ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో కిసాన్ సమ్మాన్ సమ్మేళన్ లో ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం
June 18th, 05:32 pm
ఉత్తర ప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి శ్రీమాన్ యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రివర్గంలోని నా సహచరులు శివరాజ్ సింగ్ చౌహాన్, భగీరథ్ చౌదరి గారు, ఉత్తర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పాఠక్, శాసనమండలి సభ్యుడు మరియు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు శ్రీ భూపేంద్ర చౌదరి గారు, రాష్ట్ర ప్రభుత్వంలోని ఇతర మంత్రులు, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చిన నా రైతు సోదర సోదరీమణులు, కాశీక లోని నా కుటుంబ సభ్యులారా,ఉత్తర ప్రదేశ్ లోని వారణాసిలో కిసాన్ సమ్మాన్ సమ్మేళన్ లో ప్రధానమంత్రి ప్రసంగం
June 18th, 05:00 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ఉత్తర ప్రదేశ్ లోని వారణాసిలో కిసాన్ సమ్మాన్ సమ్మేళన్ ను ఉద్దేశించి ప్రసంగించడంతో పాటు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పిఎం-కిసాన్) కింద 9.26 కోట్ల మంది లబ్ధిదారులకు 17వ వాయిదా సొమ్ము రూ.20,000 కోట్లు ప్రత్యక్ష నగదు బదిలీ విధానంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలోనే 30,000 మంది పైగా స్వయం సహాయక బృందాల సభ్యులకు కృషిసఖి సర్టిఫికెట్లు మంజూరు చేశారు. టెక్నాలజీ సహాయంతో దేశవ్యాప్తంగా భిన్న ప్రాంతాలకు చెందిన రైతులు ఈ కార్యక్రమంతో అనుసంధానం అయ్యారు.వారణాసిలో ఓటర్లను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ
May 30th, 02:32 pm
ప్రధాని నరేంద్ర మోదీ తన పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసి ఓటర్లతో వీడియో సందేశం ద్వారా సంభాషించారు. ఈ నగరానికి ప్రాతినిధ్యం వహించడం బాబా విశ్వనాథుని అపారమైన దయ, కాశీ ప్రజల ఆశీస్సుల వల్లనే సాధ్యమైందని ఆయన అన్నారు. కొత్త కాశీతో పాటు కొత్త అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడానికి ఈ ఎన్నికలను ఒక అవకాశంగా పేర్కొంటూ, జూన్ 1న కాశీ నివాసులు, ముఖ్యంగా యువత, మహిళలు మరియు రైతులు రికార్డు సంఖ్యలో పాల్గొనాలని ప్రధాని కోరారు.Just like homes, a country cannot run without women: PM Modi in Varanasi, UP
May 21st, 06:00 pm
In a heartfelt address at the Mahila Sammelan in Varanasi, Prime Minister Narendra Modi reaffirmed his unwavering confidence in the people of Banaras and highlighted the significant strides his government has made towards women's empowerment and development over the past decade. PM Modi also urged the attendees to prioritize their health during the campaign period.PM Modi addresses Mahila Sammelan in Varanasi, Uttar Pradesh
May 21st, 05:30 pm
In a heartfelt address at the Mahila Sammelan in Varanasi, Prime Minister Narendra Modi reaffirmed his unwavering confidence in the people of Banaras and highlighted the significant strides his government has made towards women's empowerment and development over the past decade. PM Modi also urged the attendees to prioritize their health during the campaign period.మోదీ జీవించి ఉన్నంత వరకు ఎస్టీ-ఎస్సీ-ఓబీసీ రిజర్వేషన్లను ఎవరూ తొలగించలేరు: బనస్కాంతలో ప్రధాని మోదీ
May 01st, 04:30 pm
మోదీ జీవించి ఉన్నంత వరకు ఎస్టీ-ఎస్సీ-ఓబీసీ రిజర్వేషన్లను ఎవరూ తొలగించలేరు: బనస్కాంతలో ప్రధాని మోదీగుజరాత్లోని బనస్కాంత, సబర్‌కాంతలలో జరిగిన బహిరంగ సభల్లో ప్రధాని మోదీ ప్రసంగం
May 01st, 04:00 pm
గుజరాత్ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని గుజరాత్‌లోని బనస్కాంత మరియు సబర్‌కాంతలలో జరిగిన బహిరంగ సభలలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. తన రాజకీయ ప్రయాణంలో గుజరాత్ ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ, తన మూడవసారి కేంద్ర ప్రభుత్వంలో ఆశీర్వాదం పొందే అవకాశం లభించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.India is the Future: PM Modi
February 26th, 08:55 pm
Prime Minister Narendra Modi addressed the News 9 Global Summit in New Delhi today. The theme of the Summit is ‘India: Poised for the Big Leap’. Addressing the gathering, the Prime Minister said TV 9’s reporting team represents the persity of India. Their multi-language news platforms made TV 9 a representative of India's vibrant democracy, the Prime Minister said. The Prime Minister threw light on the theme of the Summit - ‘India: Poised for the Big Leap’, and underlined that a big leap can be taken only when one is filled with passion and enthusiasm.న్యూస్9 ప్రపంచ సదస్సులో ప్రధానమంత్రి ప్రసంగం
February 26th, 07:50 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో ఇవాళ ‘న్యూస్9 ప్రపంచ సదస్సు’లో ప్రసంగించారు. ఈ మేరకు ‘‘భారత్: భారీ ముందంజకు సిద్ధం’’ ఇతివృత్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ- టీవీ9 పత్రికా విలేకరుల బృందం భారతదేశ వైవిధ్యాన్ని ప్రస్ఫుటం చేస్తున్నదని ప్రధాని పేర్కొన్నారు. ఆ సంస్థ నడుపుతున్న బహుభాషా వార్తావేదికలు ‘టీవీ9’ను సచేతన భారత ప్రజాస్వామ్యానికి ప్రతినిధిగా నిలుపుతున్నాయని ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా సదస్సు ఇతివృత్తం ‘‘భారత్: భారీ ముందంజకు సిద్ధం’’ను ప్రస్తావిస్తూ- అనురక్తి, ఉత్సాహం ఉప్పొంగుతున్నపుడు ఎంత భారీ స్థాయిలోనైనా దూసుకెళ్లడం సాధ్యమేనని ప్రధాని స్పష్టం చేశారు. ఇందుకు తగిన ప్రయోగవేదికను 10 సంవత్సరాల కృషితో సిద్ధం చేశామని, ఈ దిశగా భారత్ ఆత్మవిశ్వాసం, ఆకాంక్షలను ప్రస్తుత సదస్సు ఇతివృత్తం కూడా ప్రతిబింబిస్తున్నదని ఆయన వ్యాఖ్యానించారు. గడచిన పదేళ్లలో దేశ పరివర్తనాత్మకతకు ఆలోచన ధోరణి, ఆత్మవిశ్వాసం, సుపరిపాలన మూల సూత్రాలుగా ఉన్నాయని ప్రధాని పేర్కొన్నారు.Modernization of agriculture systems is a must for Viksit Bharat: PM Modi
February 24th, 10:36 am
PM Modi inaugurated and laid the foundation stone of multiple key initiatives for the Cooperative sector at Bharat Mandapam, New Delhi. Recalling his experience as CM of Gujarat, the Prime Minister cited the success stories of Amul and Lijjat Papad as the power of cooperatives and also highlighted the central role of women in these enterprises.సహకార రంగానికి చెందిన పలు కీలక కార్యక్రమాలను ప్రారంభించిన, శంకుస్థాపన చేసిన పిఎం
February 24th, 10:35 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సహకార రంగానికి చెందిన అనేక కీలక ప్రాజెక్టులకు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో 24వ తేదీన శంకుస్థాపన చేసి కొన్నింటిని ప్రారంభించారు. 11 రాష్ర్టాలకు చెందిన 11 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల్లో (పిఏసిఎస్) ‘‘సహకార రంగంలో ప్రపంచంలోనే అతి పెద్దదైన నిల్వ వసతుల నిర్మాణ ప్రణాళిక’’ కింద ఒక పైలట్ ప్రాజెక్టును ప్రారంభించారు. అలాగే దేశవ్యాప్తంగా మరో 500 పిఏసిఎస్ లలో గిడ్డంగులు, ఇతర వ్యవసాయ మౌలిక వసతుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దీని వల్ల ఆహార ధాన్యాలు నిల్వ చేసే పిఏసిఎస్ గిడ్డంగులన్నీ ఆహార సరఫరా వ్యవస్థతో నిరంతరాయంగా అనుసంధానం అవుతాయి. నబార్డ్ మద్దతుతో జాతీయ సహకార అభివృద్ధి కార్పొరేషన్ (ఎన్ సిడిసి) నాయకత్వంలో సమన్వయపూర్వక కృషితో దేశంలో ఆహార సరఫరా వ్యవస్థ పటిష్ఠం చేయడంతో పాటు, దేశ ఆర్థికాభివృద్ధికి ఇది దోహదపడుతుంది. ప్రస్తుతం అమలులో ఉన్న వ్యవసాయ మౌలిక వసతుల నిధి (ఎఐఎఫ్), వ్యవసాయ మార్కెటింగ్ మౌలిక వసతులు (ఎఎంఐ) వంటి పథకాలన్నింటికీ ఒక్కటిగా చేయడం ద్వారా ఈ కొత్త ప్రాజెక్టును అమలుపరుస్తున్నారు. మౌలిక వసతుల అభివృద్ధి కార్యక్రమం కింద అందుబాటులో ఉన్న సబ్సిడీలు, వడ్డీ రాయితీలు వంటివి పిఏసిఎస్ లు ఉపయోగించుకుని ఈ ప్రాజెక్టులో భాగస్వాములయ్యేందుకు వీలు కలుగుతుంది. అలాగే ‘‘సహకార్ సే సమృద్ధి’’ అనే విజన్ కు దీటుగా సహకార వ్యవస్థను పునరుజ్జీవింపచేసి; చిన్నకారు, సన్నకారు రైతులను సాధికారం చేసేందుకు దేశవ్యాప్తంగా 18,000 పిఏసిఎస్ ల కంప్యూటరీకరణ ప్రాజెక్టును కూడా ప్రధానమంత్రి ప్రారంభించారు.Banas Kashi Sankul will give a boost to the income of more than 3 lakh farmers: PM Modi
February 23rd, 02:45 pm
Prime Minister Narendra Modi inaugurated and laid the foundation stone for multiple development projects worth more than Rs 13,000 crore in Varanasi. Addressing the gathering, the Prime Minister expressed gratitude for being present in Kashi once again and recalled being elected as the Parliamentarian of the city 10 years ago. He said that in these 10 years, Banaras has transformed him into a Banarasi.వారణాసిలో రూ.13,000 కోట్లకు పైగా విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన , జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి
February 23rd, 02:28 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వారణాసిలో రూ.13,000 కోట్ల పైగా పెట్టుబడితో కూడిన పలు అభివృద్ధి పథకాలకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు వేశారు. వారణాసిలోని కర్ఖియాన్ లో యుపిఎస్ఐడిఎ ఆగ్రో పార్క్ లో నిర్మించిన బనస్కాంత జిల్లా కోఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ యూనియన్ లిమిటెడ్ పాల ప్రాసెసింగ్ యూనిట్ -బనాస్ కాశీ సంకుల్- ను ప్రధాని సందర్శించారు. ఆవుల లబ్దిదారులతో ముచ్చటించారు. ఉపాధి లేఖలు, జిఐ అధీకృత యూజర్ సర్టిఫికెట్లను ప్రధాని మోదీ అందజేశారు. ప్రధాని శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేసిన అభివృద్ధి ప్రాజెక్టులు రోడ్లు, రైలు, విమానయానం, పర్యాటకం, విద్య, ఆరోగ్యం, తాగునీరు, పట్టణాభివృద్ధి, పారిశుధ్యం వంటి ముఖ్యమైన రంగాల వృద్ధికి ఉపయోగపడతాయి.2023 వ సంవత్సరం ఆగస్టు 27 వ తేదీ న జరిగిన ‘మన్ కీ బాత్’ (మనసు లోమాట) కార్యక్రమం 104 వ భాగం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
August 27th, 11:30 am
నా ప్రియమైన కుటుంబ సభ్యులారా! నమస్కారం. మన్ కీ బాత్ ఆగస్టు ఎపిసోడ్‌లోకి మరోసారి మీకు హృదయపూర్వక స్వాగతం. శ్రావణ మాసంలో రెండేసి సార్లు గతంలో 'మన్ కీ బాత్' కార్యక్రమం జరిగినట్టు నాకు గుర్తు లేదు. కానీ, ఈసారి అదే జరుగుతోంది. శ్రావణమంటే మహాశివుడి మాసం. వేడుకలు , ఆనందాల నెల. చంద్రయాన్ విజయం ఈ వేడుకల వాతావరణాన్ని అనేక రెట్లు పెంచింది. చందమామ పైకి చంద్రయాన్ చేరుకుని మూడు రోజులకు పైగా కాలం గడిచింది. ఈ విజయంపై ఎంత చర్చ చేసినా ఆ చర్చతో పోలిస్తే ఈ విజయం చాలా పెద్దది. ఈరోజు మీతో మాట్లాడుతున్నప్పుడు నా పాత కవితలోని కొన్ని పంక్తులు గుర్తుకు వస్తున్నాయి.గుజరాత్ లోని దియోదర్ లో బనస్ డెయిరీలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం పూర్తి పాఠం
April 19th, 11:02 am
మీరంతా బాగున్నారని భావిస్తాను. నేను హిందీలో ప్రసంగించాల్సివచ్చినందుకు మొదట మిమ్మల్ని క్షమాపణ కోరుతున్నాను. కాని మీడియా మిత్రులు హిందీలో నేను మాట్లాడితే బాగుంటుందని అభ్యర్థించారు గనుక వారి అభ్యర్థనను మన్నించాలని నేను నిర్ణయించాను.బనాస్ కాంఠా లోని దియోదర్ లో బనాస్ డెయరి సంకుల్ లో అనేక అభివృద్ధి పథకాలను దేశ ప్రజల కు అంకితం చేసిన ప్రధాన మంత్రి; మరికొన్ని అభివృద్ధి పథకాల కు ఆయనశంకుస్థాపన చేశారు
April 19th, 11:01 am
గుజరాత్ లోని బనాస్ కాంఠా జిల్లా లో గల దియోదర్ లో 600 కోట్ల రూపాయల కు పైగా ఖర్చు తో నిర్మాణం జరిగిన ఒక కొత్త డెయరి కాంప్లెక్స్ ను మరియు బంగాళాదుంపల ప్రోసెసింగ్ ప్లాంటు ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న దేశ ప్రజల కు అంకితం చేశారు. ఈ నూతన డెయరి కాంప్లెక్స్ ఒక గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టు గా ఉంది. ఇది రోజు కు దాదాపు 30 లక్షల లీటర్ ల పాల ను ప్రోసెస్ చేయడానికి, సుమారు 80 టన్నుల వెన్న ను, ఒక లక్ష లీటర్ ల ఐస్ క్రీమ్ ను, 20 టన్నుల ఘనీకృత పాల (ఖోయా) ను మరియు 6 టన్నుల చాక్ లెట్ ల ఉత్పత్తి కి వీలు కల్పిస్తుంది. పొటాటో ప్రోసెసింగ్ ప్లాంటు లో ఫ్రెంచ్ ఫ్రైజ్, ఆలూ చిప్స్, ఆలూ టిక్కీ, పేటీ లు మొదలైన ప్రోసెస్డ్ పొటాటో ప్రోడక్ట్ స్ ను తయారు చేసేందుకు ఏర్పాటు లు ఉన్నాయి. వీటి లో చాలా వరకు ఇతర దేశాల కు ఎగుమతి అవుతాయి. ఈ ప్లాంటు లు స్థానిక రైతుల కు సాధికారిత ను కల్పించి, ఆ ప్రాంతం లోని గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ను బలపరుస్తాయి. బనాస్ కమ్యూనిటీ రేడియో స్టేశను ను కూడా దేశ ప్రజల కు ప్రధాన మంత్రి అంకితం చేశారు. వ్యవసాయాని కి, పశుపాలన కు సంబంధించిన విజ్ఞాన శాస్త్ర సంబంధమైనటువంటి సమాచారాన్ని రైతుల కు అందించడం కోసం ఈ సాముదాయిక రేడియో కేంద్రాన్ని ఏర్పాటు చేయడమైంది.ఏప్రిల్ 18 నుంచి 20 వరకు ప్రధానమంత్రి గుజరాత్ సందర్శన
April 16th, 02:36 pm
ఏప్రిల్ 18 నుంచి 20 తేదీల మధ్యన ప్రధానమంత్రి గుజరాత్ సందర్శిస్తున్నారు. 18వ తేదీ సాయంత్రం 6 గంటలకు గాంధీనగర్ లో పాఠశాలల కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సందర్శిస్తారు. 19వ తేదీ ఉదయం 9.40కి బనస్కాంతలోని దియోదర్ లో సంకుల్ వద్ద బనస్ డెయిరీకి శంకుస్థాపన చేసి పలు అభివృద్ధి ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు. మధ్యాహ్నం 3.30కి జామ్ నగర్ లో ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ కు శంకుస్థాపన చేస్తారు. 20వ తేదీ ఉదయం 10.30కి గాంధీనగర్ లో గ్లోబల్ ఆయుష్ ఇన్వెస్ట్ మెంట్ అండ్ ఇన్నోవేషన్ సదస్సును ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 3.30కి దహోద్ లో జరుగనున్న ఆదిజాతి మహా సమ్మేళన్ లో పాల్గొనడంతో పాటు పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు.Strengthening India's dairy sector is one of the top priorities of our government: PM Modi
December 23rd, 11:15 am
Prime Minister Narendra Modi laid the foundation stone of ‘Banas Dairy Sankul’ in Varanasi, Uttar Pradesh. In his speech, PM Modi called for adoption of natural methods of farming and said, “For the rejuvenation of mother earth, to protect our soil, to secure the future of the coming generations, we must once again turn to natural farming.PM inaugurates and lays the foundation of multiple projects in Varanasi
December 23rd, 11:11 am
Prime Minister Narendra Modi laid the foundation stone of ‘Banas Dairy Sankul’ in Varanasi, Uttar Pradesh. In his speech, PM Modi called for adoption of natural methods of farming and said, “For the rejuvenation of mother earth, to protect our soil, to secure the future of the coming generations, we must once again turn to natural farming.వారణాసిలో డిసెంబర్ 23న పలు అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించనున్న ప్రధానమంత్రి
December 21st, 07:41 pm
తాను ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గం అభివృద్ధి, ఆర్థిక పురోగతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిరంతరం కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రధానమంత్రి 23 డిసెంబర్ 21న (గురువారం) మధ్యాహ్నం ఒంటి గంటకు వారణాసిని సందర్శించి బహుళ అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించనున్నారు.