జి7 సమిట్ సందర్భం లో జపాన్ యొక్క ప్రధాని తోసమావేశమైన ప్రధాన మంత్రి
June 14th, 11:53 pm
ఇటలీ లోని అపులియా లో జి-7 శిఖర సమ్మేళనం జరుగుతున్న సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జపాన్ యొక్క ప్రధాని శ్రీ ఫుమియో కిశిదా తో ఈ రోజు న ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించారు.జి-7 సదస్సు నేపథ్యంలో ఇటలీ ప్రధానితో ప్రధానమంత్రి సమావేశం
June 14th, 11:40 pm
రెండు దేశాల మధ్య ఉన్నతస్థాయి రాజకీయ సంప్రదింపులు క్రమబద్ధంగా సాగుతుండటంపై దేశాధినేతలిద్దరూ సంతృప్తి వ్యక్తం చేశారు. అదే సమయంలో భారత్-ఇటలీ వ్యూహాత్మక భాగస్వామ్యం ప్రగతిని సమీక్షించారు. ద్వైపాక్షిక వాణిజ్యం, ఆర్థిక సహకారం పురోగమిస్తుండటంపై సంతోషం వ్యక్తం చేశారు. పరిశుభ్ర ఇంధనం, తయారీ, అంతరిక్షం, శాస్త్ర-సాంకేతిక, టెలికాం, కృత్రిమ మేధ, కీలక ఖనిజాలు తదితర రంగాల్లో సుస్థిర సరఫరా శ్రేణి నిర్మాణం దిశగా వాణిజ్య సంబంధాలను మరింత విస్తరించాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పేటెంట్లు, డిజైన్లు, ట్రేడ్‌మార్క్ వంటి అంశాల్లో సహకార చట్రం రూపకల్పన సంబంధిత పారిశ్రామిక సంపద హక్కుల (ఐపిఆర్) ఒప్పందంపై ఇటీవల సంతకాలు పూర్తికావడంపై వారిద్దరూ హర్షం ప్రకటించారు.జి-7 విస్తృత సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగం తెలుగు పాఠం
June 14th, 09:54 pm
మున్ముందుగా నన్ను ఈ శిఖరాగ్ర సదస్సుకు ఆహ్వానించడంతోపాటు అత్యంత గౌరవ మర్యాదలతో ఆత్మీయ ఆతిథ్యం ఇచ్చినందుకు ప్రధానమంత్రి మెలోనీ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే చాన్సలర్ ఓలాఫ్ షోల్ట్స్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ జి-7 శిఖరాగ్ర సదస్సు ప్రత్యేకమైనదేగాక, దీనికెంతో చారిత్రక ప్రాధాన్యం కూడా ఉంది. ఆ మేరకు కూటమి 50వ వార్షికోత్సవం సందర్భంగా గౌరవనీయ మిత్రులైన జి-7 దేశాధినేతలందరికీ నా మనఃపూర్వక శుభాభినందనలు తెలుపుతున్నాను.జి-7 సదస్సులో కృత్రిమ మేధ ఇంధనం ఆఫ్రికా మధ్యధరా ప్రాంతం అంశాలపై విస్తృత సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగం
June 14th, 09:41 pm
ఇటలీలోని అపులియాలో జి-7 సదస్సులో భాగంగా ఇవాళ కృత్రిమ మేధ, ఇంధనం, ఆఫ్రికా, మధ్యధరా ప్రాంతం తదితర అంశాలపై నిర్వహించిన విస్తృత సమావేశంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా తొలుత జి-7 కూటమి 50వ వార్షికోత్సవ మైలురాయిని అందుకోవడంపై ఆయన అభినందనలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ- మానవాళి చరిత్రలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య ప్రక్రియలో తాను మూడోసారి ఎన్నికైన తర్వాత ఈ శిఖరాగ్ర సదస్సుకు హాజరుకావడం తనకెంతో సంతృప్తినిచ్చిందని ప్రధాని హర్షం వెలిబుచ్చారు. మానవ కేంద్రక విధాన ప్రాతిపదికగా ఉన్నపుడే సాంకేతిక పరిజ్ఞానం విజయవంతం కాగలదని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ప్రజలకు సేవా ప్రదానం కోసం డిజిటల్ సాంకేతికత వినియోగంలో భారత్ సాధించిన విజయాలను సభికులతో ప్రధాని పంచుకున్నారు.జి7 సమిట్ సందర్భం లో యుకె ప్రధాని తో సమావేశమైన ప్రధాన మంత్రి
June 14th, 04:00 pm
ఇటలీ లోని అపులియా లో జి-7 శిఖర సమ్మేళనం జరుగుతున్న సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ యునైటెడ్ కింగ్ డమ్ యొక్క ప్రధాని శ్రీ రుషి సునక్ తో ఈ రోజు న ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించారు. ప్రధాన మంత్రి చరిత్రాత్మకమైన రీతి లో వరుసగా మూడో సారి పదవీ బాధ్యతల ను చేపట్టినందుకు హృదయ పూర్వక శుభాకాంక్షల ను యునైటెడ్ కింగ్ డమ్ యొక్క ప్రధాని శ్రీ రుషి సునక్ తెలియజేశారు. ద్వైపాక్షిక సంబంధాల ను మరింత పటిష్టపరచుకోవడం కోసం ఉభయ నేతలు ఉమ్మడి వచనబద్ధత ను పునరుద్ఘాటించారు.