India is a spirit where the nation is above the self: PM Modi
December 19th, 03:15 pm
PM Modi attended function marking Goa Liberation Day. PM Modi noted that even after centuries and the upheaval of power, neither Goa forgot its Indianness, nor did the rest of India forgot Goa. This is a relationship that has only become stronger with time. The people of Goa kept the flame of freedom burning for the longest time in the history of India.గోవాలో నిర్వహించిన గోవా విమోచన దినోత్సవంలో పాల్గొన్న ప్రధానమంత్రి
December 19th, 03:12 pm
గోవా విమోచన దినోత్సవం సందర్భంగా గోవాలో నిర్వహించిన వేడుకలలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్వాతంత్ర్య సమరయోధులతోపాటు ‘ఆపరేషన్ విజయ్’లో పాల్గొన్న నాటి వీరులను ఆయన సత్కరించారు. నవీకరించిన ఫోర్ట్ అగ్వాడా జైలు మ్యూజియం, గోవా వైద్య కళాశాలలో సూపర్ స్పెషాలిటీ భవన సముదాయం, న్యూ సౌత్ గోవా జిల్లా ఆస్పత్రి, మోపా ఎయిర్‌పోర్టులో విమానయాన నైపుణ్యాభివృద్ధి కేంద్రం, మార్గోవాలోని డబోలిమ్-నవేలిమ్ వద్ద ‘గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్‌స్టేషన్’సహా పలు అభివృద్ధి పథకాలను ఆయన ప్రారంభించారు. అలాగే గోవాలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్టుకు చెందిన ‘ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చి’ సంస్థకు శంకుస్థాపన చేశారు.డిసెంబర్19 న గోవా ను సందర్శించనున్న ప్రధాన మంత్రి; గోవా విమోచన దినం ఉత్సవాల లో పాల్గొంటారు
December 17th, 04:34 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ డిసెంబర్ 19 న గోవా ను సందర్శించి, మధ్యాహ్నం పూట 3 గంటల వేళ కు గోవా లోని డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ స్టేడియమ్ లో గోవా విమోచన దినోత్సవాల సంబంధిత కార్యక్రమాని కి హాజరు అవుతారు. ఆ కార్యక్రమం లో ప్రధాన మంత్రి స్వాతంత్య్ర యోధుల ను, ‘ఆపరేషన్ విజయ్’ లో పాల్గొన్న యోధుల ను సమ్మానించనున్నారు. పోర్చుగీసు పాలన నుంచి గోవా కు విముక్తి ని ఇచ్చేందుకు భారతదేశ సాయుధ దళాలు చేపట్టిన ‘ఆపరేషన్ విజయ్’ సఫలత కు గుర్తు గా ప్రతి సంవత్సరం లో డిసెంబర్ 19వ తేదీ నాడు ఒక వేడుక గా గోవా విమోచన దినాన్ని నిర్వహించడం జరుగుతున్నది.