బంజారా సంస్కృతిని చాటిచెప్పే పోహరాదేవిలోని బంజారా విరాసత్ మ్యూజియం అభినందనీయం: ప్రధాన మంత్రి
October 05th, 04:39 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పోహరాదేవిలో బంజారా విరాసత్ మ్యూజియాన్ని ప్రారంభించారు. చరిత్ర, సంస్కృతిపై మక్కువ ఉన్నవారంతా మ్యూజియాన్ని సందర్శించాలని ఆయన కోరారు.అక్టోబర్ 5 న మహారాష్ట్రలో ప్రధానమంత్రి పర్యటన
October 04th, 05:39 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శనివారం (అక్టోబర్ 5న) మహారాష్ట్రలో పర్యటిస్తారు. ఉదయం 11.15 గంటలకు వాసిమ్ చేరుకుని పోహరాదేవి జగదాంబ మాత ఆలయంలో దర్శనం చేసుకుంటారు. వాసిమ్ లోని సంత్ సేవాలాల్ మహరాజ్, సంత్ రామ్ రావ్ మహారాజ్ సమాధుల వద్ద నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత ఉదయం 11.30 గంటలకు బంజారా సమాజం గొప్ప వారసత్వాన్ని చాటిచెప్పే బంజారా విరాసత్ మ్యూజియాన్ని ప్రధాని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు వ్యవసాయ, పశుసంవర్ధక రంగానికి సంబంధించిన సుమారు రూ.23,300 కోట్ల విలువైన పలు కార్యక్రమాలను ప్రారంభిస్తారు. సాయంత్రం 4 గంటలకు థానేలో రూ.32,800 కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత సాయంత్రం 6 గంటలకు బీకేసీ మెట్రో స్టేషన్ నుంచి ముంబైలోని ఆరే జేవీఎల్ఆర్ వరకు నడిచే మెట్రో రైలును జెండా ఊపి ప్రారంభిస్తారు. బీకేసీ, శాంతాక్రజ్ స్టేషన్ల మధ్య మెట్రోలో శ్రీ మోదీ ప్రయాణం చేయనున్నారు.