భారత-ఆస్ర్టియా విస్తృత భాగస్వామ్యంపై ఉమ్మడి ప్రకటన

July 10th, 09:15 pm

ఆస్ర్టియా చాన్సలర్ కార్ల్ నెహామర్ ఆహ్వానాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2024 జూలై 9-10 తేదీల్లో ఆ దేశంలో అధికారికంగా పర్యటించారు. ఈ పర్యటన సందర్భంగా ఆయన ఆస్ర్టియా అధ్యక్షుడు మాననీయ అలెగ్జాండర్ వాన్ డెర్ బెల్లెన్ ను కలవడంతో పాటు చాన్సలర్ నెహామర్ తో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. ఇది ఆస్ర్టియాలో ప్రధానమంత్రి తొలి పర్యటన మాత్రమే కాదు, 41 సంవత్సరాల కాలంలో భారతదేశ ప్రధానమంత్రి ఒకరు ఆస్ర్టియాలో పర్యటించడం ఇదే ప్రథమం. అంతే కాదు, 2024 సంవత్సరం ఉభయదేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడిన 75వ సంవత్సరం కావడం విశేషం.

ఆస్ట్రియా అధ్యక్షుడితో ప్రధానమంత్రి సమావేశం

July 10th, 09:13 pm

ఆస్ట్రియా రాజధాని వియన్నాలో ఆ దేశాధ్యక్షుడు గౌరవనీయ అలెగ్జాండర్ వాన్ డెర్ బెలెన్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శ్రీ మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా కొనసాగడం చారిత్రకమంటూ బెలెన్ అభినందనలు తెలిపారు.

ఆస్ట్రియాలోని వియన్నా చేరుకున్న ప్రధాని మోదీ

July 09th, 11:45 pm

తన రెండు దేశాల పర్యటనలో భాగంగా రెండో విడత ప్రారంభమైన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆస్ట్రియాలోని వియన్నా చేరుకున్నారు. ప్రధాని తన పర్యటనలో అధ్యక్షుడు అలెగ్జాండర్ వాన్ డెర్ బెల్లెన్ మరియు ఛాన్సలర్ కార్ల్ నెహమ్మర్‌లను కలుస్తారు. 40 ఏళ్ల తర్వాత భారత ప్రధాని ఆస్ట్రియాలో పర్యటించడం ఇదే తొలిసారి.

రష్యన్ ఫెడరేషన్, ఆస్ట్రియా రిపబ్లిక్ ఆధికారిక పర్యటనకు బయలుదేరే ముందు గౌరవనీయ ప్రధాన మంత్రి జారీ చేసిన ప్రకటన

July 08th, 09:49 am

రష్యన్ ఫెడరేషన్ లో.. 22వ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడంతో పాటు ఆస్ట్రియా రిపబ్లిక్ లో మొదటిసారి పర్యటించడానికి గాను మూడు రోజుల అధికారిక పర్యటనకు బయలుదేరుతున్నాను.

రష్యన్ ఫెడరేషన్.. రిపబ్లిక్ ఆఫ్ ఆస్ట్రియాలలో (2024 జూలై 08-10 మధ్య) ప్రధాని పర్యటన

July 04th, 05:00 pm

ఈ మేరకు రష్యా సమాఖ్య అధ్యక్షుడు గౌరవనీయ వ్లాదిమిర్ పుతిన్ ఆహ్వానొం మేరకు 2024 జూన్ 8,9 తేదీల్లో ప్రధానమంత్రి మాస్కో సందర్శిస్తారు. ఈ సందర్భంగా వ్లాదిమిర్ పుతిన్ అధ్యక్షతన సాగే 22వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. ఇందులో భాగంగా దేశాధినేతలిద్దరూ రెండు దేశాల మధ్యగల బహుముఖ సంబంధాలను సమీక్షిస్తారు. అలాగే పరస్పర ప్రయోజనంగల సమకాలీన ప్రాంతీయ-అంతర్జాతీయ అంశాలపై అభిప్రాయాలను పంచుకుంటారు.

Phone call between Prime Minister Shri Narendra Modi and H.E. (Dr.) Alexander Van der Bellen, Federal President of the Republic of Austria

May 26th, 08:00 pm

PM Modi had a telephone conversation with President Alexander Van der Bellen of Austria. Both the leaders reiterated their shared desire to further strengthen and persify India-Austria relations in the post-Covid world.