న్యూ ఢిల్లీ లో జరిగిన రెండో ఆసియా పసిఫిక్ పౌర విమానయాన మంత్రుల సదస్సులో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

September 12th, 04:00 pm

వివిధ దేశాలకు చెందిన ప్రముఖులందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను. రెండు రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో మీరు ఈ రంగానికి సంబంధించిన అనేక ముఖ్యమైన అంశాలపై చర్చించారు. పౌర విమానయాన రంగంలో ఉన్న మేధావులు ప్రస్తుతం మన మధ్యలో ఉన్నారని నేను నమ్ముతున్నాను, ఇది మన సమష్టి నిబద్ధతను, ఆసియా పసిఫిక్ ప్రాంత సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ సంస్థ 80 సంవత్సరాలు పూర్తి చేసుకుంది, మా మంత్రి శ్రీ నాయుడు మార్గదర్శకత్వం, నాయకత్వంలో, 'ఏక్ పేడ్ మా కే నామ్' (తల్లి పేరు మీద ఒక చెట్టు) తో 80,000 చెట్లను నాటే ఒక ప్రధాన కార్యక్రమం చేపట్టబడింది. అయితే, నేను మరొక విషయాన్ని మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. మా దేశంలో ఒక వ్యక్తి 80 ఏళ్ళకు చేరుకున్నప్పుడు, దానిని ఒక ప్రత్యేకమైన పద్ధతిలో వేడుకగా జరుపుకుంటారు. మన పూర్వీకుల ప్రకారం, 80 ఏళ్ళకు చేరుకోవడం అంటే వెయ్యి పౌర్ణమి చంద్రులను చూసే అవకాశం కలిగి ఉండటం. ఒకరకంగా చెప్పాలంటే మన సంస్థ కూడా వెయ్యి పౌర్ణమిలను ప్రత్యక్షంగా వీక్షించి, దగ్గరగా చూసిన అనుభవం కలిగింది. ఈ 80 సంవత్సరాల ప్రయాణం ఒక చిరస్మరణీయ ప్రయాణం, విజయవంతమైన ప్రయాణం, అభినందనలకు అర్హమైనది.

ఆసియా పసిఫిక్ పౌర విమానయాన మంత్రుల రెండో సదస్సుకు హాజరు కానున్న ప్రధాన మంత్రి

September 11th, 07:41 pm

సెప్టెంబర్ 12న న్యూఢిల్లీలోని భారత్ మండపంలో సాయంత్రం 4 గంటలకు పౌర విమానయాన రంగంపై నిర్వహించనున్న 2వ ఆసియా-పసిఫిక్ మంత్రుల సమావేశానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా జరిగే సమావేశంలో ఆయన ప్రసంగించనున్నారు.