మాదకద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా ప్రచారంలో యువత పాల్గొనడం చాలా ప్రోత్సాహకరంగా ఉంది: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
July 30th, 11:30 am
నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. 'మన్ కీ బాత్' కార్యక్రమానికి మీ అందరికీ సాదర స్వాగతం. జులై నెల అంటే వర్షాకాలం, వర్షాల నెల. ప్రకృతి వైపరీత్యాల కారణంగా గత కొన్ని రోజులుగా బాధాకరమైన, ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. యమునాతో పాటు వివిధ నదుల్లో వరదలు పోటెత్తడంతో పలు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొండ ప్రాంతాలలో కొండచరియలు కూడా విరిగిపడ్డ సంఘటనలు జరిగాయి. మరోవైపు కొంతకాలం క్రితం దేశంలోని పశ్చిమ ప్రాంతంలో-గుజరాత్ లోని వివిధ ప్రదేశాలలో బిపార్జాయ్ తుఫాను వచ్చింది. మిత్రులారా!ఈ విపత్తుల మధ్య, మనమందరం దేశవాసులం మరోసారి సామూహిక కృషి శక్తిని చూపించాం. స్థానిక ప్రజలు, ఎన్. డి. ఆర్. ఎఫ్. జవాన్లతో పాటు స్థానిక అధికార యంత్రాంగం విపత్తులను ఎదుర్కోవడానికి రాత్రింబగళ్లు శ్రమించింది. ఏ విపత్తునైనా ఎదుర్కోవడంలో మన సామర్థ్యం, వనరుల పాత్ర ప్రధానమైంది. కానీ దాంతోపాటే మన స్పందన, పరస్పరం సహకరించుకునే స్ఫూర్తి కూడా అంతే ముఖ్యం. ప్రజలందరూ బాగుండాలన్న సర్వజన హితాయ భావన భారతదేశానికి గుర్తింపు, భారతదేశ బలం.US returns artifacts to India during PM Modi's visit
June 07th, 03:30 am