అధ్యక్షుడు బిడెన్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంభాషణ

August 26th, 10:03 pm

ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీతో ఇవాళ అమెరికా అధ్య‌క్షుడు గౌరవనీయ జోసెఫ్ ఆర్.బిడెన్ ఫోన్ ద్వారా సంభాషించారు.

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ముఖ్య సలహాదారు నుంచి ప్రధానమంత్రికి ఫోన్ కాల్

August 16th, 04:30 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ బంగ్లాదేశ్ లోని తాత్కాలిక ప్రభుత్వ ముఖ్య సలహాదారు ప్రొఫెసర్ మొహమ్మద్ యూనస్ తో ఈ రోజు టెలిఫోనులో మాట్లాడారు.

బాంగ్లాదేశ్ లో కొత్త బాధ్యతలను స్వీకరించిన నోబెల్ బహుమతి గ్రహీత ప్రొఫెసర్ ముహమ్మద్ యూనుస్ కు ప్రధాన మంత్రి అభినందనలు

August 08th, 10:26 pm

బాంగ్లాదేశ్ లో కొత్తగా ఏర్పాటు చేసిన తాత్కాలిక ప్రభుత్వానికి ముఖ్య సలహాదారు పదవీ బాధ్యతలను నోబెల్ బహుమతి గ్రహీత ప్రొఫెసర్ ముహమ్మద్ యూనుస్ చేపట్టిన సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఆయనకు అభినందనలను తెలియజేశారు.

బంగ్లాదేశ్ ప్రధానమంత్రి భారత అధికార పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆంగ్ల ప్రసంగం

June 22nd, 01:00 pm

ప్రధానమంత్రి శ్రీమతి షేక్ హసీనాకు, ఆమె ప్రతినిధివర్గానికి హృద‌యపూర్వక ఆహ్వానం పలుకుతున్నాను. గత ఏడాది కాలంగా మేం పది సార్లు కలుసుకున్నప్పటికీ నేటి సమావేశం ప్రత్యేకమైనది. మా ప్రభుత్వం మూడో విడత అధికారం చేపడుతున్న సమయంలో మన తొలి అతిథి ఆమె కావడమే ఆ విశేషం.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి అభినందనలనుతెలిపిన బాంగ్లాదేశ్ ప్రధాని శేఖ్ హసీనా గారు

June 05th, 08:04 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ బాంగ్లాదేశ్ యొక్క ప్రధాని శేఖ్ హసీనా గారు టెలిఫోన్ ద్వారా మాట్లాడుతూ, లోక్ సభ యొక్క పద్ధెనిమిదో ఎన్నికల లో ఎన్‌డిఎ విజయం సాధించినందుకు అభినందనల ను తెలియ జేశారు.

వరుసగా నాలుగో సారి కూడా విజయం సాధించినందుకు ప్రధానమంత్రి శ్రీమతి షేక్ హసీనాకు పిఎం అభినందనలు

January 08th, 07:54 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు బంగ్లాదేశ్ ప్రధానమంత్రి శ్రీమతి షేక్ హసీనాతో మాట్లాడారు. పార్లమెంటరీ ఎన్నికల్లో వరుసగా నాలుగో సారి చారిత్రక విజయం సాధించినందుకు ఆమెను అభినందించారు.

త్రిపురలోని ఖోవై-హరీనా రహదారి 135 కి.మీ. మేర అభివృద్ధికి మంత్రివర్గం ఆమోదం

December 27th, 08:36 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతలోని ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ జాతీయ రహదారి-208ని 101.300 కి.మీ. (ఖోవాయి) నుండి 236.213 కి.మీ. (హరీనా) వరకు రెండు లేన్‌ల మేర అభివృద్ధి & విస్తరణకు ఆమోదం తెలిపింది. త్రిపుర రాష్ట్రంలో దీని మొత్తం పొడవు 134.913 కి.మీ. ఈ మొత్తం ప్రాజెక్ట్ రూ.2,486.78 కోట్ల పెట్టుబడితో చేపడుతున్నారు. ఇందులో రూ.1,511.70 కోట్ల రుణ భాగం (జేపీవై 23,129 మిలియన్లు) ఉంది. లోన్ అసిస్టెంట్ జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (జైకా) నుండి అధికారిక అభివృద్ధి సహాయం (ఓడా) పథకం కింద ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ త్రిపురలోని వివిధ ప్రాంతాల మధ్య మెరుగైన రహదారి కనెక్టివిటీని సులభతరం చేయడానికి మరియు త్రిపుర నుండి అస్సాం మరియు మేఘాలయాలకు ప్రస్తుత ఎన్.హెచ్-8 కాకుండా ప్రత్యామ్నాయ యాక్సెస్‌ను అందించడానికి ఉద్దేశించబడింది.

నవంబరు ఒకటో తేదీన మూడు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తున్న భారత, బంగ్లాదేశ్ ప్రధానమంత్రులు

October 31st, 05:02 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, బంగ్లాదేశ్ ప్రధానమంత్రి శ్రీమతి షేక్ హసీనా నవంబరు ఒకటో తేదీన ఉదయం 11 గంటల ప్రాంతంలో మూడు అభివృద్ధి ప్రాజెక్టులను వీడియో కాన్ఫరెన్సింగ్ విధానంలో కలిసి ప్రారంభించనున్నారు. అఖౌరా-అగర్తలా క్రాస్-బోర్డర్ రైల్ లింక్; ఖుల్నా-మోంగ్లా పోర్టు రైల్ లేన్; మైత్రీ సూపర్ ధర్మల్ ప్రాజెక్టు మూడో దశ ఈ మూడు ప్రాజెక్టుల్లో ఉన్నాయి.

పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ లో బాంగ్లాదేశ్ పై భారతదేశం క్రికెట్ జట్టు ఘన విజయాన్నిసాధించినందుకు ప్రశంసల ను వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

October 19th, 10:25 pm

పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ లో బాంగ్లాదేశ్ తో ఆడి చక్కని గెలుపు ను సాధించిన భారతీయ క్రికెట్ జట్టు ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

ప్రపంచ జీవ ఇంధన సంకీర్ణం (జిబిఎ) ప్రారంభం

September 09th, 10:30 pm

న్యూఢిల్లీలో జి-20 శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో ప్రపంచ జీవ ఇంధన సంకీర్ణం (జిబిఎ) 2023 సెప్టెంబరు 9న ప్రారంభమైంది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సింగపూర్, బంగ్లాదేశ్, ఇటలీ, అమెరికా, బ్రెజిల్, అర్జెంటీనా, మారిషస్, యుఎఇ దేశాల అధినేతలతో సంయుక్తంగా దీనికి శ్రీకారం చుట్టారు.

బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనాను కలుసుకున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

September 08th, 07:53 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ . హసీనాను కలుసుకున్నారు. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా , 2023 సెప్టెంబర్ 9–10 తేదీలలో న్యూఢిల్లీలో జరగనున్న జి 20 శిఖరాగ్ర సమ్మేళనానికి

మారిశస్ ప్రధాని, బాంగ్లాదేశ్ ప్రధాని శేఖ్ హసీనా గారు మరియు యుఎస్ అధ్యక్షుడు లతో మూడుద్వైపాక్షిక సమావేశాల ను న్యూ ఢిల్లీ లోని తన నివాసం లో నిర్వహించనున్న ప్రధానమంత్రి

September 08th, 01:40 pm

మారిశస్ ప్రధాని శ్రీ ప్రవింద్ కుమార్ జుగ్ నాథ్, బాంగ్లాదేశ్ ప్రధాని శేఖ్ హసీనా గారు మరియు యుఎస్ అధ్యక్షుడు శ్రీ జో బైడెన్ లతో మూడు ద్వైపాక్షిక సమావేశాల ను ఈ రోజు న సాయంత్రం పూట న్యూ ఢిల్లీ లోని తన నివాసం లో జరపనున్నట్లు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘ఎక్స్’ మాధ్యం ద్వారా తెలియ జేశారు.

అస్సాంసహా ఈశాన్యమంతటా పెట్రో రసాయనాల రంగం వృద్ధి దిశగా కృషిని ప్రశంసించిన ప్రధానమంత్రి

July 03rd, 10:02 pm

అస్సాం పెట్రో రసాయనాల ప్లాంటు నుంచి బంగ్లాదేశ్‌కు తొలిసారి మిథనాల్ ఎగుమతిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. ఈ మేరకు పెట్రో రసాయనాల రంగంలో అస్సాంను ప్రధాన ఎగుమతిదారుగా నిలిపే దిశగా సాగుతున్న కృషిని ఆయన ప్రశంసించారు.

ఐటీయూ ఏరియా ఆఫీస్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం

March 22nd, 03:34 pm

ఈ రోజు చాలా ప్రత్యేకమైనది, చాలా పవిత్రమైనది. నేటి నుంచి 'హిందూ క్యాలెండర్' నూతన సంవత్సరం ప్రారంభమైంది. మీ అందరికీ, దేశ ప్రజలందరికీ విక్రమ్ సంవత్ 2080 శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంత సువిశాలమైన మన దేశంలో, భిన్నత్వంతో నిండిన దేశంలో, శతాబ్దాలుగా వేర్వేరు క్యాలెండర్లు ప్రబలంగా ఉన్నాయి. కొల్లం కాలానికి చెందిన మలయాళ క్యాలెండర్, తమిళ క్యాలెండర్, ఇది వందల సంవత్సరాలుగా భారతదేశానికి తిథి జ్ఞానాన్ని ఇస్తోంది. విక్రమ్ సంవత్ కూడా 2080 సంవత్సరాల క్రితం నుండి కొనసాగుతోంది. ప్రస్తుతం గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం 2023 సంవత్సరం జరుగుతుండగా, విక్రమ్ సంవత్ అంతకు ముందు 57 సంవత్సరాలు గా ఉంది. కొత్త సంవత్సరం మొదటి రోజున, టెలికాం, ఐసిటి మరియు సంబంధిత ఆవిష్కరణలకు సంబంధించి భారతదేశంలో చాలా పెద్ద ప్రారంభం జరుగుతున్నందుకు నేను సంతోషిస్తున్నాను. ప్రస్తుతం ఇక్కడ ఏరియా ఆఫీస్ మాత్రమే కాకుండా ఇంటర్నేషనల్ టెలీ కమ్యూనికేషన్ యూనియన్ (ఐటీయూ)కు చెందిన ఏరియా ఆఫీస్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. వీటితో పాటు 6జీ టెస్ట్ బెడ్ ను కూడా ఇవాళ ప్రారంభించడం జరిగింది. ఈ సాంకేతికటకు సంబంధించిన విజన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరించారు. ఇది డిజిటల్ ఇండియాకు కొత్త శక్తిని ఇస్తుంది, అలాగే దక్షిణాసియా, గ్లోబల్ సౌత్ కోసం కొత్త పరిష్కారాలు, కొత్త ఆవిష్కరణలను తీసుకువస్తుంది. ఇది ముఖ్యంగా మన విద్యారంగానికి, మన ఆవిష్కర్తలకు-స్టార్టప్ లకు, మన పరిశ్రమకు అనేక కొత్త అవకాశాలను సృష్టిస్తుంది.

ఐ.టి.యు. ప్రాంతీయ కార్యాలయం, ఆవిష్కరణల కేంద్రాన్ని ప్రారంభించిన - ప్రధానమంత్రి

March 22nd, 12:30 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, భారతదేశంలో కొత్త ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ఐ.టి.యు) కు చెందిన ఏరియా కార్యాలయంతో పాటు, ఇన్నోవేషన్ కేంద్రాన్ని ఈరోజు విజ్ఞాన్ భవన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రారంభించారు. భారత్ 6-జి విజన్ డాక్యుమెంట్‌ ను కూడా ప్రధానమంత్రి ఆవిష్కరించారు, 6-జి ఆర్.&డి. టెస్ట్ బెడ్‌ను ప్రారంభించారు. ‘కాల్-బి-ఫోర్-యు-డిగ్’ అనే యాప్‌ ను కూడా ఆయన ప్రారంభించారు. ఐ.టి.యు. అనేది ఐక్యరాజ్యసమితికి చెందిన సమాచార, కమ్యూనికేషన్ టెక్నాలజీల (ఐ.సి.టి.ల) ప్రత్యేక ఏజెన్సీ. ఏరియా కార్యాలయం ఏర్పాటు కోసం 2022 మార్చి నెలలో ఐ.టి.యు. తో భారతదేశం హోస్ట్ కంట్రీ ఒప్పందంపై సంతకం చేసింది. భారతదేశం, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులు, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్‌ దేశాలకు ఈ కార్యాలయం సేవలందిస్తుంది, దేశాల మధ్య సమన్వయాన్ని మెరుగుపరుస్తుంది. ఈ ప్రాంతంలో పరస్పర ప్రయోజనకరమైన ఆర్థిక సహకారాన్ని కూడా ఈ కార్యాలయం ప్రోత్సహిస్తుంది.

ఐటియు ఏరియా ఆఫీస్ & ఇనొవేశన్ సెంటరు ను మార్చి నెల 22 న ప్రారంభించనున్న ప్రధాన మంత్రి

March 21st, 04:00 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 మార్చి నెల 22 వ తేదీ మధ్యాహ్నం పూట 12:30 గంటల కు న్యూ ఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ లో జరిగే ఒక కార్యక్రమం లో పాల్గొని, నూతన ఇంటర్ నేశనల్ టెలికమ్యూనికేశన్ యూనియన్ (ఐటియు) ఏరియా ఆఫీస్ & ఇనొవేశన్ సెంటరు ను ప్రారంభించనున్నారు. ఇదే కార్యక్రమం లో భాగం గా, భారత్ 6జి విజన్ డాక్యుమెంటు ను ప్రధాన మంత్రి ఆవిష్కరిస్తారు. అలాగే, 6జి కి చెందినటువంటి ఆర్&డి టెస్ట్ బెడ్ ను కూడా ఆయన ప్రారంభిస్తారు. ప్రధాన మంత్రి ‘కాల్ బిఫోర్ యు డిగ్’ అనే ఏప్ ను సైతం ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం లో పాలుపంచుకొనే సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తారు.

శ్రీశ్రీ హరిచంద్ ఠాకూర్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నివాళి

March 19th, 07:33 pm

శ్రీశ్రీ హరిచంద్ ఠాకూర్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.

Enhanced connectivity with Bangladesh will further strengthen people to people relations: PM Modi

March 18th, 05:10 pm

PM Modi and PM of Bangladesh, Sheikh Hasina jointly inaugurated the India-Bangladesh Friendship Pipeline. Bangladesh is India’s top-most development partner and its largest trade partner in the region. The operationalisation of the Friendship Pipeline will enhance ongoing energy cooperation between the two countries and will further growth in Bangladesh, particularly in the agriculture sector.

ప్రధాని నరేంద్ర మోదీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఉమ్మడిగా ప్రారంభించిన భారత్-బంగ్లాదేశ్ మైత్రి పైప్ లైన్

March 18th, 05:05 pm

ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఈరోజు ఉమ్మడిగా భారత్-బంగ్లాదేశ్ మైత్రి పైప్ లైన్ (ఐబీఎఫ్ పి) ను వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. ఈ పైప్ లైన్ నిర్మాణానికి ఇరుదేశాల ప్రధానులు 2018 సెప్టెంబర్ లో శంకుస్థాపన చేశారు. నుమాలీగర్ రిఫైనరీ లిమిటెడ్ సంస్థ 2015 నుంచి బంగ్లాదేశ్ కు పెట్రోలియం ఉత్పత్తులు సరఫరా చేస్తోంది. భారత్ కు పొరుగుదేశంతో ఉన్న రెండో సీమాంతర ఇంధన పైప్ లైన్ ఐ బి ఎఫ్ పి.

త్రిపుర ప్రజలు 'రెడ్ సిగ్నల్' తొలగించి 'డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని' ఎన్నుకున్నారు: అగర్తలాలో ప్రధాని మోదీ

February 13th, 04:20 pm

త్రిపురలో ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంటున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు అగర్తలాలో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. భారీ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ, వామపక్షాలు రాష్ట్రాన్ని ఏళ్ల తరబడి దోచుకున్నాయని, ప్రజలను పేదరికంలోకి నెట్టారని ఆరోపించారు. వామపక్షాల పాలన త్రిపురను విధ్వంసం పథంలోకి నెట్టిందని ఆయన అన్నారు. త్రిపుర ప్రజలు ఇక్కడ ఉన్న పరిస్థితిని మరచిపోలేరు.