పలుకుతున్నానంటే, అది నేనొక్కడిని చేసింది కాదు.. నిజానికి నేనొక్కడినే చేయలేను కూడా. భారత్ లోని లక్షలాది మంది రైతులు, లక్షలాది మంది పశుపోషకులు, దేశంలోని మత్స్యకారులు, 8 లక్షలకు పైగా సహకార సంఘాలు, స్వయంసహాయక సంఘాల్లోని 10 కోట్ల మంది మహిళలు, సహకార సంఘాలను సాంకేతికతతో అనుసంధానిస్తున్న భారత యువత తరఫున – మిమ్మల్ని నేను భారత్ కు ఆహ్వానిస్తున్నాను.

2024-ఐసీఏ గ్లోబల్ సహకార సదస్సుని ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

November 25th, 03:00 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో 2024-ఐసీఏ గ్లోబల్ సహకార సదస్సును ప్రారంభించారు. సభనుద్దేశించి ప్రసంగిస్తూ, భూటాన్ ప్రధానమంత్రి శ్రీ దాషో షెరింగ్ టోబ్‌గే, ఫిజీ ఉప ప్రధాన మంత్రి శ్రీ మనోవా కమికామికా, కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా, భారతదేశంలోని ఐక్యరాజ్యసమితి రెసిడెంట్ కోఆర్డినేటర్ శ్రీ షోంబీ షార్ప్, అంతర్జాతీయ సహకార సమితి అధ్యక్షుడు శ్రీ ఏరియల్ గార్కో, విదేశీ ప్రముఖులు తదితరులకు శ్రీ మోదీ స్వాగతం పలికారు.

With the support BJP is receiving at booth level, the defeat of the corrupt JMM government is inevitable: PM Modi

November 11th, 01:00 pm

PM Modi interacted with BJP karyakartas from Jharkhand through the NaMo App, delivering an energizing call to action ahead of the upcoming state elections. Addressing a variety of key issues, PM Modi expressed his support for the grassroots workers while underscoring the BJP’s commitment to progress, inclusivity, and integrity.

PM Modi Connects with BJP Karyakartas in Jharkhand via NaMo App

November 11th, 12:30 pm

PM Modi interacted with BJP karyakartas from Jharkhand through the NaMo App, delivering an energizing call to action ahead of the upcoming state elections. Addressing a variety of key issues, PM Modi expressed his support for the grassroots workers while underscoring the BJP’s commitment to progress, inclusivity, and integrity.

3వ కౌటిల్య ఆర్థిక సమ్మేళనం -2024 లో ప్రధానమంత్రి ప్రసంగానికి తెలుగు అనువాదం

October 04th, 07:45 pm

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ ప్రెసిడెంట్ ఎన్ కె సింగ్ గారు, ఈ సమ్మేళనంలో పాల్గొంటున్న దేశవిదేశాలకు చెందిన ఇతర విశిష్ట అతిథులు, మహిళలు, పెద్దలు!

న్యూఢిల్లీలో 3వ కౌటిల్య ఆర్థిక సమ్మేళనంలో ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

October 04th, 07:44 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుక్రవారం న్యూఢిల్లీలో జరిగిన కౌటిల్య ఆర్థిక సమ్మేళనంలో ప్రసంగించారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ భాగస్వామ్యంతో ఆర్థిక వృద్ధి సంస్థ (ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్) నిర్వహించిన కౌటిల్య ఆర్థిక సమ్మేళనంలో హరిత మార్పు కోసం నిధులు సమకూర్చడం, భౌగోళిక ఆర్థిక అనిశ్చితి, వృద్ధిపై ప్రతికూలప్రభావం, సుస్థిరత్వాన్ని పరిరక్షించడానికి విధాన కార్యాచరణ సూత్రాలు వంటి అంశాలపై దృష్టి సారించింది.

అమెరికాలోని న్యూయార్క్ లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం తెలుగు పాఠం

September 22nd, 10:00 pm

నమస్తే అమెరికా! ఇప్పుడు మన నమస్తే కూడా స్థానికం నుంచి అంతర్జాతీయంగా మారిపోయింది. ఇదంతా మీ వల్లే. భారత్ ను హృదయానికి దగ్గరగా ఉంచుకునే ప్రతి భారతీయుడు దీన్ని సుసాధ్యం చేశాడు.

న్యూయార్క్‌లో భార‌తీయ స‌మాజాన్ని ఉద్దేశించి ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌సంగం

September 22nd, 09:30 pm

న్యూయార్క్‌లోని లాంగ్ ఐలాండ్‌లో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో భారీ ఎత్తున హాజ‌రైన ప్ర‌వాస భార‌తీయుల‌ను ఉద్దేశించి సోమ‌వారం ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌సంగించారు. ఈ కార్య‌క్ర‌మానికి దాదాపు 15,000 మంది ప్ర‌జ‌లు హాజ‌ర‌య్యారు.

ఉత్తర ప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడాలో జరిగిన సెమీకాన్ ఇండియా 2024 కార్యక్రమంలో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

September 11th, 12:00 pm

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు, కేంద్ర మంత్రివర్గంలోని నా సహచరులు, అశ్విని వైష్ణవ్, జితిన్ ప్రసాద, ప్రపంచ సెమీకండక్టర్ పరిశ్రమతో సంబంధం ఉన్న దిగ్గజాలు, విద్య, పరిశోధన, ఆవిష్కరణ రంగాలకి చెందిన భాగస్వాములు, ఇతర విశిష్ట అతిథులు, సోదర సోదరీమణులారా ! అందరికీ నమస్కారం!

ఉత్తరప్రదేశ్ గ్రేటర్ నోయిడాలో జరుగుతోన్న సెమీకాన్ ఇండియా 2024ను ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

September 11th, 11:30 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడా‌లో ఉన్న ఇండియా ఎక్స్ పో మార్ట్‌లో సెమీకాన్ ఇండియా 2024ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన ప్రదర్శనను ఆయన వీక్షించారు. సెప్టెంబర్ 11 నుంచి 13 వరకు మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో సెమీకండక్టర్ రంగంలో భారత్‌ను ప్రపంచస్థాయి హబ్‌గా మార్చే వ్యూహం, విధానంపై చర్చించనున్నారు.

ఎకనామిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరంలో ప్రధానమంత్రి ప్రసంగం

August 31st, 10:39 pm

ఈటీ వరల్డ్ లీడర్స్ ఫోరం ఈ ఎడిషన్ కు హాజరైన ఇంతమంది సుపరిచిత ముఖాలను చూడటం ఆనందంగా ఉంది. భారతదేశ ఉజ్వల భవిష్యత్తు కు సంబంధించి ఇక్కడ ఉత్తమమైన చర్చలు జరిగాయని నేను నమ్ముతున్నాను. ముఖ్యంగా ప్రపంచం మొత్తం భారతదేశంపై నమ్మకంగా ఉన్న సమయంలో ఈ సంభాషణలు జరిగాయి .

న్యూఢిల్లీలో ఎకనమిక్ టైమ్స్ ‘వరల్డ్ లీడర్స్ ఫోరమ్‌’ కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

August 31st, 10:13 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో ఇవాళ ఎకనమిక్ టైమ్స్ యాజమాన్యం నిర్వహించిన ‘వరల్డ్ లీడర్స్ ఫోరమ్’ కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ వేదికపై దేశ ఉజ్వల భవిష్యత్తు దిశగా విలక్షణ రీతిలో చర్చలు సాగి ఉంటాయని ఈ సందర్భంగా ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రపంచానికి భార‌త్‌పై నమ్మకం ఇనుమడిస్తున్న తరుణంలో సాగుతున్న ఈ చర్చలకు ఎంతో ప్రాధాన్యం ఉందన్నారు.

ముంబైలో జరిగిన గ్లోబల్ ఫిన్ టెక్ ఫెస్ట్ లో ప్రధాన మంత్రి ప్రసంగం

August 30th, 12:00 pm

ఇటీవలే జన్మాష్టమిని జరుపుకున్న దేశం ప్రస్తుతం పండుగ వాతావరణం లో ఉంది. మన ఆర్థిక వ్యవస్థలోనూ, మార్కెట్లలోనూ పండుగ వాతావరణం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సంబర వాతావరణంలోనే మనం గ్లోబల్ ఫిన్ టెక్ ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నాం, అలాంటి కార్యక్రమానికి కలల నగరమైన ముంబై కంటే మంచి ప్రదేశం ఏముంటుంది. దేశం నలుమూలల నుంచి, ప్రపంచం నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు, స్వాగతం. ఇక్కడికి రాకముందు వివిధ ప్రదర్శనలను సందర్శించే అవకాశం, పలువురు మిత్రులతో మమేకమయ్యే అవకాశం లభించింది. అక్కడ, మన యువత నాయకత్వంలో, భవిష్యత్తు అవకాశాలతో నిండిన కొత్త ఆవిష్కరణల ప్రపంచాన్ని నేను చూశాను. మీ పనికి అనుగుణంగా, మరో మాటలో చెప్పాలంటే: నిజంగా ఒక కొత్త ప్రపంచం ఆవిర్భవిస్తోంది. ఈ ఉత్సవ నిర్వాహకులను, పాల్గొన్న ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నాను.

ముంబైలో గ్లోబ‌ల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌(జీఎఫ్ఎఫ్‌) 2024లో ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌సంగం

August 30th, 11:15 am

మ‌హారాష్ట్ర‌లోని ముంబైలో ఉన్న జియో వ‌రల్డ్ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌లో ఇవాళ జ‌రిగిన గ్లోబ‌ల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌ (జీఎఫ్ఎఫ్‌) 2024లో ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌సంగించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఏర్పాటు చేసిన ప్ర‌ద‌ర్శ‌న‌ను సైతం ప్ర‌ధాన‌మంత్రి సంద‌ర్శించారు. పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, నేష‌న‌ల్ పేమెంట్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా, ఫిన్‌టెక్ క‌న్వ‌ర్జెన్స్ కౌన్సిల్ క‌లిసి జీఎఫ్ఎఫ్‌ను సంయుక్తంగా నిర్వ‌హించాయి. ఫిన్‌టెక్ రంగంలో భార‌త్ సామ‌ర్థ్యాల‌ను ప్ర‌ద‌ర్శించ‌డంతో పాటు ఈ రంగంలోని కీల‌క భాగ‌స్వామ్య ప‌క్షాల‌ను ఒక్క‌చోట‌కు చేర్చ‌డ‌మే ఈ కార్య‌క్ర‌మం ల‌క్ష్యం.

ప్రజల చెంతకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జన్ ధన్ యోజన సాఫల్య సందేశం

August 28th, 03:37 pm

అందరికీ ఆర్థిక సేవలను అందుబాటులోకి తీసుకుపోయేందుకు ఉద్దేశించిన ‘‘జన్ ధన్ యోజన’’ కార్యక్రమం ఈ రోజుతో పది వసంతాలు పూర్తి చేసుకొన్న సందర్భంగా, ఈ పథకం విజయాన్ని చాటి చెబుతూ సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే పది సంఖ్యలు, వాటి గురించి వివరణ ఉన్న ఒక సందేశాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు.