జోర్డాన్ రాజు కు మ‌రియు ప్ర‌ధాన మంత్రి కి మ‌ధ్య రియాద్ లో జ‌రిగిన స‌మావేశం

October 29th, 02:18 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ కింగ్ డ‌మ్ ఆఫ్ జోర్డాన్ యొక్క రాజు శ్రీ అబ్దుల్లాహ్ ద్వితీయ బిన్ ఎల్-హుసేన్ తో సౌదీ అరేబియా లోని రియాద్ లో ఈ రోజు న ఫ్యూచ‌ర్ ఇన్‌ వెస్ట్‌ మెంట్ ఇనీశియేటివ్ (ఎఫ్ఐఐ) జ‌రిగిన సంద‌ర్భం గా స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భం గా- 2018వ సంవత్సరం లో ఫిబ్రవరి 27వ తేదీ నుండి అదే సంవత్సరం లో మార్చి నెల ఒకటో తేదీ వరనకు జోర్డాన్ రాజు భారతదేశంలో జరిపిన యాత్ర సందర్భం లో సంతకాలైన ఎంఒయు లు మరియు ఒప్పంద పత్రాల ను గురించిన చర్చ సహా- ద్వైపాక్షిక సంబంధాల ను మరింత బ‌ల‌ప‌ర‌చుకోవ‌డం గురించి నేత లు ఉభ‌యులు ఒక‌రి అభిప్రాయాల ను మ‌రొక‌రి కి వెల్ల‌డించుకొన్నారు. వారు మ‌ధ్య ప్రాచ్య శాంతి ప్ర‌క్రియ ను గురించి, అలాగే ఇత‌ర ప్రాంతీయ ఘటనల‌ ను గురించి కూడాను చ‌ర్చించారు. ఉగ్ర‌వాదాన్ని ఎదురించడం లో స‌హ‌కారం అంశం పై సైతం చ‌ర్చించడమైంది.