ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పిఎంఎఫ్ బివై), పునర్వ్యవస్థీకరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం (ఆర్ డబ్ల్యుబిసిఐఎస్) మార్పులకు మంత్రివర్గం ఆమోదం

January 01st, 03:07 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం రూ.69,515.71 కోట్ల వ్యయంతో ( 2021-22 నుంచి 2025-26 వరకూ) ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన, పునర్వ్యవస్థీకరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాన్ని 2025-26 వరకు కొనసాగించడానికి ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం 2025-26 వరకు దేశవ్యాప్తంగా రైతులకు అనివార్య ప్రకృతి వైపరీత్యాల నుండి పంటలను రక్షించడానికి సహాయపడుతుంది.