యూనియన్ బడ్జెటు 2023 ను గురించి ప్రధాన మంత్రి పలికిన మాటలు

February 01st, 02:01 pm

అమృత కాలం లోని ఈ ఒకటో బడ్జెటు అభివృద్ధి చెందిన భారతదేశం యొక్క విరాట సంకల్పాన్ని నెరవేర్చడం కోసం ఒక బలమైన పునాది ని నిర్మించ గలుగుతుంది. ఇది వంచితుల కు పెద్దపీట ను వేసినటువంటి బడ్జెటు. ఈ బడ్జెటు ఆకాంక్ష లు నిండినటువంటి నేటి కాలం సమాజం యొక్క- గ్రామాల, పేదల , రైతు ల మరియు మధ్య తరగతి జనత యొక్క- చెప్పాలంటే అందరి యొక్క కలల ను నెరవేర్చగలదు.

ఈ బడ్జెటు పేదల కు ప్రాధాన్యాన్నిఇస్తున్నది: ప్రధాన మంత్రి

February 01st, 02:00 pm

భారతదేశం యొక్క ‘అమృత కాలం’ లో తొలి బడ్జెటు అయినటువంటి ఈ బడ్జెటు అభివృద్ధి చెందిన భారతదేశం ఆకాంక్షల ను మరియు సంకల్పాల ను నెరవేర్చేందుకు ఒక గట్టి పునాది ని వేసింది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఈ బడ్జెటు వంచితుల కు ప్రాథమ్యాన్ని కట్టబెట్టిందని, మరి ఇది ఆకాంక్షభరిత సమాజం, పేద ప్రజలు, పల్లె వాసులు, ఇంకా మధ్య తరగతి ప్రజానీకం ల యొక్క కలల ను నెరవేర్చడం కోసం పాటుపడుతుంది అని కూడా ఆయన అన్నారు.

ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన (పీఎంజీకేవై )ని కేంద్రం మరో మూడు నెలలు పొడిగించింది (అక్టోబర్ 2022-–డిసెంబర్ 2022)

September 28th, 04:06 pm

2021లో ప్రధానమంత్రి చేసిన ప్రజానుకూల ప్రకటన ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ కింద అదనపు ఆహార భద్రతను విజయవంతంగా అమలు చేయడం కోసం, ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ( ఫేజ్ 7) కోసం పొడిగింపును కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. 3 నెలల వ్యవధి అంటే అక్టోబర్ నుండి డిసెంబర్ 2022 వరకు ధాన్యం ఇస్తారు. వివిధ కారణాల వల్ల కోవిడ్ క్షీణత అభద్రతపై ప్రపంచం పోరాడుతున్న తరుణంలో, భారతదేశం తన బలహీన వర్గాలకు ఆహార భద్రతను విజయవంతంగా నిర్వహిస్తోంది. అదే సమయంలో సామాన్యులకు లభ్యత స్థోమత ఉంచడానికి అవసరమైన చర్యలు తీసుకుంటోంది.