ప్రపంచ కుస్తీ చాంపియన్శిప్ స్ లో కాంస్య పతకం గెలుచుకొన్నందుకు వినేశ్ ఫొగాట్ కు మరియు బజ్ రంగ్ పూనియా కుఅభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి

September 19th, 04:47 pm

బెల్ గ్రేడ్ లో జరిగిన వరల్డ్ రెస్ లింగ్ చాంపియన్ శిప్ స్ లో కంచు పతకం గెలుచుకొన్నందుకు వినేశ్ ఫొగాట్ గారి ని మరియు శ్రీ బజ్ రంగ్ పూనియా ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ క్రీడలు 2022లో పాల్గొనే క్రీడాకారులతో ప్రధాన మంత్రి సంభాషణ

August 13th, 11:31 am

మీ అందరితో ప్రత్యక్షం గా మాట్లాడడం నాకు చాలా ఉత్సాహంగా ఉంది కానీ అందరితో మాట్లాడడం సాధ్యం కాదు. కానీ మీలో చాలా మందికి ఏదో ఒక విధంగా కనెక్ట్ అయ్యే అవకాశం నాకు లభించింది. లేదా ఏదైనా సందర్భంలో మీతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉంది. కానీ మీరు నా ఇంటికి కుటుంబ సభ్యుడిలా రావడానికి సమయం కేటాయించడం నాకు చాలా సంతోషకరమైన విషయం. మీరు సాధించిన విజయాలకు ప్రతి భారతీయుడు గర్విస్తున్నాడు. ఈ విషయంలో మీతో సహకరించగలిగినందుకు నేను కూడా గౌరవంగా భావిస్తున్నాను. మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం.

కామన్‌వెల్త్‌ గేమ్స్‌-2022 భారత బృందానికి ప్రధానమంత్రి సత్కారం

August 13th, 11:30 am

కామన్వెల్త్ గేమ్స్ (సీడబ్ల్యూజీ)-2022లో పాల్గొన్న భారత క్రీడాకారుల బృందాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూ ఢిల్లీలో సత్కరించారు. వివిధ క్రీడల్లో పోటీపడిన క్రీడాకారులు, వారి శిక్షకులతోపాటు కేంద్ర యువజన వ్యవహారాలు-క్రీడలు, సమాచార-ప్రసార శాఖల మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్, క్రీడలశాఖ సహాయ మంత్రి శ్రీ నిసిత్ ప్రమాణిక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బర్మింగ్‌హామ్‌లో ఇటీవల ముగిసిన ఈ క్రీడలలో భారతదేశానికి వివిధ విభాగాల్లో 22 స్వర్ణ, 16 రజత, 23 కాంస్య పతకాలు లభించాయి. ఈ మేరకు పతకాలు సాధించిన క్రీడాకారులను, వారి శిక్షకులను ప్రధానమంత్రి అభినందించారు. సీడబ్ల్యూజీ-2022లో క్రీడాకారుల, శిక్షకుల ప్రతిభా ప్రదర్శనపై హర్షం వ్యక్తం చేస్తూ వారు సాధించిన విజయాలు తమకు గర్వకారణమని అభివర్ణించారు. క్రీడాకారుల అద్భుత కృషి వల్ల దక్కిన అద్భుత విజయాలతో దేశం స్వాతంత్ర్య అమృత కాలంలో ప్రవేశించడం గర్వించదగిన అంశమని ప్రధాని పేర్కొన్నారు.

కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో వరుసగా మూడోసారి పతకం సాధించిన కుస్తీ వీరుడు బజరంగ్ పునియాకు ప్రధానమంత్రి అభినందనలు

August 05th, 11:05 pm

కామన్‌వెల్త్‌ గేమ్స్‌-2022 పురుషుల కుస్తీ 62 కిలోల విభాగంలో బజరంగ్‌ పునియా స్వర్ణ పతకం కైవసం చేసుకుని, వరుసగా మూడోసారి కామన్వెల్త్‌ పతక విజేతగా నిలవడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

ప్రత్యేకమైన చిత్రాలు! భారతదేశం గర్వపడేలా చేసిన ఒలింపియన్లను ప్రధాని మోదీ కలుసుకున్నారు!

August 16th, 10:56 am

ఎర్రకోట ప్రాకారాల నుండి వారిని ప్రశంసిస్తూ, దేశమంతా ప్రశంసలు అందుకున్న ఒక రోజు తర్వాత, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఒలింపిక్స్‌లో పాల్గొని భారతదేశాన్ని గర్వపడేలా చేసిన భారత అథ్లెట్లను కలుసుకున్నారు. ఈవెంట్ నుండి కొన్ని ప్రత్యేకమైన చిత్రాలు ఇక్కడ ఉన్నాయి!

టోక్యో ఒలింపిక్స్ లో మల్లయుద్ధం లో కాంస్య పతకాన్ని గెలిచినందుకు బజ్ రంగ్ పూనియా ను అభినందించిన ప్రధాన మంత్రి

August 07th, 05:49 pm

టోక్యో ఒలింపిక్స్ లో మల్లయుద్ధం లో కాంస్య పతకాన్ని గెలిచినందుకు బజ్ రంగ్ పూనియా కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందన లు తెలిపారు.

పూర్వ ప్ర‌ధాని శ్రీ అట‌ల్ బిహారీ వాజ్‌పేయీ స్మృత్య‌ర్థం ఏర్పాటైన ఒక ప్రార్థ‌న స‌భ లో ప్ర‌సంగించిన ప్ర‌ధాన మంత్రి

August 20th, 05:10 pm

ఇటీవ‌లే క‌న్నుమూసిన పూర్వ ప్ర‌ధాని శ్రీ అట‌ల్ బిహారీ వాజ్‌పేయీ స్మృత్య‌ర్థం న్యూ ఢిల్లీ లో ఈ రోజున నిర్వ‌హించిన ఒక ప్రార్థ‌న స‌భ లో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ పాల్గొని స‌భికుల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు.

శ్రీ బజ‌రంగ్ పూనియా ఏశియ‌న్ గేమ్స్ 2018 లో 65 కేజీ ఫ్రీస్టైల్ రెజ్లింగ్ లో స్వ‌ర్ణాన్ని గెలుచుకున్నందుకు ఆయనను అభినందించిన‌ ప్ర‌ధాన మంత్రి

August 19th, 08:55 pm

శ్రీ బజ‌రంగ్ పూనియా ఏషియ‌న్ గేమ్స్ 2018 లో 65 కేజీ ఫ్రీస్టైల్ రెజ్లింగ్ లో స్వ‌ర్ణాన్ని గెలుచుకొన్నందుకు ఆయన కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.

ఆసియా కుస్తీ చాంపియన్ షిప్ లో స్వర్ణాన్ని గెల్చుకున్న శ్రీ బజరంగ్ పూనియా కు ప్రధాన మంత్రి అభినందనలు

May 13th, 11:09 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆసియా కుస్తీ చాంపియన్ షిప్ లో స్వర్ణాన్ని గెల్చుకున్న శ్రీ బజరంగ్ పూనియా ను అభినందించారు.