హిందూస్థాన్ టైమ్స్ నాయకత్వ సదస్సు 2024లో ప్రధాని ప్రసంగానికి అనువాదం

November 16th, 10:15 am

వందేళ్ల క్రితం, పూజనీయ బాపూజీ హిందూస్థాన్ టైమ్స్‌ను ప్రారంభించారు. ఆయన గుజరాతీ మాట్లాడతారు. వందేళ్ల తర్వాత మరో గుజరాతీని మీరు ఇక్కడకు ఆహ్వానించారు. హిందూస్థాన్ టైమ్స్‌కు, ఈ వందేళ్ల చారిత్రక ప్రయాణంలో ఈ పత్రికతో కలసి పనిచేసిన వారికి, అభివృద్ధిలో భాగస్వాములైనవారికి, సవాళ్లను ఎదుర్కొని నిలదొక్కుకున్న వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రోజు ఈ అభినందనలకు, గౌరవానికి వీరంతా అర్హులు. వందేళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకోవడమంటే సామాన్యమైన విషయం కాదు. ఈ గుర్తింపునకు మీరంతా అర్హులు, మీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను. ఇక్కడికి రాగానే, ఈ కుటుంబ సభ్యులను నేను కలుసుకున్నాను. వందేళ్ల ప్రయాణాన్ని (హిందూస్థాన్ టైమ్స్) తెలియజేసే ప్రదర్శనను సందర్శించాను. మీకు సమయం ఉంటే, ఇక్కడి నుంచి వెళ్లే ముందు దాన్ని సందర్శించాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. అది ప్రదర్శన మాత్రమే కాదు. ఓ అనుభవం. నా కళ్ల ముందే వందేళ్ల చరిత్ర నడయాడిన అనుభూతికి నేను లోనయ్యాను. భారత దేశానికి స్వాంతంత్య్రం వచ్చిన రోజు, రాజ్యాంగం అమల్లోకి వచ్చన నాటి పత్రికలను నేను చూశాను. మార్టిన్ లూథర్ కింగ్, నేతాజీ సుభాష్ చంద్ర బోస్, డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, అటల్ బిహారీ వాజపేయి, డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ వంటి విశిష్ట వ్యక్తులు హిందూస్థాన్ టైమ్స్‌లో వ్యాసాలు రాసేవారు. వారి రచనలు పత్రికను సుసంపన్నం చేశాయి. నిజంగా మనం చాలా దూరమే ప్రయాణించాం. స్వాంతంత్య్రం సాధించడానికి చేసిన పోరాటం నుంచి, స్వాంతంత్య్రం అనంతరం సరిహద్దులు లేని ఆశల తరంగాలను చేరుకోవడం వరకు చేసిన ప్రయాణం అద్భుతం, అసాధారణం. అక్టోబర్ 1947లో కశ్మీర్ భారత్‌లో విలీనమైన తర్వాత ప్రతి పౌరుడూ అనుభవించిన ఉత్సాహాన్ని మీ వార్తా పత్రిక ద్వారా తెలుసుకున్నాను. సరైన నిర్ణయం తీసుకోలేకపోవడం వల్ల ఏడు దశాబ్దాలుగా కశ్మీర్లో హింస ఎలా చెలరేగిందో కూడా తెలుసుకోగలిగాను. గతానికి భిన్నంగా జమ్ము కశ్మీర్లో రికార్డు స్థాయిలో జరిగిన పోలింగ్‌కు సంబంధించిన వార్తలను ఈ రోజు మీ పత్రికలో ప్రచురిస్తున్నారు. పత్రిక మరో పేజీ కూడా పాఠకుల దృష్టిని ఆకర్షించింది. ఒక వైపు అస్సాంను కల్లోలిత ప్రాంతంగా ప్రకటించారన్న వార్తను ప్రచురిస్తే, మరో పక్క అటల్‌జీ బీజేపీకి పునాది వేశారన్న వార్త ప్రచురించారు. ఈ రోజు అస్సాంలో శాశ్వతంగా శాంతిని నెలకొల్పడంలో బీజేపీ ప్రధాన పాత్ర పోషించడం కాకతాళీయమే.

న్యూఢిల్లీలో ‘2024- హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్’ సదస్సులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

November 16th, 10:00 am

న్యూఢిల్లీలో ఈరోజు ఏర్పాటైన ‘2024-హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సమిట్’ నుద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. వందేళ్ల కిందట జాతి పిత మహాత్మా గాంధీ చేతుల మీదుగా ప్రారంభమైన హిందుస్థాన్ టైమ్స్ పత్రిక, నూరేళ్ళ చారిత్రాత్మక ప్రయాణం పూర్తిచేసినందుకు పత్రిక యాజమాన్యానికి అభినందనలు తెలియజేశారు. తొలినాళ్ళ నుంచీ పత్రికతో అనుబంధం కలిగిన వారిని అభినందిస్తూ, వారికి అన్ని విధాలా శుభం చేకూరాలని ఆకాంక్షించారు. పత్రిక శతాబ్ది వేడుకల సందర్భంగా ఏర్పాటైన ప్రత్యేక ప్రదర్శనను తిలకించిన శ్రీ మోదీ, అద్భుతమైన ఈ ప్రదర్శనను ప్రతినిధులందరూ తప్పక సందర్శించాలని సూచించారు. భారత్ కు స్వాతంత్య్రం సిద్ధించిన సందర్భం, రాజ్యాంగం అమలు… మొదలైన అలనాటి చారిత్రక ఘట్టాలకు సంబంధించిన పాత ప్రతులను చూసే అవకాశం కలిగిందన్నారు. మార్టిన్ లూథర్ కింగ్, నేతాజీ సుభాష్ చంద్ర బోస్, డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ, అటల్ బిహారీ వాజపేయి, డాక్టర్ ఎం ఎస్ స్వామినాథన్ వంటి లబ్ధ ప్రతిష్ఠులు హిందుస్థాన్ టైమ్స్ పత్రికకు వ్యాసాలు రాసేవారని శ్రీ మోదీ గుర్తు చేసుకున్నారు. స్వాతంత్య్ర పోరు నాటి పరిస్థితులకు, అనంతర కాలంలోని ఆశలూ ఆకాంక్షలకు ప్రత్యక్షసాక్షిగా నిలిచిన పత్రిక ప్రయాణం అద్భుతమనదగ్గదని అన్నారు. అక్టోబర్ 1947లో భారతదేశంలో కాశ్మీర్ విలీనానికి సంబంధించిన వార్తను తానూ మిగతా దేశవాసులతో కలిసి అబ్బురంగా చదివానని శ్రీ మోదీ నెమరువేసుకున్నారు. నిర్ణయం తీసుకోవడంలో అసంగదిగ్ధత కాశ్మీర్ ను ఏ విధంగా ప్రతికూలంగా ప్రభావితం చేసిందో ఆ క్షణం తనకు అవగతమైందని, ఏడు సుదీర్ఘ దశాబ్దాల పాటు కాశ్మీర్ హింసను ఎదుర్కొనవలసి వచ్చిందని అన్నారు. ఇప్పటి పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని, ఇప్పుడు జమ్ము కాశ్మీర్ ఎన్నికల్లో రికార్డు సంఖ్యలో ఓటర్లు పాల్గొనడం గురించి వార్తల ప్రచురణ తనకెంతో ఆనందాన్ని కలిగిస్తోందని చెప్పారు. తనని ఆకర్షించిన మరో వార్త గురించి చెబుతూ, వార్తా పత్రిక ఒకవైపు పుటలో అస్సాం ను సమస్యాత్మక ప్రాంతంగా ప్రకటించిన వార్త ప్రచురితమవగా, మరోవైపు భారతీయ జనతా పార్టీకి అటల్ బిహారీ వాజపేయి శంకుస్థాపనకు సంబంధించిన వార్త ప్రచురితమైందని వెల్లడించారు. నేడు అస్సాంలో సుస్థిర శాంతిని నెలకొల్పేందుకు అదే బీజేపీ కీలక భూమిక పోషిస్తూండడం తనకు ఆనందం కలిగిస్తోందని హర్షం వ్యక్తం చేశారు.

Tribal society is the one that led the fight for centuries to protect India's culture and independence: PM Modi

November 15th, 11:20 am

PM Modi addressed Janjatiya Gaurav Diwas, emphasizing India's efforts to empower tribal communities, preserve their rich heritage, and acknowledge their vital role in nation-building.

గిరిజన గౌరవ దినోత్సవం సందర్భంగా భగవాన్ బిర్సా ముండా150వ జయంతి వేడుకలను ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

November 15th, 11:00 am

జనజాతీయ గౌరవ్ దివస్ సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు(నవంబర్ 15న) భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి ఉత్సవాలను ప్రారంభించారు. బీహార్‌లోని జముయిలో దాదాపు రూ. 6,640 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలూ ప్రారంభోత్సవాలూ చేశారు. వేడుకల సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగించారు.

ఉత్తరాఖండ్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

November 09th, 11:00 am

నేటి నుంచి ఉత్తరాఖండ్ రజతోత్సవ సంవత్సరం మొదలవుతుంది. అంటే ఉత్తరాఖండ్ 25వ వసంతంలోకి అడుగుపెడుతోంది. రాష్ట్రానికి ఉజ్వలమైన, జాజ్వల్యమానమైన భవిష్యత్తును నిర్మించే దిశగా అంకితభావంతో మనముందున్న వచ్చే 25 సంవత్సరాల ప్రస్థానాన్ని మనం ప్రారంభించాలి. యాదృచ్ఛికమే అయినా, సంతోషకరమైన విషయమొకటి ఇందులో ఉంది: జాతీయవృద్ధి కోసం అంకితం చేసిన 25 ఏళ్ల విశేష సమయమైన భారత అమృత్ కాల్, మనం సాధించబోయే ఈ పురోగతి ఏకకాలంలో తటస్థించబోతున్నాయి. అభివృద్ధి చెందిన భారత్‌లో అభివృద్ధి చెందిన ఉత్తరాఖండ్ భావనను ఈ కలయిక దృఢపరుస్తుంది. ఈ కాలంలో మనందరి ఆకాంక్షలు నెరవేరతాయి. ఉత్తరాఖండ్ ప్రజలు రానున్న 25 ఏళ్ల లక్ష్యాలపై దృష్టి సారించి రాష్ట్రవ్యాప్తంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను. ఈ కార్యక్రమాల ద్వారా ఉత్తరాఖండ్ ఘనతను చాటడంతోపాటు అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అనే భావన రాష్ట్ర ప్రజలందరిలో ప్రతిధ్వనిస్తుంది. దృఢ సంకల్పాన్ని స్వీకరించిన ఈ ముఖ్య సందర్భంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. రెండు రోజుల కిందటే ప్రవాసీ ఉత్తరాఖండ్ సమ్మేళన్ విజయవంతంగా నిర్వహించారు. మన ప్రవాస ఉత్తరాఖండ్ వాసులు రాష్ట్ర అభివృద్ధి ప్రస్థానంలో గణనీయమైన పాత్ర పోషిస్తారని విశ్వసిస్తున్నాను.

దేవభూమి ఉత్తరాఖండ్ రజతోత్సవ సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు

November 09th, 10:40 am

ఉత్తరాఖండ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ఏర్పాటు రజతోత్సవ సంవత్సరం ఈ రోజే ప్రారంభమవుతున్నదని గుర్తు చేశారు. ఉత్తరాఖండ్ ఏర్పడి 25 వసంతాలు పూర్తవుతుండడాన్ని గుర్తుచేస్తూ... రాబోయే 25 ఏళ్ల రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు కోసం కృషి చేయాలని ప్రజలను శ్రీ మోదీ కోరారు. వచ్చే 25 ఏళ్ల ఉత్తరాఖండ్ ప్రస్థాన సమయానికి భారత్ అమృత కాల్ కు కూడా 25 ఏళ్లు నిండబోతుండడం శుభసూచకమన్నారు. వికసిత భారత్ లో వికసిత ఉత్తరాఖండ్ సంకల్పం నెరవేరబోతుండడాన్ని అది సూచిస్తుందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. వచ్చే 25 ఏళ్లకు పలు తీర్మానాలతో అనేక కార్యక్రమాలను ప్రజలు చేపట్టారని ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాలు ఉత్తరాఖండ్‌ ఘనతను చాటుతాయని, అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఉత్తరాఖండ్‌ ఎదిగి ఆ ఫలితాలు రాష్ట్ర ప్రజలందరికీ అందుతాయని అన్నారు. ఈ సంకల్పాన్ని స్వీకరించిన రాష్ట్ర ప్రజలందరికీ ఈ సందర్భంగా శ్రీ మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల విజయవంతంగా నిర్వహించిన ‘ప్రవాసీ ఉత్తరాఖండ్ సమ్మేళన్’ను గుర్తుచేసిన ప్రధాని.. రాష్ట్ర అభివృద్ధిలో ప్రవాస ఉత్తరాఖండ్ వాసులు కీలక పాత్ర పోషిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

Ek Hain To Safe Hain: PM Modi in Nashik, Maharashtra

November 08th, 12:10 pm

A large audience gathered for public meeting addressed by Prime Minister Narendra Modi in Nashik, Maharashtra. Reflecting on his strong bond with the state, PM Modi said, “Whenever I’ve sought support from Maharashtra, the people have blessed me wholeheartedly.” He further emphasized, “If Maharashtra moves forward, India will prosper.” Over the past two and a half years, the Mahayuti government has demonstrated the rapid progress the state can achieve.

Article 370 will never return. Baba Saheb’s Constitution will prevail in Kashmir: PM Modi in Dhule, Maharashtra

November 08th, 12:05 pm

A large audience gathered for a public meeting addressed by PM Modi in Dhule, Maharashtra. Reflecting on his bond with Maharashtra, PM Modi said, “Whenever I’ve asked for support from Maharashtra, the people have blessed me wholeheartedly.”

PM Modi addresses public meetings in Dhule & Nashik, Maharashtra

November 08th, 12:00 pm

A large audience gathered for public meetings addressed by Prime Minister Narendra Modi in Dhule and Nashik, Maharashtra. Reflecting on his strong bond with the state, PM Modi said, “Whenever I’ve sought support from Maharashtra, the people have blessed me wholeheartedly.” He further emphasized, “If Maharashtra moves forward, India will prosper.” Over the past two and a half years, the Mahayuti government has demonstrated the rapid progress the state can achieve.

For the BJP, the aspirations and pride of tribal communities have always been paramount: PM Modi in Chaibasa

November 04th, 12:00 pm

PM Modi addressed a massive election rally in Chaibasa, Jharkhand. Addressing the gathering, the PM said, This election in Jharkhand is taking place at a time when the entire country is moving forward with a resolution to become developed by 2047. The coming 25 years are very important for both the nation and Jharkhand. Today, there is a resounding call across Jharkhand... ‘Roti, Beti, Maati Ki Pukar, Jharkhand Mein…Bhajpa, NDA Sarkar’.”

PM Modi campaigns in Jharkhand’s Garhwa and Chaibasa

November 04th, 11:30 am

Prime Minister Narendra Modi today addressed massive election rallies in Garhwa and Chaibasa, Jharkhand. Addressing the gathering, the PM said, This election in Jharkhand is taking place at a time when the entire country is moving forward with a resolution to become developed by 2047. The coming 25 years are very important for both the nation and Jharkhand. Today, there is a resounding call across Jharkhand... ‘Roti, Beti, Maati Ki Pukar, Jharkhand Mein…Bhajpa, NDA Sarkar’.”

మాజీ ప్ర‌ధాన‌మంత్రి శ్రీ అట‌ల్ బిహారీ వాజ్‌పేయి పుణ్యతిథి సంద‌ర్భంగా ఆయ‌న‌కు నివాళుల‌ర్పించిన ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ

August 16th, 10:10 am

మాజీ ప్ర‌ధాన‌మంత్రి శ్రీ అట‌ల్ బీహారీ వాజ్‌పేయి పుణ్యతిథి సంద‌ర్భంగా నేడు ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆయనకు నివాళుల‌ర్పించారు.

In Odisha, the state BJP is committed to promoting the Odia language and culture: PM Modi in Kandhamal

May 11th, 10:40 am

Kandhamal, Odisha, witnessed a grand celebration with the arrival of Prime Minister Narendra Modi. Affectionately addressing the audience ahead of Lok Sabha as well as assembly elections in the state, the PM expressed immense pride in the state of Odisha and its invaluable contribution to the nation.

PM Modi delivers stirring addresses to mammoth gatherings in Kandhamal, Balangir & Bargarh, Odisha

May 11th, 10:30 am

Kandhamal, Balangir & Bargarh, Odisha, witnessed grand celebrations with the arrival of Prime Minister Narendra Modi. Affectionately addressing the audience ahead of Lok Sabha as well as assembly elections in the state, the PM expressed immense pride in the state of Odisha and its invaluable contribution to the nation.

జార్ఖండ్‌లో కాంగ్రెస్ మరియు జేఎంఎం మధ్య అవినీతి మరియు దోపిడీ పోటీ ఉంది: సింగ్‌భూమ్‌లో ప్రధాని మోదీ

May 03rd, 05:30 pm

రాబోయే లోక్‌సభ ఎన్నికల 2024కి ముందు, ప్రధాని మోదీ జార్ఖండ్‌లోని సింగ్‌భూమ్‌లో ఒక గ్రాండ్ పబ్లిక్ ఈవెంట్‌లో పాల్గొని ప్రసంగించారు. ప్రజల ఉత్సాహానికి ప్రధానమంత్రి చాలా చలించిపోయారు మరియు ప్రతిగా, జార్ఖండ్‌లోని ప్రతి ఒక్కరికీ మోడీ కీ గ్యారెంటీని పునరుద్ఘాటించారు.

జార్ఖండ్‌లోని సింగ్‌భూమ్‌లో జరిగిన ఒక బహిరంగ కార్యక్రమంలో ఉత్తేజితులైన ప్రేక్షకులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు

May 03rd, 05:15 pm

రాబోయే లోక్‌సభ ఎన్నికల 2024కి ముందు, ప్రధాని మోదీ జార్ఖండ్‌లోని సింగ్‌భూమ్‌లో ఒక గ్రాండ్ పబ్లిక్ ఈవెంట్‌లో పాల్గొని ప్రసంగించారు. ప్రజల ఉత్సాహానికి ప్రధానమంత్రి చాలా చలించిపోయారు మరియు ప్రతిగా, జార్ఖండ్‌లోని ప్రతి ఒక్కరికీ మోడీ కీ గ్యారెంటీని పునరుద్ఘాటించారు.

కాంగ్రెస్-డీఎంకే దశాబ్దాలుగా ఎస్సీ-ఎస్టీ-ఓబీసీలను దూరం చేశాయి: మెట్టుపాళయంలో ప్రధాని మోదీ

April 10th, 03:00 pm

మెట్టుపాళయంలో జరిగిన ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ.. దశాబ్దాలుగా ఎస్సీ-ఎస్టీ-ఓబీసీలను కాంగ్రెస్-డీఎంకే నిర్వీర్యం చేశాయి. భారతదేశ ప్రజల సామర్థ్యాన్ని I.N.D.I ఎప్పుడూ విశ్వసించలేదని ఆయన అన్నారు. కోవిడ్ మహమ్మారి సమయంలో కూడా, భారతదేశంలోని MSMEలకు రూ. 2 లక్షల కోట్లు.

తమిళనాడులో రెండు బహిరంగ సభల్లో ప్రధాని మోదీ ప్రసంగిస్తున్నప్పుడు వెల్లూరు & మెట్టుపాళయంలో భారీ జనం మద్దతు

April 10th, 10:30 am

లోక్‌సభ ఎన్నికలకు ముందు, తమిళనాడులో రెండు బహిరంగ సభల్లో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీకి వెల్లూరు మరియు మెట్టుపాళయంలో భారీ జనం మద్దతు పలికారు. చరిత్ర, పురాణాలకు నేను నమస్కరిస్తున్నాను. మరియు వెల్లూరు యొక్క ధైర్యసాహసాలు. వెల్లూర్ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఒక కీలకమైన విప్లవాన్ని సృష్టించింది మరియు ప్రస్తుతం, N.D.Aకి దాని బలమైన మద్దతు 'ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్' స్ఫూర్తిని ప్రదర్శిస్తుంది.

My vision is Viksit Bharat and Viksit Jharkhand: PM Modi

March 01st, 12:45 pm

On his visit to Jharkhand, PM Modi addressed a dynamic rally in Dhanbad. Addressing the rally, PM Modi said, People have graced this rally in large numbers, giving the confidence that N.D.A. will emerge with 400+ seats in this upcoming Lok Sabha elections.”

PM Modi addresses a dynamic rally in Dhanbad, Jharkhand

March 01st, 12:43 pm

On his visit to Jharkhand, PM Modi addressed a dynamic rally in Dhanbad. Addressing the rally, PM Modi said, People have graced this rally in large numbers, giving the confidence that N.D.A. will emerge with 400+ seats in this upcoming Lok Sabha elections.”