297 పురాతన వస్తువులను భారత్‌కు తిరిగిచ్చిన అమెరికా
September 22nd, 12:11 pm
భారత్, అమెరికా మధ్య సన్నిహిత ద్వైపాక్షిక సంబంధాలకు అనుగుణంగా ఉన్నతమైన సాంస్కృతిక అవగాహనను పెంపొందించుకోవడానికి జూలైలో సాంస్కృతిక సంపద ఒప్పందం కుదిరింది. యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన విద్య, సాంస్కృతిక వ్యవహారాల బ్యూరో, భారత ప్రభుత్వంలోని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో గల భారతీయ పురావస్తు సర్వేక్షణ విభాగం ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించేందుకు సహకారాన్ని పెంపొందించుకోవాలని 2023 జూన్‌లో జరిగిన సమావేశం అనంతరం అమెరికా అధ్యక్షుడు బైడెన్, భారత ప్రధానమంత్రి మోదీ చేసిన ఉమ్మడి ప్రకటనలోని లక్ష్యాలను నెరవేర్చడంలో భాగంగా ఈ ఒప్పందం జరిగింది.అమెరికా నుంచి 157 కళాఖండాలు, పురాతత్వ వస్తువులను స్వదేశానికి తీసుకురానున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
September 25th, 09:16 pm
157 కళాఖండాలు, పురాతత్వ వస్తువులను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా మన దేశానికి అప్పగించింది. అమెరికా ఈ కళాఖండాలు, పురాతత్వ వస్తువులను భారత్‌కు అప్పగించడం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అమెరికాను ప్రశంసించారు. సాంస్కృతిక వస్తువుల అక్రమ రవాణా, అక్రమ వాణిజ్యం, దొంగతనం వంటి వాటిని ఎదుర్కొనేందుకు తమ కృషిని బలోపేతం చేసేందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, అధ్యక్షుడు జో బైడెన్ కట్టుబడి ఉన్నారు.