‘స్వచ్ఛ భారత్ మిషన్’కు పదేళ్లు పూర్తయిన నేపథ్యంలో అక్టోబరు 2న ‘స్వచ్ఛ భారత్ దివస్-2024’లో పాల్గొంటున్న ప్రధాని
September 30th, 08:59 pm
పరిశుభ్రత దిశగా అత్యంత కీలక ప్రజా ఉద్యమాలలో ఒకటైన ‘స్వచ్ఛ భారత్ మిషన్’ (ఎస్‌బిఎం)కు శ్రీకారం చుట్టి 10 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో అక్టోబరు 2న గాంధీజీ 155వ జయంతి నాడు నిర్వహించే ‘స్వచ్ఛ భారత్ దివస్-2024’ కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొంటారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఉదయం 10:00 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది.44వ ప్రగతి సదస్సుకు ప్రధాని అధ్యక్షత
August 28th, 06:58 pm
క్రియాశీల పాలన, సకాలంలో అమలు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో కూడిన ఐసీటీ ఆధారిత బహువిధ వేదిక ప్రగతి 44వ ఎడిషన్ సమావేశానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ముందుగా నేడు అధ్యక్షత వహించారు. మూడో దఫాలో ఇదే తొలి సమావేశం.‘పట్టణ ప్రాంతాల కు సంబంధించిన ప్రణాళిక రచన, అభివృద్ధి మరియు పారిశుధ్యం’ అనే అంశం పై బడ్జెటు అనంతరం ఏర్పాటైన వెబినార్ ను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం
March 01st, 10:20 am
స్వాతంత్ర్యం తర్వాత మన దేశంలో కొన్ని ప్రణాళికాబద్ధమైన నగరాలు మాత్రమే నిర్మించబడటం దురదృష్టకరం. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి గత 75 సంవత్సరాలలో 75 కొత్త మరియు ప్రధాన ప్రణాళికాబద్ధమైన నగరాలు నిర్మించబడి ఉంటే, ఈ రోజు భారతదేశం యొక్క చిత్రం పూర్తిగా భిన్నంగా ఉండేది. కానీ ఇప్పుడు 21వ శతాబ్దంలో, భారతదేశం శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విధంగా, భవిష్యత్తులో భారతదేశానికి అనేక కొత్త నగరాలు అవసరం కానున్నాయి.‘పట్టణ ప్రాంతాల కు సంబంధించిన ప్రణాళిక రచన, అభివృద్ధి మరియు పారిశుధ్యం’ అనే అంశం పై బడ్జెటు అనంతరం ఏర్పాటైనవెబినార్ ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
March 01st, 10:00 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘పట్టణ ప్రాంతాల అభివృద్ధి పట్ల ప్రణాళిక రచన లో శ్రద్ధ’ అనే అంశం పై బడ్జెటు అనంతర కాలం లో ఏర్పాటైన ఒక వెబినార్ ను ఉద్దేశించి ప్రసంగించారు. యూనియన్ బడ్జెటు 2023 లో ప్రకటించిన కార్యక్రమాల ను ప్రభావశీలమైన విధం గా అమలు పరచడం కోసం ఉపాయాల ను మరియు సూచనల ను కోరుతూ ప్రభుత్వం నిర్వహిస్తున్న బడ్జెటు అనంతర వెబినార్ లు పన్నెండిటి లో ఈ వెబినార్ ఆరో వెబినార్ గా ఉంది.ఆజాదీ@75 సమావేశాన్ని, ఎక్స్ పో ను లఖ్ నవూ లో ప్రారంభించిన సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం
October 05th, 10:31 am
ఉత్తరప్రదేశ్ గవర్నర్ శ్రీ ఆనందీబెన్ పటేల్ గారు, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు లక్నో ఎంపి మా సీనియర్ సహచరులు శ్రీ రాజ్ నాథ్ సింగ్ గారు, శ్రీ హర్ దీప్ సింగ్ పూరి గారు, మహేంద్ర నాథ్ పాండే గారు, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ కేశవ్ ప్రసాద్ మౌర్య గారు, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు శ్రీ దినేష్ శర్మ గారు, శ్రీ కౌశల్ కిశోర్ గారు, రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, దేశంలోని వివిధ ప్రాంతాల నుండి గౌరవనీయులైన మంత్రులు, ఇతర ప్రముఖులు మరియు ఉత్తరప్రదేశ్ కు చెందిన నా ప్రియమైన సోదరీ సోదరులు.‘ఆజాదీ@75 - న్యూ అర్బన్ ఇండియా: ట్రాన్స్ ఫార్మింగ్ అర్బన్ ల్యాండ్ స్కేప్’ సమావేశాన్ని, ఎక్స్ పో ను లఖ్ నవూ లో ప్రారంభించిన ప్రధాన మంత్రి
October 05th, 10:30 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజున లఖ్ నవూ లో ‘ఆజాదీ @75 – న్యూ అర్బన్ ఇండియా: ట్రాన్స్ ఫార్మింగ్ అర్బన్ ల్యాండ్ స్కేప్’ శీర్షిక తో జరిగిన ఒక సమావేశాన్ని, ఎక్స్ పో ను ప్రారంభించారు. ఈ కార్యక్రమాని కి కేంద్ర మంత్రులు శ్రీ రాజ్ నాథ్ సింహ్, శ్రీ హర్ దీప్ పురీ, శ్రీ మహేంద్ర నాథ్ పాండే, శ్రీ కౌశల్ కిశోర్, ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ శ్రీమతి ఆనందీబెన్ పటేల్ లతో పాటు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ కూడా హాజరు అయ్యారు.స్వచ్ఛ్ భారత్ మిషన్-అర్బన్ 2.0 ను, అమృత్ 2.0 ను ప్రారంభించిన సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం
October 01st, 11:01 am
నమస్కారం! ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి వర్గ సహచరులు శ్రీ హర్దీప్ సింగ్ పూరి జీ, శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ జీ, శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్ జీ, శ్రీ కౌశల్ కిషోర్ జీ, శ్రీ బిశ్వేశ్వర్ జీ, అన్ని రాష్ట్రాల మంత్రులు, మేయర్‌లు మరియు పట్టణ స్థానిక సంస్థల ఛైర్మన్‌లు, మునిసిపల్ కమిషనర్లు, స్వచ్ఛ భారత్ మిషన్ మరియు అమృత్ స్కీమ్ సహచరులు, లేడీస్ అండ్ జెంటిల్మెన్!స్వచ్ఛ్ భారత్ మిశన్-అర్బన్ 2.0 ను, అమృత్ 2.0 నుప్రారంభించిన ప్రధాన మంత్రి
October 01st, 11:00 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ఇక్కడ స్వచ్ఛ్ భారత్ మిశన్-అర్బన్ 2.0 ను, అటల్ మిశన్ ఫర్ రిజూవినేశన్ ఎండ్ అర్బన్ ట్రేన్స్‌ఫర్ మేశన్ 2.0 (ఎఎమ్ఆర్ యుటి.. ‘అమృత్’) ను ప్రారంభించారు. ఈ సందర్భం లో కేంద్ర మంత్రులు శ్రీ హర్ దీప్ సింహ్ పురీ, శ్రీ గజేంద్ర సింహ్ శెఖావత్, శ్రీ ప్రహ్ లాద్ సింహ్ పటేల్, శ్రీ కౌశల్ కిశోర్, శ్రీ శ్రీ బిశ్వేశ్వర్ టుడూ, రాష్ట్రాల మంత్రులు, మేయర్ లు, పట్టణ, స్థానిక సంస్థ ల చైర్ పర్సన్ లు, మ్యూనిసిపల్ కమిశనర్ లు పాలుపంచుకొన్నారు.స్వచ్ఛ్ భారత్ మిశన్- అర్బన్ 2.0 ను, అమృత్ 2.0 ను అక్టోబర్ 1 న ప్రారంభించనున్న ప్రధాన మంత్రి
September 30th, 01:45 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఒక చారిత్రిక చొరవ లో భాగం గా 2021 అక్టోబరు 1వ తేదీన ఉదయం 11 గంటల కు న్యూ ఢిల్లీ లోని ఆమ్బేడ్ కర్ ఇంటర్ నేశనల్ సెంటర్ లో స్వచ్ఛ్ భారత్ మిశన్-అర్బన్ 2.0 ను, దానితో పాటు అటల్ మిశన్ ఫర్ రిజూవినేశన్ ఎండ్ అర్బన్ ట్రేన్స్‌ఫర్ మేశన్ (ఎఎమ్ఆర్ యుటి.. ‘అమృత్’) 2.0 ను కూడా ప్రారంభించనున్నారు.