భారతదేశం – శ్రీలంక సంయుక్త ప్రకటన: ఒక ఉమ్మడి భవిత కోసం భాగస్వామ్యాలను ప్రోత్సహించడం

December 16th, 03:26 pm

శ్రీలంక అధ్యక్షుడు శ్రీ అనూర కుమార దిసనాయక 2024 డిసెంబరు 16న భారతదేశానికి ఆధికారిక పర్యటనకు వచ్చిన సందర్భంగా న్యూఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. వారిద్దరూ సమగ్ర, ఫలప్రద చర్చలు జరిపారు.

శ్రీలంక అధ్యక్షుడితో కలిసి సంయుక్త పత్రికా సమావేశంలో భారత ప్రధాని పత్రికా ప్రకటన

December 16th, 01:00 pm

అధ్యక్షుడు దిసనాయకను హృదయపూర్వకంగా భారత్ కు స్వాగతిస్తున్నాను. అధ్యక్షుడిగా తొలి విదేశీ పర్యటన కోసం మీరు భారత్ ను ఎంచుకోవడం సంతోషాన్నిస్తోంది. అధ్యక్షుడు దిసనాయక పర్యటన మన సంబంధాల్లో పునరుత్తేజాన్ని, శక్తిని నింపింది. మా భాగస్వామ్యం విషయంలో మేం భవిష్యత్ దార్శనికతను అవలంబించాం. మా ఆర్థిక భాగస్వామ్యంలో పెట్టుబడుల ఆధారిత వృద్ధి, అనుసంధానతకు ప్రాధాన్యం ఇచ్చాం. అంతేకాకుండా ఫిజికల్, డిజిటల్, ఎనర్జీ అనుసంధానత మా భాగస్వామ్యంలో ముఖ్యమైన మూలాధారాలుగా ఉండాలని నిర్ణయించాం. ఇరు దేశాల మధ్య విద్యుత్-గ్రిడ్ అనుసంధానత, బహుళ-ఉత్పత్తి పెట్రోలియం పైప్‌లైన్ల ఏర్పాటు దిశగా కృషి చేస్తాం. శాంపూర్ సౌర విద్యుత్ ప్రాజెక్టును వేగవంతం చేస్తాం. దానితోపాటు శ్రీలంక విద్యుత్ ప్లాంట్లకు ఎల్ఎన్ జీని సరఫరా చేస్తాం. ఈటీసీఏను త్వరలోనే పూర్తిచేసి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ప్రోత్సహించడం కోసం ఇరువైపులా కృషి జరుగుతుంది.

శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో శ్రీ అనూర కుమార దిశనాయకే గెలిచినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు

September 23rd, 12:11 am

శ్రీలంకలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో శ్రీ అనూర కుమార దిశనాయకే గెలిచినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు ఈ రోజున అభినందనలను తెలియజేశారు. అనేక రంగాల్లో ఇప్పుడు కొనసాగుతున్న ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలపరచడానికి శ్రీ లంకతో కలసి మరింత ఎక్కువ కృషి చేయాలని ఉందని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.