గ్రీస్ లోని ఏథెన్స్ లో భారతీయులనుద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
August 25th, 09:30 pm
వేడుకల వాతావరణం, పండుగ ఉత్సాహం ఉన్నప్పుడు ఎవరైనా త్వరగా తమ కుటుంబ సభ్యుల మధ్య ఉండాలని కోరుకుంటారు.నేను కూడా నా కుటుంబ సభ్యుల మధ్యకు వచ్చాను. ఇది ఒక రకంగా శివుని మాసంగా భావించే శ్రావణ మాసం, ఈ పవిత్ర మాసంలో మన దేశం ఒక కొత్త మైలురాయిని సాధించింది. చంద్రుడి డార్క్ జోన్ అయిన దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ నిలిచింది. చంద్రుడిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి, భారత సామర్థ్యాలను యావత్ ప్రపంచానికి చాటిచెప్పింది. ప్రపంచం నలుమూలల నుంచి అభినందన సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలు తమ శుభాకాంక్షలను పంపుతున్నారు, మరియు ప్రజలు మిమ్మల్ని కూడా అభినందిస్తున్నారని నేను గట్టిగా నమ్ముతున్నాను, కాదా? మీకు చాలా అభినందనలు కూడా వస్తున్నాయి కదా? ప్రతి భారతీయుడు దీనిని అందుకుంటున్నాడు. సోషల్ మీడియా మొత్తం అభినందన సందేశాలతో నిండిపోయింది. విజయం అంత ముఖ్యమైనప్పుడు, ఆ విజయం కోసం ఉత్సాహం స్థిరంగా ఉంటుంది. మీరు ప్రపంచంలో ఎక్కడైనా జీవించవచ్చు, కానీ భారతదేశం అనే భావన మీ హృదయంలో బలంగా ఉంటుందని మీ ముఖం కూడా చెబుతుంది. భారతదేశం మీ గుండె లయలో ఉంటుంది, భారతదేశం మీ గుండె లయలో ఉంటుంది, భారతదేశం మీ గుండె లయలో ఉంటుంది. ఈ రోజు, నేను మీ అందరి మధ్య గ్రీస్ లో ఉన్నాను, చంద్రయాన్ యొక్క అద్భుతమైన విజయానికి మరోసారి నేను ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.ఏథెన్స్ లో ఉంటున్న భారతీయ సముదాయం తో మాట్లాడిన ప్రధాన మంత్రి
August 25th, 09:00 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 ఆగస్టు 25 వ తేదీ నాడు ఏథెన్స్ లోని ఏథెన్స్ కన్సర్వేటాయర్ లో భారతీయ సముదాయాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.