శ్రీశివ్ శాహీర్ బాబాసాహెబ్ పురందరే కన్నుమూత పట్ల సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి

November 15th, 10:17 am

రచయిత, చరిత్రకారుడు, రంగస్థల ప్రముఖుడు శ్రీ శివ్ శాహీర్ బాబాసాహెబ్ పురందరే కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ దుఃఖాన్ని వ్యక్తం చేశారు. ఆయన రాబోయే తరాలవారి ని ఛత్రపతి శివాజీ మహారాజ్ తో జతపరచడం లో శ్రీ శివ్ శాహీర్ బాబాసాహెబ్ పురందరే తోడ్పాటు ను గుర్తు కు తెచ్చుకున్నారు. శ్రీ నరేంద్ర మోదీ కొన్ని నెలల కిందట ఆయన శతాబ్ది సంవత్సరాల సంబంధి కార్యక్రమంలో తాను చేసిన ప్రసంగాన్ని కూడా పోస్ట్ చేశారు.

బాబా సాహెబ్ పురందరే శతజయంతి ఉత్సవాల సందర్భంగా ప్రధాన మంత్రి సందేశం

August 13th, 08:36 pm

ఈ కార్యక్రమం లో మనల్ని ఆశీర్వదిస్తున్న గౌరవనీయులైన బాబా సాహెబ్ పురందరే గారు, బాబా సాహెబ్ సత్కార్ సమారోహ్ సమితి అధ్యక్షులు సుమిత్రా తాయి , శివశాహి పైన భక్తితో విశ్వసించే బాబా సాహెబ్ అనుచర గణం అందరూ

బాబా సాహెబ్‌ పురందరే నూరో జన్మదిన వేడుకపై ప్రధానమంత్రి సందేశం

August 13th, 08:34 pm

శ్రీ బాబా సాహెబ్‌ పురందరే 100వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు ఘన నీరాజనం అర్పించారు. బాబా సాహెబ్‌ జీవితంలో శతాబ్ది జన్మదిన వేడుకల సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ- మన రుషి పుంగవులు ప్రవచించిన చురుకైన, మానసిక చైతన్యంతో కూడిన నిండు నూరేళ్ల జీవితానికి బాబా సాహెబ్‌ పురందరే జీవితం అద్భుత తార్కాణమని పేర్కొన్నారు. అంతేకాకుండా భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో పురందరే నూరో సంవత్సరంలో ప్రవేశించడ ఒక యాదృచ్ఛిక హర్షణీయ సందర్భమని ఆయన అభివర్ణించారు. దేశ చరిత్రలో అమరువీరులైన వారి ఉజ్వల చరిత్ర రచనలో బాబా సాహెబ్‌ పురందరే కృషిని ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. “శివాజీ మహరాజ్‌ జీవితం, చరిత్రను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆయన అద్భుత కృషికి మనం సదా రుణపడి ఉండాలి” అని ప్రధాని పేర్కొన్నారు. కాగా, శ్రీ పురందరేను కేంద్ర ప్రభుత్వం 2019లో పద్మవిభూషణ్‌ పురస్కారంతో సత్కరించగా, 2015లో అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వం ‘మహారాష్ట్ర భూషణ్‌’ పురస్కారం అందజేసింది. అలాగే మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం కూడా ‘కాళిదాస్‌’ పురస్కారంతో గౌరవించింది.