అయోధ్యలో పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, అంకితం , శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాన మంత్రి ప్రసంగం

December 30th, 02:15 pm

మోడీ హామీకి అంత బలం ఉంది ఎందుకంటే మోడీ ఏదైనా చెప్పినప్పుడు, దానిని నెరవేర్చడానికి ఆయన తన జీవితాన్ని అంకితం చేస్తారు. మోడీ హామీపై నేడు దేశంలో నమ్మకం ఉంది, ఎందుకంటే మోడీ హామీ ఇచ్చినప్పుడు, దానిని నెరవేర్చడానికి ఆయన రాత్రింబవళ్లు కష్టపడతారు. అయోధ్య నగరం కూడా దీనికి సాక్ష్యం. ఈ పవిత్రమైన నగరాన్ని అభివృద్ధి చేయడంలో మేము ఏ మాత్రం వెనకడుగు వేయబోమని ఈ రోజు నేను అయోధ్య ప్రజలకు భరోసా ఇస్తున్నాను. శ్రీరాముడు మనందరినీ ఆశీర్వదించాలి, ఈ కోరికతో నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. శ్రీరాముని పాదాలకు నమస్కరిస్తున్నాను. అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు. నాతో కలిసి ఇలా చెప్పండి:

ప్రధానమంత్రి చేతులమీదుగా రూ.15,700 కోట్లకుపైగా విలువైన పలు అభివృద్ధి పథకాలు ప్రారంభం.. జాతికి అంకితం.. శంకుస్థాపన

December 30th, 02:00 pm

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ ఉత్త‌రప్ర‌దేశ్‌లోని అయోధ్య క్షేత్రంలో రూ.15,700 కోట్లకుపైగా విలువైన అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం, జాతికి అంకితం, శంకుస్థాపన చేశారు. వీటిలో అయోధ్య, దాని పరిసర ప్రాంతాల్లోని సుమారు రూ.11,100 కోట్ల విలువైన ప్రాజెక్టులతోపాటు రాష్ట్రంలోని ఇతర ప్రాజెక్టులకు సంబంధించిన రూ.4600 కోట్ల విలువైన కార్యక్రమాలున్నాయి. దీనికిముందు పునర్నవీకృత అయోధ్య రైల్వే స్టేషన్‌ను ప్రారంభించిన ఆయన, కొత్త అమృత భారత్, వందే భారత్ రైళ్లను జెండా ఊపి సాగనంపారు. వీటితోపాటు అనేక ఇతర రైల్వే ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. ఆ తర్వాత అయోధ్యలో కొత్త విమానాశ్రయాన్ని ప్రధాని ప్రారంభించి, దీనికి ‘మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం’గా నామకరణం చేశారు.

డెహ్రాడూన్‌-ఢిల్లీ మధ్య వందే భారత్‌ ఎక్స్’ప్రెస్‌ను ప్రారంభించిన సందర్భంగా ప్రధాని ప్రసంగం తెలుగు పాఠం

May 25th, 11:30 am

ఉత్తరాఖండ్ గవర్నర్ శ్రీ గుర్మీత్ సింగ్, ప్రజాదరణగల ముఖ్యమంత్రి శ్రీ పుష్కర్ సింగ్ ధామి, రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మేయర్లు, జిల్లా పరిషత్ సభ్యులు, ఇతర ప్రముఖులుసహా ఉత్తరాఖండ్‌లోని నా ప్రియతమ సోదర సోదరీమణులు…అందరికీ వందనాలు! రాష్ట్రం నుంచి వందే భారత్ ఎక్స్‌’ప్రెస్ రైలు ప్రారంభిస్తున్న సందర్భంగా ఉత్తరాఖండ్ ప్రజలందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను.

డెహ్రాడూన్ - ఢిల్లీ వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను జెండా ఊపి ప్రారంభించిన ప్రధానమంత్రి

May 25th, 11:00 am

డెహ్రాడూన్ నుంచి ఢిల్లీకి వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వీడియో కాన్ఫ రెన్స్ ద్వారా జెండా ఊపి ప్రారంభించారు. కొత్తగా విద్యుదీకరణ చేసిన రైలు మార్గాలను జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి, ఉత్తరాఖండ్ ను నూరు శాతం విద్యుత్ రైలు మార్గాల (100% ఎలక్ట్రిక్ ట్రాక్షన్) రాష్ట్రంగా ప్రకటించారు.