ఉత్తర ప్రదేశ్ లోని వారణాసిలో వివిధ ప్రాజెక్టుల సమర్పణ, శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాన మంత్రి ప్రసంగం
March 24th, 05:42 pm
యుపి గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రివర్గంలోని నా సహచరులు, రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు, శాసనసభ్యులు, ఇతర ప్రముఖులు మరియు కాశీలోని నా ప్రియమైన సోదర సోదరీమణులు!ఉత్తర్ ప్రదేశ్ లోని వారాణసీ లో 1780 కోట్ల రూపాయల కు పైగా విలువైన అభివృద్ధి పథకాల కు శంకుస్థాపన చేయడంతో పాటు దేశ ప్రజల కు అంకితం చేసిన ప్రధాన మంత్రి
March 24th, 01:15 pm
వారాణసీ లో 1780 కోట్ల రూపాయల కు పైచిలుకు విలువైన అభివృద్ధి పథకాల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న శంకుస్థాపన చేయడంతో పాటు వాటి ని దేశ ప్రజల కు అంకితమిచ్చారు. ఈ పథకాల లో వారాణసీ కంటోన్మెంట్ స్టేశన్ నుండి గోదౌలియా వరకు ప్యాసింజర్ రోప్ వే కు శంకుస్థాపన చేయడం, నమామి గంగే పథకం లో భాగం గా 55 ఎమ్ఎల్ డి మురుగునీటి శుద్ధి ప్లాంటు ను భగవాన్ పుర్ లో ఏర్పాటు చేయడం, సిగ్ రా స్టేడియమ్ పునరభివృద్ధి పనుల తాలూకు రెండో దశ, మూడో దశ, సేవాపురీ లోని ఇస్ రవర్ గ్రామం లో హిందుస్తాన్ పెట్రోలియమ్ కార్పొరేశన్ లిమిటెడ్ ఆధ్వర్యం లో నిర్మాణం కాబోయే ఎల్ పిజి బాట్లింగ్ ప్లాంటు, భర్ థరా గ్రామం లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, దుస్తులు మార్చుకొనేందుకు సదుపాయం తో కూడినటువంటి ఒక ఫ్లోటింగ్ జెట్టి తదితర పథకాలు భాగం గా ఉన్నాయి. ప్రధాన మంత్రి ఇంకా జల్ జీవన్ మిశన్ లో భాగం గా 19 త్రాగునీటి పథకాల ను కూడా దేశ ప్రజల కు అంకితం చేశారు. అవి 63 గ్రామ పంచాయతుల లో 3 లక్షల మంది కి పైగా ప్రజల కు లబ్ధిని చేకూర్చనున్నాయి. ఇదే మిశన్ లో భాగం గా 59 త్రాగునీటి పథకాల కు ఆయన శంకుస్థాపన చేశారు. కర్ ఖియావ్ లో ఒక ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ ను సైతం ఆయన దేశ ప్రజల కు అంకితం చేశారు. ఈ ప్లాంటు లో కాయగూరలు మరియు ఫలాల ను గ్రేడింగ్ చేయడం, సార్టింగ్ చేయడం, ఇంకా ప్రాసెసింగ్ చేయడం జరుగుతుంది. వారాణసీ స్మార్ట్ సిటీ మిశన్ లో భాగం గా వివిధ పథకాల ను కూడా ఆయన దేశ ప్రజల కు అంకితం చేశారు.