ఉత్తర ప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడాలో జరిగిన సెమీకాన్ ఇండియా 2024 కార్యక్రమంలో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
September 11th, 12:00 pm
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు, కేంద్ర మంత్రివర్గంలోని నా సహచరులు, అశ్విని వైష్ణవ్, జితిన్ ప్రసాద, ప్రపంచ సెమీకండక్టర్ పరిశ్రమతో సంబంధం ఉన్న దిగ్గజాలు, విద్య, పరిశోధన, ఆవిష్కరణ రంగాలకి చెందిన భాగస్వాములు, ఇతర విశిష్ట అతిథులు, సోదర సోదరీమణులారా ! అందరికీ నమస్కారం!ఉత్తరప్రదేశ్ గ్రేటర్ నోయిడాలో జరుగుతోన్న సెమీకాన్ ఇండియా 2024ను ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
September 11th, 11:30 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ఉన్న ఇండియా ఎక్స్ పో మార్ట్‌లో సెమీకాన్ ఇండియా 2024ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన ప్రదర్శనను ఆయన వీక్షించారు. సెప్టెంబర్ 11 నుంచి 13 వరకు మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో సెమీకండక్టర్ రంగంలో భారత్‌ను ప్రపంచస్థాయి హబ్‌గా మార్చే వ్యూహం, విధానంపై చర్చించనున్నారు.ప్రధాన మంత్రి అధ్యక్షతన అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ పాలకమండలి తొలి సమావేశం
September 10th, 04:43 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు 7, లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని తన నివాసంలో అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ పాలక మండలి మొదటి సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో దేశంలోని శాస్త్ర, సాంకేతిక స్వరూప స్వభావాలు, పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాల రీడిజైనింగ్ గురించి చర్చ జరిగింది.