హర్యానాలోని ఫరీదాబాద్‌లో అమృత ఆసుపత్రి ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం
August 24th, 11:01 am
అమృత ఆసుపత్రి రూపంలో మనందరికీ దీవెనలు పంచుతున్న మా అమృతానందమయి జీకి నేను నమస్కరిస్తున్నాను. స్వామి అమృతస్వరూపానంద పూరీ జీ, హర్యానా గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ జీ, ముఖ్యమంత్రి శ్రీ మనోహర్ లాల్ జీ, నా క్యాబినెట్ సహచరుడు క్రిషన్ పాల్ జీ, హర్యానా ఉప ముఖ్యమంత్రి శ్రీ దుష్యంత్ చౌతాలా జీ, ఇతర ప్రముఖులు, లేడీస్ అండ్ జెంటిల్మెన్!ఫరీదాబాద్ లో అత్యాధునికమైన అమృత హాస్పిటల్ ను ప్రారంభించిన ప్రధాన మంత్రి
August 24th, 11:00 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఫరీదాబాద్ లో అత్యాధునిక అమృత హాస్పిటల్ ను ఈ రోజు న ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో పాలుపంచుకొన్నవారిలో హరియాణా గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ, హరియాణా ముఖ్యమంత్రి శ్రీ మనోహర్ లాల్, ఉప ముఖ్యమంత్రి శ్రీ దుష్యంత్ చౌటాలా, కేంద్ర మంత్రి శ్రీ క్రిష్ణ పాల్ గుర్జర్, శ్రీ మాత అమృతానందమయి తదితరులు కూడా ఉన్నారు.ఆగస్టు 24వ తేదీ నాడు హరియాణా ను మరియు పంజాబ్ నుసందర్శించనున్న ప్రధాన మంత్రి
August 22nd, 01:55 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022వ సంవత్సరం ఆగస్టు 24వ తేదీ నాడు హరియాణా ను మరియు పంజాబ్ ను సందర్శించనున్నారు. ప్రధాన మంత్రి రెండు ముఖ్యమైన ఆరోగ్య సదుపాయాలను ఆ రోజు న ప్రారంభించడం / దేశ ప్రజల కు అంకితం చేయడం చేస్తారు. ఉదయం సుమారు 11 గంటల వేళ లో హరియాణా లోని ఫరీదాబాద్ లో అమృత హాస్పిటల్ ను ప్రధాన మంత్రి ప్రారంభిస్తారు. ఆ తరువాత, ఆయన మొహాలీ కి బయలుదేరి వెళ్లి, సుమారు 2 గంటల 15 నిమిషాల వేళ లో సాహిబ్ జాదా అజీత్ సింహ్ నగర్ జిల్లా (మొహాలీ) లోని న్యూ చండీగఢ్ పరిధి లో గల ముల్లాన్ పుర్ లో ‘హోమీ భాభా కేన్సర్ హాస్పిటల్ ఎండ్ రిసర్చ్ సెంటర్’ ను దేశ ప్రజల కు అంకితం చేస్తారు.