యుగాండా పార్లమెంట్ లో ప్రధాన మంత్రి ప్రసంగం
July 25th, 01:00 pm
ఈ మహనీయమైన చట్ట సభ ను ఉద్దేశించి ప్రసంగించే ఆహ్వానాన్ని అందుకోవడం నాకు లభించిన అరుదైనటువంటి గౌరవంగా భావిస్తున్నాను. కొన్ని ఇతర దేశాల చట్టసభల్లోనూ ప్రసంగించే అవకాశం నాకు లభించింది; అయినప్పటికీ, ఇది మాత్రం చాలా విశిష్టమైంది. ఇటువంటి గౌరవం భారతదేశ ప్రధాన మంత్రి కి లభించడం ఇదే తొలి సారి. ఇది మా దేశం లోని 125 కోట్ల మంది భారతీయులకు దక్కిన గొప్ప సత్కారం. వారు అందరి స్నేహపూర్వక శుభాకాంక్షలు, హృదయపూర్వక ఆశీస్సులను ఈ చట్ట సభ కోసం.. యుగాండా ప్రజలు అందరి కోసం నేను మోసుకొచ్చాను. గౌరవనీయురాలైన మేడమ్ స్పీకర్ గారూ, మీరు అధ్యక్ష స్థానంలో ఉండడం నాకు మా లోక్ సభ ను గుర్తుకు తెస్తోంది. అక్కడ కూడా స్పీకర్ గా ఒక మహిళ ఉండడం ఇందుకు కారణం. ఇక ఈ చట్ట సభ లో యువ సభ్యులు పెద్ద సంఖ్యలో ఉండడం కూడా చూస్తున్నాను. ఇది ప్రజాస్వామ్యానికి శుభకరం. నేను యుగాండా కు వచ్చినప్పుడల్లా ఈ ‘‘ఆఫ్రికా ఆణిముత్యం’’ నన్ను మంత్రముగ్ధుడిని చేస్తూనే ఉంది. ఈ గడ్డ అపార సౌందర్యానికి, గొప్ప సహజ వనరుల సంపద కు, సుసంపన్న వారసత్వానికి నిలయంగా ఉంది. ఇక్కడి నదులు, సరస్సులు ఈ అతి పెద్ద ప్రాంతం లో నాగరకత లను పెంచి పోషించాయి.కెన్యాలోని నైరోబీలోని శ్రీ కుచీ లివా పటేల్ సమాజ్ యొక్క రజతోత్సవాలలో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రధాని మోదీ ప్రసంగ పాఠం
March 30th, 01:21 pm
కెన్యాలోని నైరోబీ శ్రీ కుచ్చి లెవా పటేల్ సమాజ్ యొక్క రజతోత్సవాలలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు.కెన్యాలోని నైరోబిలో శ్రీ కుచి లెవా పటేల్ సమాజ్ రజతోత్సవాల సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించిన ప్రధానమంత్రి.
March 30th, 01:20 pm
కెన్యాలోని నైరోబిలో శ్రీ కుచి లెవా పటేల్ సమాజ్ రజతోత్సవాల సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈరోజు ప్రసంగించారు.PM’s meetings on the sidelines of annual meeting of African Development Bank Group
May 23rd, 01:13 pm
Strengthening India’s ties with Africa, PM Narendra Modi held bilateral talks with several African heads of state. Here are a few pictures.భారతదేశం వృద్ధి యంత్రంగానూ మరియు వాతావరణ స్నేహపూర్వక అభివృద్ధిలో ఒక ఉదాహరణగా ఉండాలి: ప్రధాని
May 23rd, 11:30 am
ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క వార్షిక సమావేశం ప్రారంభోత్సవంలో ప్రసంగిస్తూ, ప్రధాని నరేంద్ర మోదీ ఆఫ్రికాతో భారతదేశం యొక్క బలమైన సంబంధాలను గురించి వివరించారు. ఆఫ్రికన్ దేశాల అవసరాలకు ప్రతిస్పందించి సహకార నమూనా ఆధారంగా ఆఫ్రికాతో భారత్ భాగస్వామ్యం ఉంటుందని ఆయన అన్నారు. నవ భారతదేశం కోసం ఆశయాన్ని ప్రధాని మరోసారి ఉటంకింస్తూ. “భారతదేశం వృద్ధి యంత్రంగానూ మరియు వాతావరణ స్నేహపూర్వక అభివృద్ధిలో ఒక ఉదాహరణగా ఉంచడమే మన లక్ష్యం అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.నేడు గుజరాత్ సందర్శించిన ప్రధాని. మంగళవారం, గాంధీనగర్లోని ఆఫ్రికన్ డెవెలప్మెంట్ బ్యాంక్ వార్షిక సమావేశాలకు హాజరవుతారు
May 22nd, 12:18 pm
ప్రధానమంత్రి, శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్ లో రెండు రోజుల పర్యటనకు బయలుదేరారు. కచ్ లో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి ప్రారంభిస్తారు మరియు శంకుస్థాపన చేస్తారు. మంగళవారం, అనగా మే 23 న, ప్రధానమంత్రి గాంధీనగర్లోని ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంకు వార్షిక సమావేశాల ప్రారంభోత్సవంలో పాల్గొంటారు.