భగవాన్ బుద్ధుని ఆదర్శాల ను కొనియాడిన ప్రధాన మంత్రి

March 05th, 09:47 am

థాయీలాండ్ లోని లక్షల కొద్దీ భక్త జనం 2024 ఫిబ్రవరి 23 వ తేదీ మొదలుకొని మార్చి నెల 3 వ తేదీ మధ్య కాలం లో బ్యాంకాక్ లో భగవాన్ బుద్ధుని మరియు ఆయన శిష్యులు అరహంత్ సారిపుత్త్ కు మరియు అరహంత్ మహా మోగ్గలానా కు చెందిన పవిత్రమైనటువంటి అవశేషాల కు నమస్సులు అర్పించిన నేపథ్యం లో, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ భగవాన్ బుద్ధుని ఆదర్శాల ను ఈ రోజు న కొనియాడారు.

బ్యాంకాక్ లో పారాఏశియాన్ ఆర్చరీ చాంపియన్ శిప్‌స్ లో అద్భుతమైన ఆటతీరు ను కనబరచినందుకు గాను భారతదేశంయొక్క పారా ఆర్చరీ జట్టు కు అభినందనల ను తెలిపిన ప్రధాన మంత్రి

November 23rd, 10:58 am

బ్యాంకాక్ లో పారా ఏశియాన్ ఆర్చరీ చాంపియన్ శిప్ స్ లో ఇప్పటివరకు చూస్తే సర్వశ్రేష్ఠమైమైనటువంటి ఆటతీరు ను కనబరచినందుకు గాను భారతదేశాని కి చెందిన పారా ఆర్చరీ జట్టు ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

వియత్నామ్ ప్ర‌ధాని తో స‌మావేశ‌మైన ప్ర‌ధాన మంత్రి

November 04th, 08:02 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ వియ‌త్నామ్ సామ్య‌వాద గ‌ణ‌తంత్రం ప్ర‌ధాని, శ్రేష్ఠుడు శ్రీ ఎన్గుయెన్ శువాన్ ఫుక్ తో 2019వ సంవ‌త్స‌రం న‌వంబ‌ర్ 4వ తేదీ నాడు బ్యాంకాక్ లో ఇండియా-ఆసియాన్ సమిట్ మరియు ఈస్ట్ ఏశియా స‌మిట్ లు జరిగిన సంద‌ర్భం లో స‌మావేశ‌మ‌య్యారు.

ఆస్ట్రేలియా ప్రధాని తో సమావేశమైన ప్రధాన మంత్రి

November 04th, 07:59 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ బ్యాంకాక్ లో ఈ రోజు న ఆర్ సిఇపి సమిట్ జరిగిన సందర్భం లో ఆస్ట్రేలియా ప్రధాని శ్రీ స్కాట్ మారిసన్ తో సమావేశమయ్యారు.

బ్యాంకాక్ లో ఈస్ట్ ఏశియా స‌మిట్ లోను, ఆర్‌సిఇపి స‌మిట్ లోను పాలు పంచుకోనున్న ప్ర‌ధాన మంత్రి

November 04th, 11:54 am

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నేడు బ్యాంకాక్ లో ఈస్ట్ ఏశియా స‌మిట్ లో మ‌రియు ఆర్‌సిఇపి స‌మిట్ లో పాలు పంచుకోనున్నారు. ఆయ‌న నేటి రాత్రి ఢిల్లీ కి తిరుగు ప్ర‌యాణ‌మ‌య్యే లోపు, జ‌పాన్ ప్ర‌ధాని శ్రీ శింజో ఆబే, వియ‌త్నామ్ ప్ర‌ధాని శ్రీ ఎన్గుయెన్ జువాన్ ఫుక్ ల‌తో పాటు, ఆస్ట్రేలియా ప్ర‌ధాని శ్రీ స్కాట్ మారిస‌న్ ల‌తో కూడా స‌మావేశాల లో పాల్గొననున్నారు.

జపాన్ ప్రధాని షింజో అబేను కలిసిన ప్రధానమంత్రి

November 04th, 11:43 am

ఈ రోజు బ్యాంకాక్‌లో జరిగిన తూర్పు ఆసియా సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ ప్రధాని షింజో అబేను కలిశారు. ఈ ఏడాది చివర్లో ఇండియా-జపాన్ 2 + 2 డైలాగ్ & వార్షిక సమ్మిట్ కోసం మైదానాన్ని సిద్ధం చేయడంపై చర్చలు జరిగాయి.

PM Modi's meetings on the sidelines of ASEAN Summit in Thailand

November 04th, 11:38 am

On the sidelines of the ongoing ASEAN Summit in Thailand, PM Modi held bilateral meetings with world leaders.

మయన్మార్ స్టేట్ కౌన్స్ లర్ తో ప్రధానమంత్రి సమావేశం

November 03rd, 06:44 pm

2019 నవంబర్ 3వ తేదీన జరిగే ఆసియన్ – భారత సదస్సు నేపథ్యంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, మయన్మార్ స్టేట్ కౌన్స్ లర్ అంగ్ సాన్ సూ కీ ని కలిశారు. ఇటీవల, 2017 సెప్టెంబర్ లో తమ మయాన్మార్ పర్యటనను, 2018 జనవరిలో ఆసియాన్- ఇండియా స్మారక సమ్మిట్ సందర్భంగా మయాన్మార్ స్టేట్ కౌన్స్ లర్ భారత దేశ పర్యటనను – ఇరువురు నాయకులు గుర్తు చేస్తుకుంటూ, రెండు దేశాల మధ్య కీలక భాగస్వామ్యంలో ప్రగతి పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు.

ఇండోనేశియా అధ్య‌క్షుని తో స‌మావేశ‌మైన ప్ర‌ధాన మంత్రి

November 03rd, 06:17 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ 2019వ సంవ‌త్స‌రం న‌వంబ‌ర్ 3వ తేదీ నాడు బ్యాంకాక్ లో ఆసియాన్‌/ఇఎఎస్ సంబంధిత స‌మావేశాల సంద‌ర్భం గా ఇండొనేశియా గణతంత్రం అధ్య‌క్షుడు, శ్రేష్ఠుడు శ్రీ జోకో విడోడో తో స‌మావేశ‌మ‌య్యారు.

థాయిలాండ్ ప్ర‌ధాని తో స‌మావేశ‌మైన ప్ర‌ధాన మంత్రి

November 03rd, 06:07 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ 2019వ సంవ‌త్స‌రం న‌వంబ‌ర్ 3వ తేదీన 35వ ఆసియాన్ స‌మిట్, 14వ ఈస్ట్‌ ఆసియా స‌మిట్ (ఇఎఎస్‌) మ‌రియు 16వ ఇండియా-ఆసియాన్ స‌మిట్ ల స‌ంద‌ర్భం లో థాయిలాండ్ ప్ర‌ధాని జనరల్ (రిటైర్డ్‌) శ్రీ ప్రయుత్ చాన్-ఒ-చా తో భేటీ అయ్యారు.

16వ ఇండియా-ఆసియాన్ స‌మిట్ ప్రారంభ కార్య‌క్ర‌మం లో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం

November 03rd, 11:58 am

ఇండియా-ఆసియాన్ స‌మిట్ సంద‌ర్భం లో మీతో మ‌రొక్క‌ మారు భేటీ అయినందుకు నేను సంతోషిస్తున్నాను. థాయిలాండ్ చేసిన చ‌క్క‌ని ఏర్పాట్ల కు మ‌రియు అందించినటువంటి ఉన్న‌త ప్ర‌మాణాలు క‌లిగిన ఆతిథ్యాని కి ఇవే నా యొక్క ధ‌న్య‌వాదాలు. అదే విధం గా రాబోయే సంవ‌త్స‌రం లో ఆసియాన్ సమిట్ కు మ‌రియు ఈస్ట్ ఏశియా స‌మిట్ కు అధ్య‌క్ష బాధ్య‌త లను వ‌హించే వియ‌త్నామ్ కు కూడాను ఇవే నా యొక్క శుభాకాంక్ష‌లు.

బ్యాంకాక్ లో ఇండియా-ఆసియాన్ సమిట్ లో పాల్గొన్న ప్ర‌ధాన మంత్రి

November 03rd, 11:57 am

ఆయ‌న త‌న ప్ర‌సంగాన్ని మొదలుపెడుతూ, 16వ ఇండియా-ఆసియాన్ స‌మిట్ లో పాలు పంచుకొంటున్నందుకు సంతోషాన్ని వ్య‌క్తం చేశారు. ఆత్మీయ‌మైన ఆతిథ్యాన్ని అందించినందుకు గాను థాయిలాండ్ కు ఆయ‌న ధ‌న్య‌వాదాలు ప‌లికారు. అలాగే, వ‌చ్చే సంవ‌త్స‌రం లో శిఖ‌ర స‌మ్మేళ‌నాని కి అధ్య‌క్ష బాధ్యత ను స్వీక‌రిస్తున్నందుకు గాను వియత్నామ్ కు కూడా ఆయ‌న శుభాకాంక్ష‌లు తెలిపారు.

ఆదిత్య బిర్లా గ్రూప్ స్వర్ణోత్సవాల్లో ప్రధానమంత్రి చేసిన ప్రసంగం

November 03rd, 11:08 am

సువర్ణ భూమి, థాయిలాండ్ లో ఆదిత్య బిర్లా గ్రూప్ స్వర్ణ జయంతి అంటే గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు జరుపుకోడానికి మనం ఇక్కడ సమావేశమయ్యాము. ఇది నిజం గా ఒక ప్రత్యేకమైన సందర్భం. ఆదిత్య బిర్లా గ్రూప్ బృందాని కి నా అభినందనలు. థాయిలాండ్ లో తమ గ్రూప్ చేస్తున్న ప్రశంసనీయమైన పని గురించి శ్రీ కుమార్ మంగళం బిర్లా చెప్పగా మనం ఇప్పుడే విన్నాము. ఇది ఈ దేశం లోని చాలా మంది ప్రజల కు అవకాశాల ను, ఆదాయాన్నీ కల్పిస్తోంది.

థాయిలాండ్ లో జరిగిన ఆదిత్య బిర్లా గ్రూపు స్వ‌ర్ణోత్స‌వాల లో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం లోని ముఖ్యాంశాలు

November 03rd, 10:32 am

మ‌నం ఆదిత్య బిర్లా గ్రూపు స్వ‌ర్ణోత్స‌వాల ను జ‌రుపుకోవ‌డం కోసం ఇక్క‌డ థాయిలాండ్ లో భేటీ అయ్యాము.

థాయ్‌లాండ్‌లో ఆదిత్య బిర్లా సంస్థ‌ల స్వ‌ర్ణోత్స‌వాలకు హాజరైన ప్ర‌ధాన‌ మంత్రి

November 03rd, 07:51 am

థాయ్‌లాండ్‌ లో ఆదిత్య బిర్లా సంస్థ‌ల కార్యకలాపాలు ప్రారంభమై 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇవాళ బ్యాంకాక్‌లో నిర్వహించిన స్వర్ణోత్సవాలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హాజరయ్యారు. థాయ్‌లాండ్‌లో తమ సంస్థల స్వర్ణోత్సవాల్లో పాల్గొన్నందుకు ప్రధానమంత్రికి ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా కృతజ్ఞతలు తెలిపారు. పలువురు ప్రభుత్వాధికారులు, పారిశ్రామిక రంగ ప్రముఖులు పాల్గొన్న ఈ సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగించారు. అనేకమందికి అవకాశాలు కల్పించడంతోపాటు వారి సౌభాగ్యానికి తోడ్పడటంలో ఆదిత్య బిర్లా గ్రూప్ కృషి ప్రశంసనీయమని ఆయన అభినందించారు. బలమైన భారత-థాయ్‌లాండ్‌ సాంస్కృతిక బంధాలను ప్రస్తావిస్తూ- సంస్కృతి, వాణిజ్యాలు ప్రపంచాన్ని సన్నిహితం చేసి, సమైక్యపరచగల సహజ శక్తులని పేర్కొన్నారు.

We are developing Northeast India as the gateway to Southeast Asia: PM

November 02nd, 06:23 pm

At a community programme in Thailand, PM Modi said that while the ties between the two countries were strong, the government wanted to strengthen it further by transforming India's North East region into a gateway to South East Asia. The PM also highlighted the various reforms taking place within the country.

‘సవదీ ప్రధాని మోదీ’ కార్యక్రమంలో భారతీయ సమాజ సభ్యులను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగం

November 02nd, 06:22 pm

థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌లో ‘‘సవదీ ప్రధాని మోదీ’’ పేరిట ఇవాళ నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భారతీయ సమాజ సభ్యులనుద్దేశించి ప్రసంగించారు. థాయ్‌లాండ్‌లోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రవాస భారతీయులు వేలాదిగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

PM Modi arrives in Bangkok

November 02nd, 02:07 pm

PM Modi arrived in Bangkok a short while ago. The PM will take part in ASEAN-related Summit and other meetings.

నవంబరు 2-4 తేదీ ల మధ్య థాయిలాండ్ సందర్శిస్తున్న ప్రధాన మంత్రి

November 02nd, 11:56 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ బ్యాంకాక్ సందర్శిస్తున్నారు. ఆయన ఆసియాన్, తూర్పు ఆసియా శిఖరాగ్రాల కు సంబంధించిన సదస్సుల్లో పాల్గొనడం తో పాటు, ఆర్ సెప్ చర్చల్లో కూడా పాల్గొంటారు. అలాగే ప్రధాన ప్రపంచ నాయకులందరితోనూ సమావేశమై కీలక ద్వైపాక్షిక, ప్రపంచ స్థాయి అంశాలపై చర్చిస్తారు.

బ్యాంకాక్ లో ఈ రోజున ‘స్వాస్ దీ పిఎం మోదీ’ సాముదాయిక కార్యక్రమం లో ప్రసంగించనున్న ప్రధాన మంత్రి

November 02nd, 10:45 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న భారతీయ కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటల కు బ్యాంకాక్ లో ‘స్వాస్ దీ పిఎం మోదీ’ సాముదాయిక కార్యక్రమం లో ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమం లో థాయిలాండ్ లోని భారతీయ సముదాయానికి చెందిన సభ్యులు అనేక మంది పాల్గొంటారు.