
PM-KISAN is proving to be very useful for small farmers across the country: PM Modi in Bhagalpur, Bihar
February 24th, 02:35 pm
PM Modi released the 19th instalment of PM KISAN from Bhagalpur, Bihar. Launching many development projects during the occasion, PM Modi said, “There are four main pillars of Viksit Bharat: poor, farmers, youth and women”. PM shared his happiness on witnessing the establishment of the 10,000th FPO and congratulated all the members of the 10,000 FPOs. He highlighted the Government's efforts to develop the farming sector.
PM Modi, releases 19th instalment of PM KISAN, launches development projects from Bhagalpur, Bihar
February 24th, 02:30 pm
PM Modi released the 19th instalment of PM KISAN from Bhagalpur, Bihar. Launching many development projects during the occasion, PM Modi said, “There are four main pillars of Viksit Bharat: poor, farmers, youth and women”. PM shared his happiness on witnessing the establishment of the 10,000th FPO and congratulated all the members of the 10,000 FPOs. He highlighted the Government's efforts to develop the farming sector.
'Mission Mausam' aims to make India a climate-smart nation: PM Modi
January 14th, 10:45 am
PM Modi addressed the 150th Foundation Day of IMD, highlighting India's rich meteorological heritage and IMD's advancements in disaster management, weather forecasting, and climate resilience. He launched ‘Mission Mausam’ to make India a weather-ready, climate-smart nation and released the IMD Vision-2047 document.భారత వాతావరణ విభాగం (ఐఎండి)150వ వ్యవస్థాపక దినోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం
January 14th, 10:30 am
భారత వాతావరణ విభాగం (ఐఎండి) 150వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నేడు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ‘ఐఎండి’ సాగించిన ఈ 150 ఏళ్ల ప్రయాణం దేశంలో ఆధునిక శాస్త్ర-సాంకేతిక పరిజ్ఞానాల సగర్వ పురోగమనానికి కూడా ప్రతిబింబమని ఆయన అభివర్ణించారు. ఒకటిన్నర శతాబ్దాలుగా కోట్లాది భారతీయులకు సేవలందిస్తున్న ‘ఐఎండి’ ప్రస్థానం భారత శాస్త్రవిజ్ఞాన ప్రగతికి ప్రతీక అని వ్యాఖ్యానించారు. ఇన్నేళ్లుగా ఈ విభాగం సాధించిన విజయాలకు గుర్తుగా స్మారక తపాలాబిళ్లతోపాటు నాణాన్ని కూడా ఇవాళ ఆవిష్కరించామని శ్రీ మోదీ అన్నారు. భారత్ స్వాతంత్య్ర శతాబ్ది వేడుకలు నిర్వహించుకునే 2047నాటికి ఈ సంస్థ భవిష్యత్తును విశదీకరించే ‘ఐఎండి దార్శనిక పత్రం-2047’ను కూడా ఈ సందర్భంగా ఆవిష్కరించామని ఆయన పేర్కొన్నారు. ఒకటిన్నర శతాబ్దాల ‘ఐఎండి’ మహత్తర ప్రస్థానం సందర్భంగా దేశ పౌరులకు శుభాకాంక్షలు తెలిపారు.భారత గ్రామీణ మహోత్సవ్ లో ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం
January 04th, 11:15 am
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు, కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరీ గారు, ఈ కార్యక్రమానికి హాజరైన గౌరవనీయులైన నాబార్డ్ ఉన్నత కార్యవర్గ సభ్యులు, స్వయం సహాయక బృందాల సభ్యులు, సహకార బ్యాంకులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (ఎఫ్‌పీవోలు), ఇతర విశిష్ట అతిథులు, సోదర సోదరీమణులారా,PM Modi inaugurates the Grameen Bharat Mahotsav 2025
January 04th, 10:59 am
PM Modi inaugurated Grameen Bharat Mahotsav in Delhi. He highlighted the launch of campaigns like the Swamitva Yojana, through which people in villages are receiving property papers. He remarked that over the past 10 years, several policies have been implemented to promote MSMEs and also mentioned the significant contribution of cooperatives in transforming the rural landscape.భారతదేశం – శ్రీలంక సంయుక్త ప్రకటన: ఒక ఉమ్మడి భవిత కోసం భాగస్వామ్యాలను ప్రోత్సహించడం
December 16th, 03:26 pm
శ్రీలంక అధ్యక్షుడు శ్రీ అనూర కుమార దిసనాయక 2024 డిసెంబరు 16న భారతదేశానికి ఆధికారిక పర్యటనకు వచ్చిన సందర్భంగా న్యూఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. వారిద్దరూ సమగ్ర, ఫలప్రద చర్చలు జరిపారు.హర్యానాలోని పానిపట్‌లో అభివృద్ధిపనుల ప్రారంభ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగానికి అనువాదం
December 09th, 05:54 pm
హర్యానా గవర్నరు బండారు దత్తాత్రేయ గారు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న, ప్రజాదరణ పొందిన హుషారైన నేత శ్రీ నాయబ్ సింగ్ గారు, కేంద్ర మంత్రిమండలిలో నా తోటి సభ్యులైన గౌరవనీయురాలు నిర్మలా సీతారామన్ గారు, ఈ భూమి పుత్రుడు, పార్లమెంటు సభ్యుడు, మాజీ ముఖ్యమంత్రి, అంతేకాకుండా ప్రభుత్వంలో నా సహచరుడైన శ్రీ మనోహర్ లాల్ గారు, శ్రీ కృష్ణ పాల్ గారు, హర్యానా ప్రభుత్వంలో మంత్రులు శృతి గారు, ఆర్తి గారు, ఎంపీలు, ఎమ్ఎల్ఏలు, దేశవ్యాప్తంగా ఉన్న ఎల్ఐసీ కేంద్రాలతో అనుబంధం ఉన్న సహచరులందరూ.. నా ప్రియ సోదరులు, సోదరీమణులారా.ఎల్ఐసీ బీమా సఖి యోజన ప్రారంభించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
December 09th, 04:30 pm
మహిళా సాధికారతను, ఆర్థిక రంగంలో వారి భాగస్వామ్యాన్ని పెంపొందించే దిశగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ తీసుకొచ్చిన ‘బీమా సఖి యోజన’ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు లాంఛనంగా ప్రారంభించారు. హర్యానాలోని పానిపట్‌లో ఈ కార్యక్రమం జరిగింది. అలాగే కర్నాల్ లోని మహారాణా ప్రతాప్ హార్టీకల్చర్ విశ్వవిద్యాలయ ప్రధాన క్యాంపస్ నిర్మాణానికి ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా శ్రీ మోదీ ప్రసంగిస్తూ.. మహిళా సాధికారత దిశగా ఈ రోజు మరో ముందడుగు వేశామని అన్నారు. మన గ్రంథాల్లో 9ని పవిత్రమైన అంకెగా భావిస్తారు. నవరాత్రి సమయంలో నవ దుర్గలుగా తొమ్మిది రూపాల్లో అమ్మవారిని ఆరాధిస్తారు. ఈ రోజు 9వ తేదీనే కావడం విశేషం. ఈ రోజు నారీశక్తిని ఆరాధిస్తున్న రోజు కూడా అని ఆయన వివరించారు.The BJP has entered the electoral field in Jharkhand with the promise of Suvidha, Suraksha, Sthirta, Samriddhi: PM Modi in Garhwa
November 04th, 12:21 pm
Prime Minister Narendra Modi today addressed a massive election rally in Garhwa, Jharkhand. Addressing the gathering, the PM said, This election in Jharkhand is taking place at a time when the entire country is moving forward with a resolution to become developed by 2047. The coming 25 years are very important for both the nation and Jharkhand. Today, there is a resounding call across Jharkhand... ‘Roti, Beti, Maati Ki Pukar, Jharkhand Mein…Bhajpa, NDA Sarkar’.”PM Modi campaigns in Jharkhand’s Garhwa and Chaibasa
November 04th, 11:30 am
Prime Minister Narendra Modi today addressed massive election rallies in Garhwa and Chaibasa, Jharkhand. Addressing the gathering, the PM said, This election in Jharkhand is taking place at a time when the entire country is moving forward with a resolution to become developed by 2047. The coming 25 years are very important for both the nation and Jharkhand. Today, there is a resounding call across Jharkhand... ‘Roti, Beti, Maati Ki Pukar, Jharkhand Mein…Bhajpa, NDA Sarkar’.”గుజరాత్ అమ్రేలీలో అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
October 28th, 04:00 pm
వేదికపైనున్న గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవ్ వ్రత్ గారూ, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయ్ పటేల్, నా మంత్రివర్గ సహచరుడు శ్రీ సీ ఆర్ పాటిల్ గారూ, గుజరాత్ అక్కాచెల్లెళ్ళూ, అన్నదమ్ములూ, ముఖ్యంగా అమ్రేలీ సోదర సోదరీమణులారా..గుజరాత్‌లోని అమ్రేలీలో ₹4,900 కోట్ల విలువైన అభివృద్ధి పనులు ప్రారంభం... ప్రధానమంత్రి శ్రీ మోదీ శంకుస్థాపన
October 28th, 03:30 pm
ఈ సందర్భంగా ప్రసంగిస్తూ- దేశమంతటా ఉప్పొంగుతున్న దీపావళి, ధంతేరాస్ పండుగల స్ఫూర్తిని ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ పండుగలు మన సంస్కృతిని ఘనంగా చాటుతాయని, అలాగే ప్రగతి పురోగమన వేగానికీ అంతే ప్రాముఖ్యం ఉంటుందని గుర్తుచేశారు. వడోదరలో నేటి తన పర్యటనను ప్రస్తావిస్తూ- గుజరాత్ అంతటా చేపడుతున్న అనేక కీలక ప్రాజెక్టుల గురించి తాజా సమాచారాన్ని ప్రజలతో పంచుకున్నారు. వీటిలో భాగంగా భారత వైమానిక దళం కోసం దేశీయ విమానాల తయారీకి ఈ నగరంలో ఏర్పాటు చేసిన తొలి కర్మాగారాన్ని ఆయన ప్రారంభించారు. దీనికిముందు అమ్రేలీలో ‘భారతమాత’ సరోవరం ప్రారంభించడాన్ని గుర్తుచేస్తూ- జల సంరక్షణ కార్యక్రమాలు సహా రైల్వేలు, రహదారుల సంబంధిత అనేక భారీ ప్రాజెక్టులను ప్రారంభించామని, మరికొన్నిటికి శంకుస్థాపన చేశామని వివరించారు. ఈ ప్రాజెక్టుల ద్వారా సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాల్లోని ప్రజల జీవన సౌలభ్యం మెరుగవుతుందని చెప్పారు. అంతేగాక స్థానిక రైతుల సౌభాగ్యానికి, ఈ ప్రాంతంలో ప్రగతి వేగం పుంజుకోవడానికి ఇవి దోహదం చేస్తాయన్నారు. మరోవైపు యువతకు సరికొత్త ఉపాధి అవకాశాలు అందివస్తాయన్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నిటిపై ప్రజానీకానికి అభినందనలు తెలిపారు.మహారాష్ట్రలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన... ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
October 09th, 01:09 pm
మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సి.పి.రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి శ్రీ ఏక్నాథ్ షిండే, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు సహా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్, శ్రీ అజిత్ పవార్, ఇతర ప్రముఖులు, నా ప్రియ సోదర సోదరీమణులారా...మహారాష్ట్రలో రూ.7600 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ శంకుస్థాపన
October 09th, 01:00 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈవేళ మహారాష్ట్రలో రూ.7600 కోట్ల విలువైన అనేక అభివృద్ధి ప్రాజెక్టులను వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా ప్రారంభించారు. ఈ మేరకు నాగ్‌పూర్‌లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం ఆధునికీరణ పనులకు, షిర్డీ విమానాశ్రయంలో కొత్త సమీకృత టెర్మినల్ భవన నిర్మణానికి శంకుస్థాపన చేశారు. అలాగే రాష్ట్రంలో 10 ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కిల్స్ (ఐఐఎస్)-ముంబయి సహా మహారాష్ట్రలో విద్యా వ్యవస్థ పర్యవేక్షణ కేంద్రానికి శ్రీ మోదీ ప్రారంభోత్సవం చేశారు.మహారాష్ట్రలోని వాషిమ్‌లో వ్యవసాయ, పశుసంవర్ధక రంగ కార్యక్రమాలను ప్రారంభించిన సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగం
October 05th, 12:05 pm
మహారాష్ట్ర గవర్నర్ సీ.పీ.రాధాకృష్ణన్ గారు.. ప్రముఖ ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే గారు.. కేంద్ర మంత్రివర్గంలోని నా సహచరులు శివరాజ్ సింగ్ చౌహాన్, రాజీవ్ రంజన్ సింగ్.. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్.. ఇతర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మంత్రులు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన బంజారా సామాజిక వర్గానికి చెందిన నా సోదరసోదరీమణులు, దేశవ్యాప్తంగా ఉన్న రైతు సోదర సోదరీమణులు.. ఇతర గౌరవనీయులైన ప్రముఖులు, మహారాష్ట్ర సోదర సోదరీమణులారా.. ఈ పవిత్ర భూమి వాషిం నుంచి పోహ్రాదేవికి భక్తిశ్రద్ధలతో నమస్కరిస్తున్నాను. నవరాత్రుల సందర్భంగా ఈ రోజు జగదాంబ అమ్మవారి ఆశీస్సులు పొందే భాగ్యం కలిగింది. సంత్ సేవాలాల్ మహరాజ్, సంత్ రాంరావ్ మహారాజ్ సమాధిని సందర్శించి వారి ఆశీస్సులు తీసుకున్నాను. ఈ వేదిక మీద నుంచి ఈ ఇద్దరు మహానుభావులకు శిరస్సు వంచి నివాళులు అర్పిస్తున్నాను.మహారాష్ట్రలోని వాషిమ్‌లో రూ.23,300 కోట్ల విలువైన వ్యవసాయ-పశుసంవర్ధక రంగ కార్యక్రమాలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రీకారం
October 05th, 12:01 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ మహారాష్ట్రలోని వాషిమ్‌లో రూ.23,300 కోట్ల విలువైన వ్యవసాయ-పశుసంవర్ధక రంగ కార్యక్రమాలను ప్రధానమంత్రి ప్రారంభించారు. ఇందులో భాగంగా ‘పిఎం-కిసాన్ నిధి’ 18వ విడత నిధుల పంపిణీతోపాటు ‘నమో షేత్కారీ మహాసన్మాన్ నిధి యోజన’ 5వ విడతకు శ్రీకారం చుట్టారు. అలాగే వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి (ఎఐఎఫ్) కింద 7,500కుపైగా ప్రాజెక్టులను, 9,200 రైతు ఉత్పత్తిదారు సంస్థలు సహా మహారాష్ట్రలో 19 మెగావాట్ల ఉత్పాదక సామర్థ్యంగల అయిదు సౌర పార్కులను దేశానికి అంకితం చేశారు. అంతేకాకుండా పశుగణాభివృద్ధి దిశగా ఏకీకృత జీనోమిక్ చిప్‌తోపాటు జాతి-లింగ ఎంపికపై దేశీయ పశువీర్య సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రధాని ప్రారంభించారు.అక్టోబర్ 5 న మహారాష్ట్రలో ప్రధానమంత్రి పర్యటన
October 04th, 05:39 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శనివారం (అక్టోబర్ 5న) మహారాష్ట్రలో పర్యటిస్తారు. ఉదయం 11.15 గంటలకు వాసిమ్ చేరుకుని పోహరాదేవి జగదాంబ మాత ఆలయంలో దర్శనం చేసుకుంటారు. వాసిమ్ లోని సంత్ సేవాలాల్ మహరాజ్, సంత్ రామ్ రావ్ మహారాజ్ సమాధుల వద్ద నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత ఉదయం 11.30 గంటలకు బంజారా సమాజం గొప్ప వారసత్వాన్ని చాటిచెప్పే బంజారా విరాసత్ మ్యూజియాన్ని ప్రధాని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు వ్యవసాయ, పశుసంవర్ధక రంగానికి సంబంధించిన సుమారు రూ.23,300 కోట్ల విలువైన పలు కార్యక్రమాలను ప్రారంభిస్తారు. సాయంత్రం 4 గంటలకు థానేలో రూ.32,800 కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత సాయంత్రం 6 గంటలకు బీకేసీ మెట్రో స్టేషన్ నుంచి ముంబైలోని ఆరే జేవీఎల్ఆర్ వరకు నడిచే మెట్రో రైలును జెండా ఊపి ప్రారంభిస్తారు. బీకేసీ, శాంతాక్రజ్ స్టేషన్ల మధ్య మెట్రోలో శ్రీ మోదీ ప్రయాణం చేయనున్నారు.స్వచ్చతా హీ సేవ - 2024 కార్యక్రమంలో ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం - తెలుగు అనువాదం
October 02nd, 10:15 am
నేడు పూజ్య బాపూజీ, లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి. ఈ భరతమాత గొప్ప కుమారులకు వినమ్రంగా నమస్కరిస్తున్నాను. గాంధీజీ, ఇతర మహనీయులు భారతదేశం కోసం కన్న కలను సాకారం చేసేందుకు కలిసి పనిచేయడానికి ఈ రోజు మనందరికీ స్ఫూర్తినిస్తుంది.స్వచ్ఛభారత్ దివస్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
October 02nd, 10:10 am
పరిశుభ్రత కోసం అత్యంత ముఖ్యమైన సామూహిక ఉద్యమాల్లో ఒకటైన స్వచ్ఛ భారత్ మిషన్ ప్రారంభించి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు. గాంధీ 155వ జయంతి సందర్భంగా న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఈ స్వచ్ఛభారత్ దివస్ 2024 కార్యక్రమం నిర్వహించారు. అమృత్, అమృత్ 2.0, నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా, గోబర్ధన్ పథకాల కింద పలు ప్రాజెక్టులతో పాటు మొత్తం రూ. 9600 కోట్ల విలువైన అనేక పారిశుధ్య, పరిశుభ్రతా ప్రాజెక్టులను ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ మోదీ శంకుస్థాపన చేసి, ప్రారంభించారు. ‘స్వభావ స్వచ్ఛత, సంస్కార స్వచ్ఛత’ ఈ ఏడాది స్వచ్ఛతా హి సేవా నినాదం అని తెలిపారు.