న్యూస్ 9 అంతర్జాతీయ సదస్సులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని ప్రసంగం
November 22nd, 10:50 pm
మంత్రి విన్‌ఫ్రైడ్, నా మంత్రివర్గ సహచరుడు జ్యోతిరాదిత్య సిందియా, ఈ సదస్సుకు హాజరైన సోదరీ సోదరులారా!న్యూస్ 9 అంతర్జాతీయ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగం
November 22nd, 09:00 pm
జర్మనీలోని స్టట్‌గార్ట్ లో జరిగిన న్యూస్ 9 అంతర్జాతీయ సదస్సును ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. భారత్-జర్మనీ భాగస్వామ్యంలో ఈ సదస్సు కొత్త అధ్యాయానికి తెరతీస్తుందని ప్రధానమంత్రి అన్నారు. “నేటి సమాచార యుగంలో జర్మనీ, జర్మన్ ప్రజలతో అనుసంధితమయ్యేలా భారతదేశం నుంచి ఓ మీడియా సంస్థ ప్రయత్నిస్తుండడం సంతోషాన్నిస్తోంది. జర్మనీని, ఆ దేశ ప్రజలను అర్థం చేసుకోవడానికి భారతీయులకు ఇది ఒక వేదికను అందిస్తుంది” అని ప్రధానమంత్రి అన్నారు.సంయుక్త ప్రకటన: ఏడో భారత్-జర్మనీ ప్రభుత్వ స్థాయి సంప్రదింపులు (ఇంటర్ గవర్నమెంటల్ కన్సల్టేషన్స్ - ఐజిసి)
October 25th, 08:28 pm
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జర్మనీ ఫెడరల్ ఛాన్సలర్ ఓలాఫ్ షోల్జ్ 2024 అక్టోబర్ 25న న్యూఢిల్లీలో ఏడో విడత భారత్-జర్మనీ ఇంటర్ గవర్నమెంటల్ కన్సల్టేషన్స్ (ఐజీసీ) కు సహాధ్యక్షత వహించారు.భారత వైపు నుంచి రక్షణ, విదేశీ వ్యవహారాలు, వాణిజ్యం, పరిశ్రమలు, కార్మిక, ఉపాధి, శాస్త్ర, సాంకేతిక, నైపుణ్యాభివృద్ధి శాఖల మంత్రులు, జర్మనీ వైపు నుంచి ఆర్థిక వ్యవహారాలు, వాతావరణ కార్యాచరణ, విదేశీ వ్యవహారాలు, కార్మిక, సామాజిక వ్యవహారాలు, విద్య, పరిశోధన శాఖల మంత్రులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇంకా జర్మనీ వైపు నుంచి ఆర్థిక, పర్యావరణం, ప్రకృతి సంరక్షణ, అణు భద్రత, వినియోగదారుల రక్షణ, ఆర్థిక సహకారం,అభివృద్ధి శాఖల పార్లమెంటరీ స్టేట్ సెక్రటరీలు, అలాగే ఇరు దేశాల నుంచి ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు.జర్మనీ ఛాన్సలర్ భారత పర్యటన నేపథ్యంలో ఉభయ ప్రభుత్వాల మధ్య 7 వ దఫా సంప్రదింపులు: ఒప్పందాల జాబితా
October 25th, 07:47 pm
మ్యాక్స్-ప్లాంక్-గెసెల్‌షాఫ్ట్ ఈ.వీ. (ఎంపీజీ), ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ థియరిటికల్ సైన్సెస్ (ఐసీటీఎస్), టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టీఐఎఫ్ఆర్)ల మధ్య అవగాహన ఒప్పందంఫలితాల జాబితా: ఏడో ప్రభుత్వ స్థాయి సంప్రదింపుల నిమిత్తం జర్మనీ ఛాన్సలర్ భారత పర్యటన
October 25th, 04:50 pm
నేరసంబంధిత అంశాల్లో పరస్పర చట్ట సహాయ ఒప్పందం(ఎంఎల్ఏటీ)జర్మనీ చాన్సలర్‌తో సంయుక్త పత్రికా సమావేశంలో ప్రధానమంత్రి ప్రకటన
October 25th, 01:50 pm
మున్ముందుగా భారత పర్యటనకు వచ్చిన చాన్సలర్ షోల్జ్ గారికి, ఆయన ప్రతినిధి బృందానికీ సుస్వాగతం. గడచిన రెండేళ్ల వ్యవధిలో మిమ్మల్ని మూడోసారి మా దేశానికి ఆహ్వానించే అవకాశం లభించడం మాకెంతో సంతోషం కలిగిస్తోంది.18వ ఆసియా-పసిఫిక్ ప్రాంత జర్మనీ వాణిజ్య సదస్సు (ఏపీకే 2024)లో ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం
October 25th, 11:20 am
ఆసియా-పసిఫిక్ ప్రాంత జర్మనీ వాణిజ్య సదస్సు అధ్యక్షుడు డాక్టర్ బుష్,