Hackathon solutions are proving to be very useful for the people of the country: PM Modi

December 11th, 05:00 pm

PM Modi interacted with young innovators at the Grand Finale of Smart India Hackathon 2024 today, via video conferencing. He said that many solutions from the last seven hackathons were proving to be very useful for the people of the country.

స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2024లో పాల్గొన్నవారితో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాటామంతీ

December 11th, 04:30 pm

స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2024 గ్రాండ్ ఫినాలేలో పాల్గొంటున్న యువ నూతన ఆవిష్కర్తలతో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు దృశ్య మాధ్యమం ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా సభికులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తూ, ఎర్రకోట నుంచి తాను చేసిన ప్రసంగంలో ‘సబ్‌కా ప్రయాస్’ (అందరి ప్రయత్నం) అవసరమని పునరుద్ఘాటించిన సంగతిని గుర్తు చేశారు. నేటి కాలపు భారతదేశం ‘అందరి ప్రయత్నం’తో చాలా వేగంగా పురోగమించగలుగుతుందని, ఈ రోజున నిర్వహించుకొంటున్న ఈ కార్యక్రమమే దీనికొక ఉదాహరణ అని ఆయన అన్నారు. ‘‘స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ గ్రాండ్ ఫినాలే కోసం నేను చాలా ఆసక్తితో ఎదురు చూస్తున్నాను’’ అని ప్రధాని అన్నారు. యువ నూతన ఆవిష్కర్తలతో భేటీ అయినప్పుడు ఏదైనా కొత్త విషయం నేర్చుకొనే అవకాశంతోపాటు అర్థం చేసుకొనే అవకాశం కూడా తనకు లభిస్తుందని ఆయన అన్నారు. నూతన ఆవిష్కర్తల నుంచి తాను ఎంతో ఆశిస్తున్నానని ప్రధాని చెబుతూ, 21వ శతాబ్ది భారతదేశమంటే వారికి ఒక భిన్న దృష్టికోణం ఉందన్నారు. ఈ కారణంగా మీరు అందించే పరిష్కారాలు కూడా విభిన్నంగా ఉంటున్నాయి; ఏదైనా కొత్త సవాలు వచ్చిందంటే మీరు నూతన, విశిష్ట పరిష్కారాలతో ముందుకు వస్తారని శ్రీ మోదీ అన్నారు. గతంలో జరిగిన హ్యాకథాన్‌లలో తాను భాగం పంచుకొన్న విషయాన్ని ప్రధాని గుర్తుకుతెస్తూ, వాటిలో అందే ఫలితాల విషయంలో తాను ఎన్నడూ నిరుత్సాహానికి గురికాలేదన్నారు. ‘‘మీరు నా నమ్మకాన్ని బలపరచారంతే’’ అని ఆయన అన్నారు. గతంలో అందించిన పరిష్కారాలు వివిధ మంత్రిత్వ శాఖల్లో అమలవుతున్నాయని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో పాలుపంచుకొంటున్న వారిని గురించి మరింత తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందని శ్రీ మోదీ అంటూ, వారితో మాట్లాడడం మొదలుపెట్టారు.

నేడు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు భారతదేశం గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్నారు: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ

October 27th, 11:30 am

నా ప్రియమైన దేశప్రజలారా! నమస్కారం. ‘మన్ కీ బాత్’ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. నా జీవితంలో మరపురాని క్షణాలేవని మీరు నన్ను అడిగితే చాలా సంఘటనలు గుర్తుకు వస్తాయి. కానీ చాలా ప్రత్యేకమైన మరపురాని ఒక క్షణం ఉంది- అది గత సంవత్సరం నవంబర్ 15 వ తేదీన జరిగింది. ఆరోజు నేను భగవాన్ బిర్సా ముండా జయంతి సందర్భంగా జార్ఖండ్‌లోని ఆయన జన్మస్థలమైన ఉలిహాతు గ్రామానికి వెళ్ళాను. ఈ యాత్ర నాపై చాలా ప్రభావం చూపింది. ఈ పుణ్యభూమి మట్టిని తలతో తాకే భాగ్యం పొందిన దేశ తొలి ప్రధానమంత్రిని నేనే. ఆ క్షణంలో స్వాతంత్య్ర పోరాటంలో ఉన్న శక్తి తెలిసిరావడమే కాకుండా ఈ భూ శక్తితో అనుసంధానమయ్యే అవకాశం కూడా వచ్చింది. ఒక సంకల్పాన్ని నెరవేర్చేందుకు చేసే సాహసం దేశంలోని కోట్లాది ప్రజల భవిష్యత్తును ఎలా మార్చగలదో నేను గ్రహించాను.