ఒక పెంపుడు శునకాన్ని పెంచుకోవాలని ఇప్పటి నుండీ మీరు ఆలోచిస్తూ ఉంటే గనక ఒక భారతీయ జాతి కి చెందిన శునకాన్ని ఇంటికి తెచ్చుకోండి అంటూ ‘మన్ కీ బాత్’ లో సూచన చేసిన ప్రధాన మంత్రి

August 30th, 04:34 pm

ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ‘మ‌న్ కీ బాత్’ (మనసు లో మాట) ధారావాహిక కార్యక్రమం లో భాగం గా ఈ రోజు న చేసిన తాజా ప్ర‌సంగం లో, సైనిక దళం ప్రధానాధికారి ‘ కమెండేశన్ కార్డ్స్ ’ బహుమానాన్ని సంపాదించిన భారత సైన్యాని కి చెందిన శునకాలు సోఫీ ని గురించి, ఇంకా విదా ను గురించి మాట్లాడారు.

ఆటలు ప్రారంభిద్దాం: మన్ కి బాత్ సందర్భంగా బొమ్మల రంగానికి ప్రధాని మోదీ స్వావలంబన ప్రోత్సాహం

August 30th, 11:00 am

మిత్రులారా, ఈ రోజుల్లో ఓణమ్ పండుగను కూడా ఎంతో ఉత్సాహంగా జరుపుకొంటున్నారు. ఈ పండుగ చిన్ గమ్ నెల లో వస్తుంది. ఈ సమయంలో ప్రజలు కొత్త వస్తువులను కొంటారు. తమ ఇళ్లను అలంకరిస్తారు. పూక్కలం అనే ముగ్గులతో తమ ఇంటి ప్రాంగణాలను తీర్చిదిద్దుతారు. ఓణమ్ రోజుల్లో సద్య అనే ఆహారపదార్థాలను ఆస్వాదిస్తారు. వివిధ రకాల ఆటల పోటీలు కూడా జరుగుతాయి. ఓణమ్ దేశ విదేశాల్లో ప్రాచుర్యం పొందింది. అమెరికా, యూరోప్, గల్ఫ్ మొదలైన ప్రాంతాలలోని అనేక దేశాలలో కూడా ఓణమ్ ఆనందం కనిపిస్తోంది. ఓణమ్ ఒక అంతర్జాతీయ ఉత్సవంలా మారుతోంది.