అహింసా యాత్ర సంపన్నత సమరోహ్ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం

March 27th, 02:31 pm

ఈ కార్యక్రమంలో ఆచార్య శ్రీ మహాశ్రమన్ జీ, గౌరవనీయులైన ఋషులు, సన్యాసులు మరియు భక్తులందరూ ఇక్కడ ఉన్నారు. మన భారతదేశం వేలాది సంవత్సరాలుగా పడితులు, సాధువులు, ఋషులు, ఆచార్యుల గొప్ప సంప్రదాయానికి నెలవు. కాలక్రమేణా అనేక సవాళ్లు ఎదురైనప్పటికీ ఈ సంప్రదాయం వర్ధిల్లుతూనే ఉంది. ఇక్కడ, ఆచార్య మనకు ‘चरैवेति-चरैवेति’ (ముందుకు వెలుతూ ఉండండి, ముందుకు వెలుతూ ఉండండి) అనే మంత్రాన్ని అందించారు ; అతను ' చరైవేతి - చరైవేతి ' మంత్రం పాటిస్తూ జీవించేవాడు . శ్వేతాంబర-తేరాపంత్ చరైవేతి - చరైవేతి మరియు శాశ్వత చలనశీలత గొప్ప సంప్రదాయానికి నూతన ఒరవడిని అందించారు. ఆచార్య భిక్షువు 'కాలయాపనను నిర్మూలించడాన్ని' తన ఆధ్యాత్మిక తీర్మానంగా చేసుకున్నాడు.

అహింస యాత్ర సంపన్నత సమారోహ్కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి

March 27th, 02:30 pm

ఈ రోజు న శ్వేతాంబర్ తేరాపంథ్ యొక్క అహింస యాత్ర సంపన్నత సమారోహ్ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు.