శ్రీ అనిల్ మాధవ్ దవే కన్నుమూత పట్ల సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి
May 18th, 10:56 am
పర్యావరణ మంత్రి శ్రీ అనిల్ మాధవ్ దవే మృతి పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ‘‘నా స్నేహితుడు, చాలా గౌరవనీయుడైన సహోద్యోగి, పర్యావరణ మంత్రి అనిల్ మాధవ్ దవే గారు ఆకస్మికంగా మరణించడం నన్ను పూర్తిగా దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇదే నా సంతాపం. నేను గత సాయంత్రం పొద్దు పోయే వరకు విధానపరంగా కీలకమైనటువంటి అంశాలను చర్చిస్తూ ఆయన తోనే ఉన్నాను. ఈ మరణం నాకు వ్యక్తిగతంగా లోటును మిగిల్చింది’’ అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.