ఏఐఐఏలో వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన సందర్భంగా ప్రధానమంత్రి చేసిన ప్రసంగానికి అనువాదం
October 29th, 01:28 pm
ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రివర్గ సహచరులు, శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా, మన్సుఖ్ మాండవీయ, ప్రతాప్ రావ్ జాదవ్, శ్రీమతి అనుప్రియా పటేల్, శోభా కరంద్లాజే, ఈ ప్రాంతం నుంచి పార్లమెంట్ సభ్యుడిగా వ్యవహరిస్తోన్న శ్రీ రామ్‌వీర్ సింగ్ బిధూరీ, ఈ కార్యక్రమానికి వర్చువల్‌గా హాజరైన వివిధ రాష్ట్రాల గవర్నర్లు, గౌరవ ముఖ్యమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, వైద్యులు, ఆయుర్వేదాన్ని, ఆయుష్‌ను ప్రాక్టీస్ చేస్తున్నవారు, దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఆరోగ్య సంస్థల్లో పనిచేస్తున్న నిపుణులు, ఆరోగ్య రంగంలో పనిచేస్తున్న వారికి, అఖిల భారత ఆయుర్వేద సంస్థకు చెందిన వైద్యులు, ఇతర సిబ్బందికి, సోదరసోదరీమణులారా!ఆరోగ్య రంగంలో రూ. 12,850 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టుల ఆవిష్కరణ, ప్రారంభం, శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
October 29th, 01:00 pm
ధన్వంతరి జయంతి, 9వ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా... ఈరోజు న్యూఢిల్లీలోని అఖిల భారత ఆయుర్వేద సంస్థ (ఏఐఐఏ)లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆరోగ్య రంగానికి సంబంధించి దాదాపు రూ.12,850 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టుల్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కొన్నింటిని ప్రారంభించగా, మరికొన్నింటిని ఆవిష్కరించారు. అలాగే కొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.పండిట్ మదన్ మోహన్ మాలవీయ రచనల ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రధాన మంత్రి ప్రసంగం
December 25th, 04:31 pm
కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు శ్రీ అనురాగ్ ఠాకూర్ గారు, అర్జున్ రామ్ మేఘ్వాల్ గారు, నా చిరకాల మిత్రుడు, మహామన సంపూర్ణ వంగమే చీఫ్ ఎడిటర్, మహామన మాలవీయ మిషన్ అధ్యక్షుడు రామ్ బహదూర్ రాయ్ గారు, ప్రభు నారాయణ్ శ్రీవాస్తవ గారు, వేదికపై ఉన్న విశిష్ట వ్యక్తులు, మహిళలు మరియు పెద్దమనుషులు!పండిట్ మదన్ మోహన్ మాలవీయ 162వ జయంతిని పురస్కరించుకుని, సేకరించిన ఆయన రచనలను ఆవిష్కరించిన ప్రధానమంత్రి
December 25th, 04:30 pm
మహామన పండిట్ మదన్ మోహన్ మాలవీయ 162వ జయంతి సందర్భంగా, ఈరోజు న్యూ ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో 'కలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ పండిట్ మదన్ మోహన్ మాలవ్య' 11 సంపుటాల మొదటి సిరీస్‌ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విడుదల చేశారు. శ్రీ మోదీ, పండిట్ మదన్ మోహన్ మాలవీయ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బనారస్ హిందూ విశ్వవిద్యాలయం ప్రముఖ వ్యవస్థాపకుడు, పండిట్ మదన్ మోహన్ మాలవీయ ఆధునిక భారతదేశ నిర్మాతలలో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించారు. ప్రజలలో జాతీయ చైతన్యాన్ని పెంపొందించడానికి అపారంగా కృషి చేసిన విశిష్ట పండితులు, స్వాతంత్య్ర సమరయోధుడు అని ఆయన గుర్తు చేసుకున్నారు.ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి విశేష స్పందనపై ప్రధాని ప్రశంస
October 16th, 09:22 pm
ఆయుష్మాన్ భవ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం కింద 80,000 మందికిపైగా ప్రజలు అవయవ దానానికి ప్రతినబూనడం ఈ కార్యక్రమ విజయానికి తిరుగులేని నిదర్శనమని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ప్రశంసించారు.