బందర్ శేరి బెగావన్ లోని ఒమర్ అలీ సైఫుద్దీన్ మసీదును సందర్శించిన ప్రధాని
September 03rd, 08:07 pm
బందర్ శేరి బెగావన్ లోని ప్రసిద్ధ ఒమర్ అలీ సైఫుద్దీన్ మసీదును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం సందర్శించారు. బ్రూనై ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హాజీ మహమ్మద్ ఇషామ్ తో కలిసి ఆ దేశ మత వ్యవహారాల మంత్రి హెచ్‌ఈ పెహిన్ దాటో ఉస్తాజ్ హాజీ అవాంగ్ బదరుద్దీన్ ఆయనకు స్వాగతం పలికారు. అక్కడి భారతీయులు కూడా వచ్చి ప్రధానిని కలిశారు.అధికారిక పర్యటన నిమిత్తం బ్రూనై చేరుకున్న ప్రధాని
September 03rd, 03:46 pm
భారత ప్రధాని బ్రూనైలో పర్యటించడం ఇదే తొలిసారి. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 40 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రధానమంత్రి పర్యటన చారిత్రక ప్రాధాన్యం సంతరించుకుంది.