గుజరాత్ అమ్రేలీలో అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

October 28th, 04:00 pm

వేదికపైనున్న గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవ్ వ్రత్ గారూ, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయ్ పటేల్, నా మంత్రివర్గ సహచరుడు శ్రీ సీ ఆర్ పాటిల్ గారూ, గుజరాత్ అక్కాచెల్లెళ్ళూ, అన్నదమ్ములూ, ముఖ్యంగా అమ్రేలీ సోదర సోదరీమణులారా..

గుజరాత్‌లోని అమ్రేలీలో ₹4,900 కోట్ల విలువైన అభివృద్ధి పనులు ప్రారంభం... ప్రధానమంత్రి శ్రీ మోదీ శంకుస్థాపన

October 28th, 03:30 pm

ఈ సందర్భంగా ప్రసంగిస్తూ- దేశమంతటా ఉప్పొంగుతున్న దీపావళి, ధంతేరాస్ పండుగల స్ఫూర్తిని ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ పండుగ‌లు మన సంస్కృతిని ఘనంగా చాటుతాయని, అలాగే ప్రగతి పురోగ‌మన వేగానికీ అంతే ప్రాముఖ్యం ఉంటుందని గుర్తుచేశారు. వడోదరలో నేటి తన పర్యటనను ప్రస్తావిస్తూ- గుజరాత్ అంతటా చేపడుతున్న అనేక కీలక ప్రాజెక్టుల గురించి తాజా సమాచారాన్ని ప్రజలతో పంచుకున్నారు. వీటిలో భాగంగా భారత వైమానిక దళం కోసం దేశీయ విమానాల తయారీకి ఈ నగరంలో ఏర్పాటు చేసిన తొలి కర్మాగారాన్ని ఆయన ప్రారంభించారు. దీనికిముందు అమ్రేలీలో ‘భారతమాత’ సరోవరం ప్రారంభించడాన్ని గుర్తుచేస్తూ- జల సంరక్షణ కార్యక్రమాలు సహా రైల్వేలు, రహదారుల సంబంధిత అనేక భారీ ప్రాజెక్టులను ప్రారంభించామని, మరికొన్నిటికి శంకుస్థాపన చేశామని వివరించారు. ఈ ప్రాజెక్టుల ద్వారా సౌరాష్ట్ర, కచ్‌ ప్రాంతాల్లోని ప్రజల జీవన సౌలభ్యం మెరుగవుతుందని చెప్పారు. అంతేగాక స్థానిక రైతుల సౌభాగ్యానికి, ఈ ప్రాంతంలో ప్రగతి వేగం పుంజుకోవడానికి ఇవి దోహదం చేస్తాయన్నారు. మరోవైపు యువతకు సరికొత్త ఉపాధి అవకాశాలు అందివస్తాయన్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నిటిపై ప్రజానీకానికి అభినందనలు తెలిపారు.

ఈనెల 28న గుజరాత్‌లో పర్యటించనున్న పీఎమ్

October 26th, 03:28 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈనెల 28న గుజరాత్‌లో పర్యటించనున్నారు. ఆ రోజున ఉదయం 10 గంటలకు టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (టీఏఎస్ఎల్) క్యాంపస్ ఆవరణలో సీ-295 విమానాల తయారీ కోసం నిర్మించిన టాటా ఎయిర్‌క్రాఫ్ట్ కాంప్లెక్స్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, స్పానిష్ ప్రధానమంత్రి శ్రీ పెడ్రో శాంచెజ్‌తో కలిసి ప్రారంభిస్తారు. అనంతరం, సుమారు 11 గంటలకు, ఆయన వడోదరలోని లక్ష్మీ విలాస్ ప్యాలెస్‌ను సందర్శిస్తారు. వడోదర నుంచి సుమారు మధ్యాహ్నం 2.45 గంటలకు అమ్రేలీకి చేరుకుని దుధాలా వద్ద భారత్ మాతా సరోవర్‌ను ఆయన ప్రారంభిస్తారు. సుమారుగా 3 గంటలకు ఆయన అమ్రేలీలోని లథీ వద్ద రూ.4800ల కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించి, శంకుస్థాపనలు చేస్తారు.

శ్రీ ఖోదల్ ధామ్ ట్రస్ట్-క్యాన్సర్ ఆసుపత్రి శంకుస్థాపన సందర్భంగా ప్రధాన మంత్రి వీడియో సందేశం

January 21st, 12:00 pm

ఈ రోజు, ఈ శుభ సందర్భంలో, ఖోడాల్ ధామ్ యొక్క పవిత్ర భూమితో మరియు మా ఖోడాల్ యొక్క అంకితభావం కలిగిన అనుచరులతో కనెక్ట్ కావడం నాకు గౌరవంగా ఉంది. ప్రజాసంక్షేమం, సేవారంగంలో శ్రీ ఖోదల్ ధామ్ ట్రస్ట్ మరో ముఖ్యమైన కార్యక్రమాన్ని చేపట్టింది. అమ్రేలిలో క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ నిర్మాణం ఈ రోజు ప్రారంభమైంది. మరికొద్ది వారాల్లో కగ్వాడ్ లోని శ్రీ ఖోదల్ ధామ్ ట్రస్ట్ స్థాపించి 14 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సంబరాలు జరుపుకోబోతున్నాం. ఈ మహత్తర ఘట్టాలకు అందరికీ నా శుభాకాంక్షలు.

శ్రీ ఖోడ‌ల్ ధామ్‌ ట్రస్ట్ వారి కేన్సర్ ఆస్పత్రికి శంకుస్థాపన సందర్భంగా వీడియో సందేశం ద్వారా ప్రధాని ప్రసంగం

January 21st, 11:45 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ శ్రీ ఖోడ‌ల్ ధామ్‌ ట్రస్ట్ వారి కేన్సర్ ఆస్పత్రి శంకుస్థాపన కార్యక్రమంలో భాగంగా వీడియో సందేశం ద్వారా ప్రసంగించారు. ఖోడల్ ధామ్ పవిత్ర భూమితో, ఖోడల్ మాత భక్తులతో ఈ విధంగా మమేకం కావడం తన అదృష్టంగా భావిస్తున్నానని ఈ సందర్భంగా ఆయన సంతోషం వెలిబుచ్చారు. అమ్రేలిలో కేన్సర్ ఆస్పత్రి, పరిశోధన కేంద్రాలకు శంకుస్థాపన ద్వారా శ్రీ ఖోడల్ ధామ్ ట్రస్ట్ ప్రజా సంక్షేమ/సేవా రంగాల్లో మరో ముఖ్యమైన ముందడుగు వేసిందని శ్రీ మోదీ వివరించు. శ్రీ ఖోడల్ ధామ్ ట్రస్ట్-కాగ్వాడ్ స్థాపించి త్వరలో 14 సంవత్సరాలు పూర్తి చేసుకోనున్న నేపథ్యంలో ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

గుజరాత్ నా ఆత్మ, భారత్ నా పరమాత్మ: ప్రధాని నరేంద్ర మోదీ

November 27th, 12:19 pm

కచ్, జస్డాన్ మరియు అమ్రేలిల బహిరంగ సభలలో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ గుజరాత్ ను నిర్లక్ష్యం చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. కాంగ్రెస్ దుర్పరిపాలన కచ్ ప్రాంతాన్ని మరియు మొత్తం గుజరాత్ యొక్క అభివృద్ధిపై తీవ్రంగా ప్రభావితం చూపిందని ఆరోపించారు.

రైతులు అవసరాలు మరియు సమస్యల పట్ల సున్నితంగా ఉన్న ప్రభుత్వం మాది: ప్రధాని మోదీ

September 17th, 03:43 pm

అమ్రేలి బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ, సహకార రంగంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. వ్యవసాయం మరియు పాడి పరిశ్రమతో ముడిపడి ఉన్న వ్యక్తుల జీవితాలను మార్చేందుకు కేంద్రం అమలుచేసిన అనేక కార్యక్రమాలు గురించి ఆయన మాట్లాడారు. అతను ఇ-ఎన్ఎఎం గురించి హైలైట్ చేశారు మరియు అది మార్కెట్లకు మంచి ప్రవేశం కల్పించడం ద్వారా రైతులకు ఎలా ప్రయోజనం చేకూరుస్తుందో కూడా తెలిపారు

అమ్ రేలీ లో జ‌రిగిన స‌హ‌కార్ స‌మ్మేళ‌న్ ను ఉద్దేశించి ప్ర‌సంగించిన ప్ర‌ధాన మంత్రి

September 17th, 03:42 pm

అమ్ రేలీ లో కొత్త‌గా నిర్మించిన ఎపిఎమ్‌సి మార్కెట్ యార్డును ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. అమ‌ర్ డెయిరీ లో ఒక కొత్త ప్లాంటును కూడా ఆయ‌న ప్రారంభించారు. తేనె ఉత్ప‌త్తి ప్లాంటుకు పునాది రాయిని వేశారు.