ఎన్ హెచ్-334బి లో భాగం గా 40.2 కి.మీ. భాగాన్ని నిర్మించడంలో దీర్ఘకాలం పాటు మన్నిక ను కలిగివుండేటటువంటి సామగ్రి ని ఉపయోగించడాన్నిప్రశంసించిన ప్రధాన మంత్రి

June 14th, 10:57 pm

ఎన్ హెచ్-334బి లో 40.2 కిలో మీటర్ ల మేర రహదారి ని నిర్మించడం కోసం ప్లాస్టిక్ వ్యర్థాలు మరియు ఫ్లయ్ ఏశ్ వంటి దీర్ఘకాలం పాటు మన్నిక కలిగివుండేటటువంటి సామగ్రి ని ఉపయోగించడాని కి ప్రాధాన్యాన్ని ఇవ్వడాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఇలా చేయడం వల్ల ఖర్చు తక్కువ కావడం తో పాటుగా పర్యావరణ అనుకూల ప్రయోజనాలు కూడా సిద్ధిస్తాయి. ఈ రహదారి భాగం యుపి-హరియాణా సరిహద్దు సమీపం లో బాగ్ పత్ వద్ద మొదలై, హరియాణా లోని రోహ్ నా వద్ద ముగుస్తున్నది.

డిసెంబర్4న దేహ్ రాదూన్ లో అనేక పథకాల ను ప్రారంభించడం తో పాటు మరికొన్నిపథకాల కు శంకుస్థాపన కూడా చేయనున్న ప్రధాన మంత్రి; ఈ పథకాల విలువ సుమారు 18,000 కోట్ల రూపాయలు

December 01st, 12:06 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 డిసెంబర్ 4 వ తేదీ న మధ్యాహ్నం ఒంటి గంట వేళ లో దేహ్ రాదూన్ లో పర్యటించనున్నారు. దాదాపు గా 18,000 కోట్ల రూపాయల వ్యయం కలిగిన పలు ప్రాజెక్టుల లో కొన్నిటిని ఆయన ప్రారంభించి మరి కొన్ని ప్రాజెక్టుల కు శంకుస్థాపన చేస్తారు. ముఖ్యమైన రహదారుల కు సంబంధించిన మౌలిక సదుపాయాల కల్పన ను మెరుగు పరచడం పై ఈ పర్యటన కాలం లో శ్రద్ధ తీసుకోనున్నారు. ఈ ప్రాజెక్టు లు ప్రయాణాన్ని సాఫీ గా, సురక్షితం గా మలచగలవు. అంతేకాదు, ఈ ప్రాంతం లో పర్యటన అవకాశాల ను కూడా పెంచగలవు. ఒకప్పుడు చేరుకోవడం కష్టం అని భావించిన మారుమూల ప్రాంతాల కు సంధానం సౌకర్యాన్ని పెంచాలన్న మంత్రి దృష్టి కోణాని కి అనుగుణం గా ఈ ప్రాజెక్టు లు ఉన్నాయి.