
డిసెంబరు 17న రాజస్థాన్‌లో ప్రధానమంత్రి పర్యటన
December 16th, 03:19 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ డిసెంబరు 17న రాజస్థాన్‌లో పర్యటించనున్నారు. రాజస్థాన్ ప్రభుత్వం ఒక సంవత్సర కాలాన్ని పూర్తి చేసుకొన్న సందర్భంగా ఏర్పాటు చేసిన ఏక్ వర్ష్ - పరిణామ్ ఉత్కర్ష్’ కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో నిర్వహించే ఈ కార్యక్రమంలో ఇంధనం, రహదారులు, రైల్వేలు, నీటికి సంబంధించిన, రూ.46,300 కోట్లకు పైగా విలువైన 24 ప్రాజెక్టులకు ప్రధాని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.