‘ఆరోగ్యం మరియు వైద్య పరిశోధన’ అనే అంశం పై ఏర్పాటైన బడ్జెటు అనంతర వెబినార్ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం

March 06th, 10:30 am

ఆరోగ్య సంరక్షణను కోవిడ్ కు ముందు, మహమ్మారి అనంతర యుగం రెండింటి నేపథ్యంలో చూడాలి. ఇలాంటి విపత్తుల నేపథ్యంలో సంపన్న దేశాల అభివృద్ధి చెందిన వ్యవస్థలు కూడా కుప్పకూలుతాయని కరోనా ప్రపంచానికి చాటిచెప్పింది. ఆరోగ్య సంరక్షణపై ప్రపంచం దృష్టి గతంలో కంటే ఇప్పుడు ఎక్కువగా ఉంది, కానీ భారతదేశం యొక్క విధానం ఆరోగ్య సంరక్షణకు మాత్రమే పరిమితం కాదు. బదులుగా, మేము ఒక అడుగు ముందుకేసి మొత్తం శ్రేయస్సు కోసం పనిచేస్తున్నాము. అందుకే మనం ప్రపంచం ముందు 'వన్ ఎర్త్-వన్ హెల్త్' అనే విజన్ను ఉంచాం. మానవులు, జంతువులు లేదా మొక్కలు వంటి జీవులకు సంపూర్ణ ఆరోగ్య సంరక్షణకు మేము ప్రాధాన్యత ఇస్తున్నాము. కరోనా ప్రపంచ మహమ్మారి కూడా సరఫరా గొలుసు యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది. మహమ్మారి తారస్థాయికి చేరిన సమయంలో మందులు, వ్యాక్సిన్లు, వైద్య పరికరాలు వంటి ప్రాణరక్షణ వస్తువులు దురదృష్టవశాత్తూ కొన్ని దేశాలకు ఆయుధాలుగా మారాయి. గత కొన్నేళ్ల బడ్జెట్ లో భారత్ ఈ అంశాలన్నింటిపై చాలా దృష్టి సారించింది. విదేశాలపై భారత్ ఆధారపడటాన్ని తగ్గించడానికి మేము నిరంతరం ప్రయత్నిస్తున్నాము. అందువల్ల, ఈ విషయంలో భాగస్వాములందరూ ముఖ్యమైన పాత్ర పోషించాలి.

‘ఆరోగ్యం మరియు వైద్య పరిశోధన’ అనే అంశం పై ఏర్పాటైన బడ్జెటు అనంతరవెబినార్ ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి

March 06th, 10:00 am

‘ఆరోగ్యం మరియు వైద్య సంబంధి పరిశోధన’ అనే అంశం పై ఏర్పాటైన బడ్జెటు అనంతర వెబినార్ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. యూనియన్ బడ్జెటు 2023 లో ప్రకటించిన కార్యక్రమాల ను ప్రభావంతమైనటువంటి రీతి లో అమలు పరచడం కోసం ప్రభుత్వం ఆలోచనల ను మరియు సూచనల ను ఆహ్వానిస్తూ ఏర్పాటు చేస్తున్న బడ్జెటు అనంతర వెబినార్ లు పన్నెండిటి లో ఈ వెబినార్ తొమ్మిదో వెబినార్.

గుజరాత్ లో జరిగిన ఇన్వెస్టర్ల సదస్సులో ప్రధాన మంత్రి ప్రసంగం

August 13th, 11:01 am

కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు శ్రీ నితిన్ గడ్కరీ గారు, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపానీ గారు, ఆటో పరిశ్రమతో సంబంధం ఉన్న భాగస్వాములందరూ, ఒ.ఎం.ఇ.ఎం సంఘాలు, మెటల్ మరియు స్క్రాపింగ్ పరిశ్రమ సభ్యులు, లేడీస్ అండ్ జెంటిల్మెన్!

గుజరాత్ లో ఇన్వెస్టర్ సమిట్ ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి

August 13th, 11:00 am

గుజరాత్ లో జరిగిన ఇన్వెస్టర్ సమిట్ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు. వాలంటరి వెహికల్ ఫ్లీట్ మోడర్నైజేశన్ ప్రోగ్రామ్ లేదా వెహికల్ స్క్రాపింగ్ పాలిసీ లో భాగం గా వెహికల్ స్క్రాపింగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ను ఏర్పాటు చేయడానికి అవసరమైన పెట్టుబడుల ను ఆహ్వానించడం కోసం ఈ శిఖర సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ఒక ఏకీకృతమైన స్క్రాపింగ్ హబ్ ను అభివృద్ధి పరచడం కోసం అలంగ్ లో గల శిప్ బ్రేకింగ్ పరిశ్రమ అందిస్తున్నటువంటి అవకాశాల ను సైతం సమగ్రం గా వివరించనుంది. ఈ సందర్భం లో రోడ్డు రవాణా, హైవేస్ శాఖ కేంద్ర మంత్రి తో పాటు గుజరాత్ ముఖ్యమంత్రి కూడా హాజరయ్యారు.

వెహికల్స్క్రాపేజి పాలిసి ఈ రోజు న ప్రారంభం కావడం భారతదేశం అభివృద్ధి యాత్ర లో ఒక ప్రముఖమైనటువంటిమైలురాయి గా ఉంది: ప్రధాన మంత్రి

August 13th, 10:22 am

ఈ రోజు న ప్రారంభమైన వెహికల్ స్క్రాపేజ్ పాలిసి భారతదేశం అభివృద్ధి ప్రస్థానం లో ఒక ప్రముఖమైనటువంటి మైలురాయి గా ఉంది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

ఆగ‌స్టు 13న ఇన్వెస్ట‌ర్ల శిఖ‌రాగ్ర‌స‌దస్సును ఉద్దేశించి ప్ర‌సంగించ‌నున్న ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ.

August 11th, 09:35 pm

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ ఈనెల 13 వ తేదీ ఉద‌యం 11 గంట‌ల‌కు గుజ‌రాత్‌లో ఇన్వెస్ట‌ర్ స‌మ్మిట్‌ను ఉద్దేశించి వీడియో కాన్ఫ‌రెన్సు ద్వారా ప్ర‌సంగించ‌నున్నారు. వాలంట‌రీ వెహికిల్ ఫ్లీట్ మోడ‌ర్నైజేష‌న్ ప‌థ‌కం లేదా వెహికిల్ స్క్రాపింగ్ విధానం కింద పెట్టుబ‌డుల‌ను ఆహ్వానించేందుకు ఈ స‌మ్మిట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ స్క్రాపింగ్ హబ్ అభివృద్ధి కోసం అలాంగ్‌లో షిప్ బ్రేకింగ్ పరిశ్రమ అందించే స‌దుపాయాల‌పై కూడా ఇది దృష్టిని ఆకర్షిస్తుంది.