‘ఎన్‌ఎక్స్‌టి’ సదస్సులో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

‘ఎన్‌ఎక్స్‌టి’ సదస్సులో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

March 01st, 11:00 am

‘న్యూస్‌ ఎక్స్ వరల్డ్’ శుభప్రదంగా ప్రారంభమైంది... ఈ నేపథ్యంలో మీకందరికీ నా అభినందనలతోపాటు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఆంగ్ల, హిందీ భాషలు సహా మీ నెట్‌వర్క్ పరిధిలోని ప్రాంతీయ ఛానెళ్లన్నీ కూడా ఇప్పుడు వేగంగా ప్రపంచమంతటా విస్తరిస్తున్నాయి. దీనికితోడు నేడు అనేక పరిశోధక సభ్యత్వాలు (ఫెలోషిప్‌), ఉపకార వేతనాలకు (స్కాలర్‌షిప్‌) శ్రీకారం చుట్టారు. ఈ కార్యకలాపాలన్నిటిపైనా మీకు శుభాకాంక్షలు.

ఎన్ఎక్స్‌టీ కాన్‌క్లేవ్‌లో పాల్గొన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

ఎన్ఎక్స్‌టీ కాన్‌క్లేవ్‌లో పాల్గొన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

March 01st, 10:34 am

న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఈ రోజు జరిగిన ఎన్ఎక్స్‌టీ కాన్‌క్లేవ్‌లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొని, ప్రసంగించారు. న్యూస్ఎక్స్ వరల్డ్ ప్రారంభ సందర్భంగా హృదయపూర్వక అభినందనలు తెలిపారు. హిందీ, ఇంగ్లీష్‌లతో పాటు వివిధ ప్రాంతీయ భాషల్లో ఛానల్‌లను కలిగి ఉన్న ఈ నెట్‌వర్క్‌ ప్రపంచవ్యాప్తంగా విస్తరించించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. పలు ఫెలోషిప్‌లు, ఉపకారవేతనాల ప్రారంభాన్ని ప్రస్తావించిన ప్రధానమంత్రి ఈ కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు.

ఫ్రాన్స్ అధ్యక్షుడితో ప్రధాని ద్వైపాక్షిక చర్చలు

ఫ్రాన్స్ అధ్యక్షుడితో ప్రధాని ద్వైపాక్షిక చర్చలు

February 12th, 03:24 pm

భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు శ్రీ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఫ్రాన్స్ అధ్యక్ష విమానంలో పారిస్ నుంచి మార్సిలే వరకు మంగళవారం కలిసి ప్రయాణించారు. ఇద్దరు నాయకుల మధ్య సాన్నిహిత్యాన్ని ఇది ప్రతిబింబిస్తోంది. ద్వైపాక్షిక సంబంధాలు, కీలక అంతర్జాతీయ, ప్రాంతీయ సమస్యలపై వారు పూర్తిస్థాయిలో చర్చలు జరిపారు. అనంతరం మార్సిలే చేరుకున్న తర్వాత ప్రతినిధుల స్థాయి చర్చలు జరిగాయి. గత 25 సంవత్సరాలుగా బహుముఖంగా, స్థిరంగా అభివృద్ధి చెందుతున్న భారత్-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యం పట్ల బలమైన నిబద్ధతను వారిద్దరూ పునరుద్ఘాటించారు.

పారిస్ లో భారత్-ఫ్రాన్స్ సీఈవో ఫోరంలో ప్రధాని ప్రసంగం

February 12th, 12:45 am

‘సృజన, సహకారం, అభ్యున్నతి’ని మంత్రప్రదంగా భావించి మీరు ముందుకు సాగుతుండడాన్ని నేను గమనించాను. మీరు కేవలం ఉన్నతాధికారుల మధ్య వారధులు మాత్రమే కాదు.. భారత్-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మీరు బలోపేతం చేస్తున్నారు.

ఎస్తోనియా అధ్యక్షుడితో ప్రధానమంత్రి భేటీ

February 11th, 06:19 pm

భారత్, ఎస్తోనియా ల మధ్య నెలకొన్న స్నేహపూర్వక సంబంధాలు ప్రజాస్వామ్యం, న్యాయపాలన, స్వాతంత్య్రం, సామ్యవాదం వంటి ఆదర్శాల ప్రాతిపదికగా ఏర్పడిందని ఇరువురు నేతలు అభిప్రాయపడ్డారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఐటీ, డిజిటల్, సాంస్కృతిక సంబంధాలు, పర్యాటకం, ఇరుదేశాల ప్రజల మధ్య స్నేహ సంబంధాలు సహా ద్వైపాక్షిక సంబంధాలు వృద్ధి చెందడం పట్ల నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు. సైబర్ భద్రత అంశంలో ఇరుదేశాల మధ్య కొనసాగుతున్న పరస్పర సహకారాన్ని గురించి నేతలు చర్చించారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్ లో పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని, డిజిటల్ ఇండియా వంటి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలంటూ ఎస్తోనియా ప్రభుత్వాన్నీ కంపెనీలనూ శ్రీ మోదీ ఆహ్వానించారు.

ప్యారిస్ ‘ఏఐ ఏక్షన్ సమిట్’ లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ముగింపు ప్రసంగం

February 11th, 05:35 pm

నేటి చర్చల వల్ల ఒక విషయం తేటతెల్లమయ్యింది – సమావేశాల్లో పాల్గొన్నభాగస్వాములందరూ ఒకే ఆశయాన్ని, ఒకే లక్ష్యాన్నీ కలిగి ఉన్నారు.

పారిస్ ఏఐ కార్యాచరణ సదస్సులో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభోపన్యాసం

February 11th, 03:15 pm

మీ వైద్య సంబంధ రిపోర్టును కృత్రిమ మేధ (ఏఐ)తో నడిచే యాప్ లో మీరు అప్లోడ్ చేస్తే.. సులభంగా అర్థమయ్యే భాషలో, ఎలాంటి వృత్తిపరమైన ప్రామాణిక పదజాలమూ లేకుండా మీ ఆరోగ్య సమాచారాన్ని అది వివరించగలదు. కానీ, మీరు అదే యాప్‌ ను ఎడమ చేతితో రాసే వ్యక్తి చిత్రాన్ని గీయమని అడిగితే, అది చాలావరకు కుడి చేతితో రాసే వారి చిత్రాన్నే గీస్తుంది. ఎందుకంటే ట్రైనింగ్ డేటాలో ఎక్కువ భాగం అదే ఉంటుంది.

పారిస్ ఏఐ కార్యాచరణ సదస్సుకు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ సహాధ్యక్షత ఏఐ ఈ శతాబ్దపు మానవీయతను రచిస్తోంది: ప్రధానమంత్రి

February 11th, 03:00 pm

పారిస్ లో జరిగిన కృత్రిమ మేధ కార్యాచరణ సదస్సుకు ఫ్రాన్స్ అధ్యక్షుడు శ్రీ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తో కలిసి భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సహాధ్యక్షత వహించారు. వారం పాటు సాగిన సదస్సు ఈనెల 6-7 తేదీల్లో సైన్స్ దినోత్సవాలతో ప్రారంభమైంది. తర్వాతి రెండు రోజులు సాంస్కృతిక వారాంతపు కార్యక్రమాలు నిర్వహించారు. ఉన్నత స్థాయి ముగింపు కార్యక్రమానికి అంతర్జాతీయ స్థాయిలో ఈ రంగానికి నేతృత్వం వహిస్తున్న ప్రముఖులు, విధాన నిర్ణేతలు, నిపుణులు హాజరయ్యారు.

ఫ్రాన్స్‌లోని పారిస్‌కు చేరుకున్న ప్రధాని మోదీ

February 10th, 10:30 pm

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితం పారిస్‌కు చేరుకున్నారు. ఆయన రాక సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఈ పర్యటన సందర్భంగా, ప్రధాని మోదీ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో చర్చలు జరుపుతారు, ఏఐ యాక్షన్ సమ్మిట్ మరియు అనేక ఇతర కార్యక్రమాలలో పాల్గొంటారు.

ఫ్రాన్స్, అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లే ముందు ప్రధానమంత్రి ప్రకటన

February 10th, 12:00 pm

ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఫ్రాన్స్, అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లే ముందు ఈ కింది విధంగా ఒక ప్రకటనను విడుదల చేశారు. అందులో ఇలా పేర్కొన్నారు:

భారత్ 76వ గణతంత్ర దినోత్సవం.. ఫ్రాన్స్ అధ్యక్షుడు, ఐర్లాండ్ ప్రధానిల శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలిపిన ప్రధానమంత్రి

January 27th, 11:06 am

భారత్ 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ఫ్రాన్స్ అధ్యక్షుడు శ్రీ ఇమ్మేన్యుయెల్ మేక్రోన్‌కు, ఐర్లాండ్ ప్రధాని శ్రీ మేఖేల్ మార్టిన్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ధన్యవాదాలు తెలియజేశారు.

ఫ్రాన్స్ అధ్యక్షునితో ప్రధానమంత్రి భేటీ

November 19th, 05:26 am

2047 ప్రణాళిక, ఇతర ద్వైపాక్షిక ప్రకటనల్లో తెలిపినట్లుగా భారత్ - ఫ్రాన్స్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని, ద్వైపాక్షిక సహకారాన్ని, అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లే విషయంలో తమ నిబద్ధతను ఇరువురు నేతలు ఈ భేటీలో పునరుద్ఘాటించారు. రక్షణ, అంతరిక్షం, పౌర అణువిద్యుత్ తదితర వ్యూహాత్మక విభాగాల్లో ద్వైపాక్షిక సహకారంలో సాధించిన పురోగతిని ప్రశంసించారు. దీనిని వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి దిశగా నడిపించేందుకు కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలిపారు. భారతదేశ జాతీయ మ్యూజియం ప్రాజెక్టులో సహకార పురోగతిని సైతం వారు సమీక్షించారు.