
కొమొరోస్ యొక్కరాష్ట్రపతి గా శ్రీ అజాలీ అసోమానీ తిరిగి ఎన్నికైన సందర్భం లో ఆయన కు అభినందనల నుతెలిపిన ప్రధాన మంత్రి
January 29th, 10:30 pm
భారతదేశం-కొమొరోస్ భాగస్వామ్యాన్ని, భారతదేశం-ఆఫ్రికా భాగస్వామ్యాన్ని మరియు ‘విజన్ సాగర్’ ను మరింత బలపరచాలని తాను ఆశపడుతున్నట్లు కూడా శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
కొమొరెజ్ అధ్యక్షుడితో ప్రధానమంత్రి సమావేశం
September 10th, 05:20 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ న్యూఢిల్లీలో జి-20 శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో కొమొరెజ్ సమాఖ్య అధ్యక్షులు మాననీయ అజలీ అసౌమనితో 2023 సెప్టెంబరు 10న సమావేశమయ్యారు. జి-20 కూటమిలో ఆఫ్రికా సమాఖ్య శాశ్వత సభ్యత్వం పొందడంలో ప్రధానమంత్రి కృషికి ఈ సందర్భంగా అధ్యక్షులు అసౌమని కృతజ్ఞతలు తెలిపారు. అందునా ఆఫ్రికాతో భారతదేశానికి లోతైన సంబంధాలున్న నేపథ్యంలో జి-20కి భారత్ అధ్యక్షత వహిస్తున్న సమయాన చోటుచేసుకున్న ఈ పరిణామం ప్రత్యేక ఆనందాన్నిచ్చిందని ఆయన చెప్పారు. తద్వారా భారత్-కొమొరెజ్ సంబంధాలకు ఉత్తేజం లభిస్తుందని అభిప్రాయపడ్డారు. జి-20 అధ్యక్ష బాధ్యతలను విజయంతంగా నిర్వర్తించడంపై ప్రధానమంత్రిని ఆయన అభినందించారు.
ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఫౌండింగ్ కాన్ఫరెన్స్లో భాగంగా ప్రధాని ద్వైపాక్షిక సమావేశాలు
March 11th, 05:08 pm
న్యూఢిల్లీలో ఇంటర్నేషనల్ సోలార్ అలయయన్స్ ఫౌండింగ్ కాన్ఫరెన్స్లో భాగంగా పలు దేశాల నాయకులతో ప్రధాని నరేంద్ర మోదీ ద్వైపాక్షిక స్థాయి చర్చలు నిర్వహించారు. ఆయన అబూ ధాబి, శ్రీలంక, బంగ్లాదేశ్, సీషెల్స్, కొమొరోస్ మరియు అనేక ఇతర దేశాల నుండి నాయకులను కలుసుకున్నారు.